తెలంగాణ అడ్వకేట్‌ స్టైపెండ్ స్కీమ్ : జూనియర్ లాయర్లకు ఆర్థిక సాయం
Scholarships

తెలంగాణ అడ్వకేట్‌ స్టైపెండ్ స్కీమ్ : జూనియర్ లాయర్లకు ఆర్థిక సాయం

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ జూనియర్ న్యాయవాదుల కోసం ఈ అడ్వొకేట్ స్టైపెండ్ స్కీమ్ అందుబాటుకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకు నేందుకు ఇబ్బందులు పడుతూ.. ప్రాక్టీస్‌ను వదిలేసి ఇతర రంగాల వైపు మళ్లుతున్న ఎస్సీ, ఎస్టీ యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

Advertisement

ఈ పథకం కింద లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, మొదటి మూడేళ్ళ ప్రాక్టీసులో ఉన్న జూనియర్ ఎస్సీ న్యాయవాదులకు నెలకు 1000 రూపాయలు చెప్పున స్టైపెండ్ అందిస్తారు. అదే విధంగా లా డిగ్రీ ఎన్‌రోల్‌మెంట్ కోసం 585/- రూపాయలు మరియు బుక్స్ కొనుక్కునేందుకు వన్-టైమ్ గ్రాంట్ కింద మరో 6 వేల రూపాయల సాయాన్ని అందజేస్తారు. ఈ పథకం కుటుంబంలో ఒక వ్యక్తికీ మాత్రమే వర్తింపజేస్తారు.

స్కాలర్షిప్ పేరు తెలంగాణ అడ్వొకేట్ స్టైపెండ్
స్కాలర్షిప్ టైప్ ఫైనాన్సియల్ అసిస్టెన్స్
ఎవరికి అందిస్తారు ఎస్సీ జూనియర్ లాయర్లకు
స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ = 35 ఏళ్ల లోపు వయస్సు & తొలి మూడేళ్ల ప్రాక్టీసులో ఉండాలి

తెలంగాణ అడ్వొకేట్ స్టైపెండ్ స్కీమ్ ఎలిజిబిలిటీ

  • ప్రాక్టీసులో ఉన్న జూనియర్ లాయర్లు అర్హులు
  • కుటుంబ ఆదాయం రెండు లక్షల లోపు ఉండే అభ్యర్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.
  • అభ్యర్థి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
  • దరఖాస్తు చేసే సమయానికి బ్యాంకు అకౌంట్, కుల మరియు ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ కలిగివుండాలి.

తెలంగాణ అడ్వొకేట్ స్టైపెండ్ స్కీమ్ దరఖాస్తు విధానం

తెలంగాణ అడ్వొకేట్ స్టైపెండ్ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ జిల్లా షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ అనుచరించి, దరఖాస్తుదారుడు తాను ప్రాక్టీస్‌లో ఉన్నట్లు పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్‌ సమర్పించాలి ఉంటుంది.

ఈ వివరాలతో తరువాత దశలో ప్రభుత్వ ఈపాస్ పోర్టల్ ద్వారా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో అన్ని వివరాలు సక్రమంగా ఉంటె దాన్ని ఆమోదించి, అభ్యర్థి బ్యాంకు అకౌంటులో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు.

Advertisement

Post Comment