ఎల్ఐసీ అప్రెంటిస్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ – ఖాళీలు 9,394
Latest Jobs

ఎల్ఐసీ అప్రెంటిస్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ – ఖాళీలు 9,394

ప్రభుత్వ బీమారంగా సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రతిపాదికిన అప్రెంటిస్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, 21 నుండి 30 ఏళ్ళ మధ్య యువతి, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 10 లోపు దరఖాస్తు చేసుకోండి.

Advertisement

ఈ నియామక ప్రక్రియ ద్వారా దాదాపు 9,394 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ భర్తీ ప్రక్రియ దేశ వ్యాప్తంగా వివిధ జోన్లు వారీగా చేపడుతున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో 1,408 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.  ఎంపికైన వారికీ అప్రెంటిస్ సమయంలో 51,500/- స్టైపెండ్ అందిస్తారు. తర్వాత ప్రొబేషనరీ డెవలప్మెంట్ ఆఫీసరుగా నెలకు 35,650 నుండి 90,205/- నెలకు అందిస్తారు.

ఎల్ఐసీ అప్రెంటిస్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్స్ ఖాళీలు

  • సెంట్రల్ జోన్ (భూపాల్) - 561 పోస్టులు
  • ఈస్టర్న్ జోన్ (కోల్‌కతా) - 1,049 పోస్టులు
  • ఈస్ట్ సెంట్రల్ (పాట్నా) - 669 పోస్టులు
  • నార్తర్న్ జోన్ (న్యూఢిల్లీ) - 1,216 పోస్టులు
  • నార్త్ సెంట్రల్ (కాన్పూర్) - 1,033 పోస్టులు
  • సదరన్ జోన్ (చెన్నై) - 1,516 పోస్టులు
  • సౌత్ సెంట్రల్ జోన్ (హైదరాబాద్) - 1,408 పోస్టులు
  • వెస్టర్న్ జోన్ (ముంబాయి) - 1,942 పోస్టులు

దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో 1,408 పోస్టులు అందుబాటులో ఉండగా వీటిలో విశాఖపట్నం - 57, హైదరాబాద్ - 91, మచిలీపట్నం - 112, సికింద్రాబాద్ - 94, కడప -90, నెల్లూరు - 95, రాజమండ్రి - 69, కరీంనగర్ - 42, వరంగల్ - 62, బెంగుళూరు (1) - 115, బెంగుళూరు (2) - 117, బెల్గామ్ - 66, ధార్వాడ్ - 72, మైసూరు - 108, రాయచూర్ - 83, షిమోగా - 51, ఉడిపి -84 పోస్టులు ఉన్నాయి.

ఎల్ఐసీ అప్రెంటిస్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్స్ ఎలిజిబిలిటీ

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
  • ముంబాయిలోని ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్న వారు కూడా అర్హులు.
  • ఎల్ఐసీ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగులో రెండేళ్ల అనుభవం ఉన్న వారు కూడా అర్హులు.
  • అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎల్ఐసీ అప్రెంటిస్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ షెడ్యూల్

  • దరఖాస్తు ప్రారంభం : 21 జనవరి 2023
  • దరఖాస్తు గడువు : 10 డిసెంబర్ 2023
  • అడ్మిట్ కార్డు : 04 మార్చి 2023
  • ప్రిలిమినరీ ఎగ్జామ్ : 12 మార్చి 2023
  • మెయిన్ ఎగ్జామ్ : 08 ఏప్రిల్ 2023

ఎల్ఐసీ అప్రెంటిస్ ఆఫీసర్స్ దరఖాస్తు ఫీజు

  • జనరల్ అభ్యర్థులకు : 750/-
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు : 100/-

ఎల్ఐసీ అప్రెంటిస్ ఆఫీసర్స్ దరఖాస్తు ప్రక్రియ

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎల్ఐసీ ఐబీపీఎస్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని వారు మొబైల్, ఇమెయిల్, వ్యక్తిగత, విద్య, చిరునామా మరియు ఫోటో, సిగ్నేచర్ వివరాలు పొందుపర్చడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

రెండవ దశలో ఐబీపీఎస్ రిజిస్టర్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి, ప్రస్తుత నోటిఫికేషన్ సంబంధించి జోన్, రీజనల్ మరియు ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేసుకుని, ఎగ్జామ్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తీ అవుతుంది.

అభ్యర్థి పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే సర్టిఫికేట్లు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి.

ఎల్ఐసీ అప్రెంటిస్ ఆఫీసర్స్ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ : చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్.

ఎల్ఐసీ అప్రెంటిస్ ఆఫీసర్స్ ఎగ్జామ్ నమూనా

ఎల్ఐసీ అప్రెంటిస్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్స్ ప్రిలిమినరీ పరీక్షను ప్రాథమిక స్థాయిలో అభ్యర్థులను వడపోసేందుకు నిర్వహిస్తారు. 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ ఆబ్జెక్ట్ టెస్టులో మూడు సెక్షన్లలో ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ మూడు సెక్షన్లలో జనరల్ ఇంగ్లీష్, న్యూమరికాల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అంశాలకు సంబంధించి వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

ఒక్కో సెక్షనకు 20 నిముషాలు చెప్పున, ఒక గంట వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కులు ఇవ్వబడతాయి. అభ్యర్థులు మూడు సెక్షన్లలో కనీస అర్హుత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కేటగిరి వారీగా ఉన్న ఖాళీలకు సుమారుగా 20 రేట్లు మెరిట్ అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 (30 మార్కులు ) 20 నిముషాలు
2 న్యూమరికల్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
3 రీజనింగ్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
4 మొత్తం 100 (100 మార్కులు ) 60 నిముషాలు

ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థుల నుండి పోస్టుకు 20 మందికి చెప్పున మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష  రెండు గంటల నిడివితో 160 మార్కులకు ఉంటుంది. ఎగ్జామ్ పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

మూడు సెక్షన్లుగా ఉండే ఈ పరీక్షలో ప్రతి సెక్షన్ యందు నిర్దిష్ట సమయంలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. మొదటి సెక్షన్ యందు రీజనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ సంబంధించి 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి. రెండవ సెక్షన్ యందు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

మూడవ సెక్షన్ యందు ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్స్ మార్కెటింగ్ అంశాలకు సంబంధించి 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో అందుబాటులో ఉంటుంది.

S.NO సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 రీజనింగ్ & న్యూమరికల్ ఎబిలిటీ 50 (50 మార్కులు ) 35 నిముషాలు
2 జీకే & కరెంట్ అఫైర్స్ 50 (50 మార్కులు ) 35 నిముషాలు
3 జనరల్ అవెర్నెస్ (ఇన్సూరెన్స్ & ఫైనాన్స్) 60 (60 మార్కులు ) 55 నిముషాలు
4 మొత్తం 160 (160 మార్కులు ) 120 నిముషాలు

రెండవ దశలో నిర్వహించే డిస్క్రిప్టివ్ టెస్ట్ సంబంధించి 50 మార్కులకు ఇంగ్లీషు భాషకు సంబంధించి లెటర్ రైటింగ్, డిస్క్రిప్టివ్ ఎస్సై రాయాల్సి. లెటర్ రైటింగ్ మరియు ఇంగ్లీషు వ్యాసం నిర్ణీత సమయంలో కంప్యూటర్ యందు టైపు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Post Comment