తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు జనరల్ సంక్షేమ గురుకుల పాఠశాలలో 2023-24 విద్యా ఏడాదికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. కేజీ నుండి పీజీ మిషన్‌లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమమంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించేందుకు ప్రభుత్వం వందలాది గురుకులాలు స్థాపించింది.
టీజీసెట్ ద్వారా అడ్మిషన్ పొందే పాఠశాలలు
సంక్షేమ గురుకుల పాఠశాల పేరు | మొత్తం పాఠశాలలు | మెజారిటీ సీట్లు |
---|---|---|
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు (TSWREIS) | 232 పాఠశాలలు | ఎస్సీ విద్యార్థులకు 75% |
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (TTWREIS) | 77 పాఠశాలలు | ఎస్టీ విద్యార్థులకు 64% |
బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు (MJPTBCWREIS) | 294 పాఠశాలలు | బీసీ విద్యార్థులకు 75% |
తెలంగాణ రెసిడెన్సియల్ స్కూళ్ళు (జనరల్ TREIS) | 35 పాఠశాలలు | ఓసీ విద్యార్థులకు 41% |
తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రత్యేకతలు
గ్రామీణ గిరిజన, దళిత మరియు వెనకబడిన కులాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన పూర్తి స్థాయి స్కూల్ మరియు కాలేజీ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. అందుబాటులోకి తెచ్చించి.
రాష్ట్ర వ్యాప్తంగా 638 పైగా గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటి స్టేట్ సెకండరీ బోర్డు ఆధారిత పాఠ్యప్రణాళికతో ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల విద్యను అందిస్తున్నారు. ఈ స్కూళ్లలో ప్రవేశాలు ఏటా ఏప్రిల్ మరియు జూన్ నెలలో నిర్వహిస్తారు.
- సమర్థులు, అనుభవిజ్ఞులైన ఉపాధ్యాయలతో బోధన.
- 24 గంటల ఉపాధ్యాయల నిరంతర పర్యవేక్షణ.
- జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి వివిధ ప్రవేశ పరీక్షలకు ఉచితంగా కోచింగ్.
- క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, కోడింగ్ వంటి ప్రత్యేక అంశాలలో తర్పీదు.
- విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజికల్ ఎడ్యుకేషన్, యోగ శిక్షణ.
- నూరు శాతం ఫలితాలు పొందేలా ప్రత్యేక తరగతులు.
తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలో సౌకర్యాలు
- సన్న బియ్యంతో అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం.
- నెలకు నాలుగు పర్యాయాలు చికెన్, రెండు పర్యాయాలు మటన్
- ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు సరఫరా
- విద్యార్థులకు అన్ని రకాల స్టేషనరీ పూర్తి ఉచితంగా అందిస్తారు.
- ఏడాదికి మూడు జతల యూనిఫామ్, ట్రంక్ బాక్స్, ట్రాలీ సరఫరా.
- పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూస్, నైట్ డ్రెస్, ప్లేట్, గ్లాస్, స్పూన్, బెడ్ షీట్, బ్లాంకెట్ సరఫరా.
- సబ్బులు, షాంపూలు కొనుగోలుకు డబ్బులు.
టీజీసెట్ 2023 ముఖ్యమైన తేదీలు
టీజీసెట్ దరఖాస్తు ప్రారంభం | 09 ఫిబ్రవరి 2023 |
టీజీసెట్ దరఖాస్తు తుది గడువు | 06 మార్చి 2023 |
హాల్ టికెట్ | ఏప్రిల్ 2023 |
టీజీసెట్ పరీక్ష తేదీ | 23 ఏప్రిల్ 2023 (ఉ 11 నుండి మధ్యాహ్నం 1 వరకు) |
టీజీసెట్ 2023 ఎలిజిబిలిటీ
తెలంగాణ సంక్షేమ గురుకుల స్కూళ్లలో 5 నుండి 10 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ సెకండరీ బోర్డు ఆధారిత స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ప్రవేశ ప్రక్రియ పాత జిల్లాల వారీగా నిర్వహిస్తారు. ఒక జిల్లలో ఉండే పాఠశాలల్లో ఉండే ఖాళీలను ఆయా జిల్లాల గ్రామీణ విద్యార్థులచే భర్తీచేస్తారు.
కౌడిపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలకు అన్ని జిల్లాలకు చెందిన మత్స్యకార విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాఠశాలలో విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారితంగా అడ్మిషన్ కల్పిస్తారు.
నల్గొండ జిల్లాలోని సర్వైల్ గ్రామం యందు ఉన్న రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో అడ్మిషన్ కోసం తెలంగాణ అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు. ఈ పాఠశాలలో కూడా విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారితంగా అడ్మిషన్ కల్పిస్తారు.
- విద్యార్థుల వయస్సు 9 నుండి 11 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గరిష్టంగా 13 ఏళ్ళ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్థి కుటుంబ ఆదాయం 1.5 లక్షలు (గ్రామీణ), 2 లక్షలు (అర్బన్) లోపు ఉండాలి.
- 2022 -23 విద్యా ఏడాదిలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
- విద్యార్థులు సంబంధిత స్కూళ్ల నుండి బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్ పొంది, దరఖాస్తుతో పాటుగా సమర్పించాలి.
టీజీసెట్ 2023 దరఖాస్తు విధానం
టీజీసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంటుంది. అర్హుత ఉన్న గ్రామీణ విద్యార్థులు అధికారిక వెబ్సైట్ల నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు సంబంధిత వెబ్సైటు నుండి 100/- దరఖాస్తు రుసుము చెల్లించి దానికి సంబంధించి ఏర్పడిన జర్నల్ నంబరుతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.
రెండవ దశలో విద్యార్థి విద్యా, వ్యక్తిగత మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. వివరాలు అన్ని పూర్తిగా పొందుపర్చక దరఖాస్తు సబ్మిట్ చేయాల్సి. సబ్మిట్ చేసాక జెనెరేట్ అయ్యే రిఫరెన్స్ నెంబరుతో పాటుగా సబ్మిట్ చేసిన దరఖాస్తు ప్రింట్ కాపీ తీసి భద్రపర్చుకోవాలి.
విద్యార్థులు దరఖాస్తు చేసే ముందు సంబంధిత ధ్రువపత్రాలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా కుల, ఆదాయ, డేట్ ఆఫ్ బర్త్, టీసీ, స్టడీ సర్టిఫికెట్స్ తయారుగా ఉంచుకోవాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి అందుబాటులో లేకపోయినా అడ్మిషన్ సమయానికి తప్పనిసరి ఒరిజినల్స్ సమర్పించాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్లు పరీక్ష తేదికి 10 రోజుల ముందు అధికారిక వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి. పరీక్షా కేంద్రాలు అన్ని జిల్లాలో అందుబాటులో ఉంటాయి.
- www.tswreis.in
- www.tgcet.cgg.gov.in
- www.tgtwgurukulam.telangana.gov.in
- www.mjptbcwreis.cgg.gov.in
- www.mjptbcwreis.telangana.gov.in
- www.tresidential.gov.in
టీజీసెట్ 2023 ఎగ్జామ్ నమూనా
టీజీసెట్ ప్రవేశ పరీక్ష ఆఫ్‌లైన్ పద్దతిలో పెన్ & పేపర్ (ఓఎంఆర్) ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్ష 2 గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. టీజీసెట్ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాదానాలు ఇవ్వబడతయి. అందులో నుండి ఒక సరైన సమాధానం ఎంపిక చేయాల్సి ఉంటుంది.
సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష 4 వ తరగతి స్థాయి సిలబస్ ఆధారితంగా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించిన అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రవేశ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు.
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ మెంటల్ ఎబిలిటీ |
20 25 25 20 10 |
20 25 25 20 10 |
2 గంటలు |
100 ప్రశ్నలు | 100 మార్కులు |