నెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Research Entrance Exams University Entrance Exams

నెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

నెస్ట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (నైసర్ భువనేశ్వర్) మరియు యూనివర్సిటీ ఆఫ్ ముంబై -డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ యందు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.

నెస్ట్ అనగా నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అని అర్ధం. నెస్ట్ ప్రవేశ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా పై రెండు యూనివర్సిటీలలో బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల యందు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అడ్మిషన్ పొందొచ్చు.

సైన్స్ రీసెర్చ్ కోర్సులకు సంబంధించి ప్రధాన భూమిక పోషిస్తున్న ఈ రెండు యూనివర్సిటీలలో అడ్మిషన్ కోసం దేశ వ్యాప్తంగా వేల మంది సైన్స్ విద్యార్థులు ఏటా పోటీపడుతుంటారు. నెస్ట్ 2023 ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Exam Name NEST 2023
Exam Type Admission
Admission For Integrated M.Sc
Exam Date 24/06/2023
Exam Duration 3.30 Hours
Exam Level National Level

నెస్ట్ 2023 ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు & సీట్లు

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులకు సంబంధించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ భువనేశ్వర్ యందు 200 కోర్సులు, మరియు యూనివర్సిటీ ఆఫ్ ముంబై యందు 57 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 27 శాతం సీట్లు ఓబీసీ విద్యార్థులకు, 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తారు.

  • ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్
  • ఎంఎస్‌సి బోటనీ / జువాలజీ
  • ఎంఎస్‌సి ఫిజిక్స్
  • ఎంఎస్‌సి కెమిస్ట్రీ

నెస్ట్ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క దిశా ప్రోగ్రాం లేదా డీఎస్టీ యొక్కఇన్స్‌పైర్ ఫ్రొగ్రాం కింద ఏడాదికి 60 వేల స్కాలర్షిప్ అందజేస్తారు. అలానే సమ్మర్ ఇంటర్‌షిప్ గ్రాంటు కింద ఏడాదికి మరో 20 వేలు అందిస్తారు.

టాప్ మెరిట్‌తో ఎంఎస్సీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భాభా అటామిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ ఎంపిక ఇంటర్వ్యూలకు నేరుగా ఎంపిక చేస్తారు. అలానే దేశంలో లేదా విదేశాలలో టాప్ యూనివర్సిటీల యందు పీహెచ్డీ చేసే అవకాశం కల్పిస్తారు.

నెస్ట్ 2023 ఎలిజిబిలిటీ

  • ఇంటర్ సైన్స్ విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • గత మూడేళ్ళలో 60 శాతం మార్కులతో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • 20 ఏళ్ళ లోపు విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు మాథ్స్ కంబినేషన్లతో ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.
  • ఎంఎస్‌సి బయాలజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు బయాలజీ కంబినేషన్లతో ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.
  • ఎంఎస్‌సి ఫిజిక్స్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు మాథ్స్/బయాలజీ కంబినేషన్లతో ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.
  • ఎంఎస్‌సి కెమిస్ట్రీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు మాథ్స్/బయాలజీ కంబినేషన్లతో ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.

 నెస్ట్ 2023 ముఖ్యమైన తేదీలు

నెస్ట్ 2023 దరఖాస్తు ప్రారంభం 27 ఫిబ్రవరి 2023
నెస్ట్ 2023 దరఖాస్తు గడువు 17 మే 2023
నెస్ట్ 2023 అడ్మిట్ కార్డు 12 జూన్ 2023
నెస్ట్ 2023 ఎగ్జామ్ తేదీ 24 జూన్ 2023
నెస్ట్ 2023 రిజల్ట్స్ 10 జులై 2023

నెస్ట్ 2023 దరఖాస్తు ఫీజు

రిజర్వేషన్ కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి 1200/-
ఎస్సీ, ఎస్టీ & దివ్యంగులు 600/-

నెస్ట్ 2023 పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
కర్నూలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

నెస్ట్ 2023 దరఖాస్తు విధానం

నెస్ట్ 2023 దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతయి. నెస్ట్ అధికారిక పోర్టల్ (www.nestexam.in) నుండి దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి నెస్ట్ వెబ్‌సైట్ సందర్శించిన వారు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ వివరాలతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు నెస్ట్ నిర్వాహకులు కోరిన విద్యా, వ్యక్తిగత సమాచారం తప్పులు దొర్లకుండా దరఖాస్తులో పొందుపర్చాలి. రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు పొందుపర్చినప్పుడు మరోమారు సరిచూసుకోండి. ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు.

అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి.  పరీక్షకు 10 రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్ యందు అందుబాటులో ఉంచుతారు.

నెస్ట్ 2023 ఎగ్జామ్ నమూనా

నెస్ట్ 2023 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మిగతా పరీక్షలకు పూర్తి బిన్నంగా నిర్వహించబడుతుంది. క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో దాని నుండి 17 ప్రశ్నలు, 50 మార్కులు చెప్పున మొత్తం 4 సెక్షన్లుగా ఇవ్వబడతయి.

ఈ 17 ప్రశ్నలలో 12 ప్రశ్నలు సింగల్ సమాధానం ప్రశ్నలు, మిగతా 5 ప్రశ్నలు ఒకటికి మించి సమాదానాలు కలిగి ఉంటాయి. సరైన జవాబు చేసిన సింగల్ సమాధాన ప్రశ్నలకు 2.5 మార్కులు కేటాయిస్తారు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు ఒక మార్కు తొలగిస్తారు. అదే సమయంలో మల్టిపుల్ సమాధానపు ప్రశ్నలకు అన్ని సమాదానాలనూ గుర్తిస్తే మాత్రమే ప్రశ్నలకు 4 మార్కులు కేటాయిస్తారు లేకుంటే జీరో మార్కులు లభిస్తాయి.

సబ్జెక్టు ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
సెక్షన్ I : మాథ్స్ 17 (12 SA + 5 MA) 50 3.30 గంటలు
సెక్షన్ II : బయాలజీ 17 (12 SA + 5 MA) 50
సెక్షన్ III  : ఫిజిక్స్ 17 (12 SA + 5 MA) 50
సెక్షన్ IV : కెమిస్ట్రీ 17 (12 SA + 5 MA) 50

నెస్ట్ 2023 అడ్మిషన్ మరియు క్వాలిఫై మార్కులు

నెస్ట్ ప్రవేశ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. రెండు సెషన్లకు సంబంధించిన మార్కులను పెర్సెంటైల్ రూపంలో గణించి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. నాలుగు సెక్షన్లలో టాప్ 3 సెక్షన్ల స్కోరును మెరిట్ లెక్కింపు కోసం తీసుకుంటారు.

ప్రవేశ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే మెరిట్ జాబితా రూపొందించేందుకు పరిగణిస్తారు. ఇందులో ప్రతి సెక్షన్ యందు 20 శాతం మార్కులు పొందిన వారికీ మొదటి ప్రాధన్యత ఉంటుంది. అడ్మిషన్ ప్రక్రియ పూర్తి యూజీసీ నియమాలకు లోబడి ఉంటుంది.

యూనివర్సిటీ అడ్మిషన్ రిజర్వేషన్ నియమాల అనుసారం సీట్లు కేటాయిస్తారు. సీట్ల అందుబాటుకు సంబంధించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ - భువనేశ్వర్ లో 200 సీట్లు. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో 57 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

NEST