జీమ్యాట్ 2023 : 2400 బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ అడ్మిషన్లు
Admissions Exams to study abroad

జీమ్యాట్ 2023 : 2400 బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ అడ్మిషన్లు

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2400 బిజినెస్ స్కూళ్లలో పీజీ స్థాయి మేనేజ్‌మెంట్‌ కోర్సుల యందు ప్రవేశాలు పొందేందుకు జీమ్యాట్ ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఎంబీఏ చేయాలనే ఆలోచన ఉన్నవారు జీమ్యాట్ అర్హుత సాధించటం ద్వారా ఆ కలను నిజం చేసుకోవచ్చు.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 2 లక్షలు మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్ష స్కోరును 114 దేశాలు ప్రామాణికంగా తీసుకుంటాయి. జీమ్యాట్ అర్హుతతో దాదాపు 7000కి పైగా ఎంబీఏ ప్రోగ్రామ్స్ లలో ప్రవేశాలు పొందొచ్చు.

ఏడాది పొడుగునా జరిగే జీమ్యాట్ ముఖ్యంగా మేనేజ్‌మెంట్ ప్రవేశాల కోసం వచ్చే అభ్యర్థుల అకాడమిక్ మరియు వ్యక్తిగత నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించబడుతుంది. జీమ్యాట్ యందు అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా  వారు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రేవేశం పొందేందుకు మరియు ఆ కోర్సు పూర్తి చేసేందుకు యెంత సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తుంది.

Exam Name GMAT 2023
Exam Type Eligibility Test
Admission For Management Courses
Exam Date Throughout the year
Exam Duration 3.7 Hours
Exam Level International Level

జీమ్యాట్ ఎలిజిబిలిటీ

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • పరీక్ష హాజయ్యే సమయానికి అభ్యర్థి వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి.
  • జీమ్యాట్ పరీక్ష ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంది.
  • ఏడాదిలో ఒకసారికి మించి జీమ్యాట్ పరీక్ష హాజరయ్యే వారు రెండు వరుస పరీక్షల మధ్య 16 రోజులు వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలి.

జీమ్యాట్ రిజిస్ట్రేషన్ ఫీజు

  • జీమ్యాట్ రిజిస్ట్రేషన్ ఫీజు  దేశాల వారీగా వేరువేరు రుసుములు కలిగి ఉంటాయి.
  • భారతీయ విద్యార్థుల జీమ్యాట్ రిజిస్ట్రేషన్ ఫీజు 250 డాలర్లు. ఇది భారతీయ రూపాయల్లో 17 వేల నుండి 18 వేల రూపాయలకు సమానం.
  • ఒకసారి జీమ్యాట్ ఫీజు చెల్లించక రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటే, రిజిస్ట్రేషన్ రద్దుకి మరియు పరీక్ష సమయానికి మధ్య ఉండే వ్యవధి అనుసరించి రిఫండ్ చెల్లించబడుతుంది.
  • జీమ్యాట్ రిజిస్ట్రేషన్ ఫీజు వీసా, మాస్టరుకార్డు , అమెరికన్ ఎక్సప్రెస్ మరియు జేసీబీ రకాలకు చెందిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది.
  • చెల్లింపు సమయంలో ఉండే అదనపు సర్వీస్ చార్జీలు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది.
  • జీమ్యాట్ కి సంబంధించి మరికొన్నిసేవల చెల్లింపు రుసుములు వారి వెబ్‌సైట్ లో గమనించగలరు.

జీమ్యాట్ పరీక్ష కేంద్రాలు

  • పియర్సన్ ప్రొఫెషనల్ సెంటర్ పోచంపల్లి, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ .
  • కేఎల్ యూనివర్సిటీ గుంటూరు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
  • గాయత్రీ విద్య పరిషద్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ మధురవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
  • ఐటీఎమ్ బిజినెస్ స్కూల్ చిప్కోట్, ఐటీ పార్క్, చెన్నై, తమిళనాడు.
  • ఇందిరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోయంబత్తూరు, తమిళనాడు
  • వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లూరు, తమిళనాడు
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి, తమిళనాడు.
  • మైరా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎల్వాల్, మైసూరు, కర్ణాటక.
  • పియర్సన్ ప్రొఫెషనల్ సెంటర్ శివాజీ నగర్, బెంగళూరు, కర్ణాటక.

జీమ్యాట్ రిజిస్ట్రేషన్

జీమ్యాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయవల్సి ఉంటుంది. మొదట mba.com లో జీమ్యాట్ అకౌంటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ దశలో మీరు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.మూడవ దశలో పరీక్ష రాసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

జీమ్యాట్ అకౌంట్: జీమ్యాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదట mba.com లో జీమ్యాట్ అకౌంటు ఏర్పాటుచేసుకోవటం ద్వారా మొదలవుతుంది. ఈ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం అభ్యర్థులకు ఈ అకౌంటు ద్వారానే  జీమ్యాక్ (గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్) అందజేస్తుంది. జీమ్యాట్ అకౌంటు ఏర్పాటు ప్రక్రియ పూర్తివగానే మొదట మీకు జీమ్యాట్ స్టార్టర్ కిట్ లభిస్తుంది.

ఈ కిట్ లో జీమ్యాట్ సంబంధించి అన్ని అంశాలు ఎలా నిర్వహించాలనే సమాచారం ఉంటుంది. ఈ అకౌంటు జీమ్యాట్ స్కోర్లు నిర్వహించేందుకు, పరీక్ష అపాయింట్‌మెంట్‌ లు ఏర్పాటు చేసుకునేందుకు, బిజినెస్ స్కూళ్ల సమాచారం శోధించేందుకు, పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ మెలుకువలు తెలుసుకునేందుకు, ఎంబీఏ ప్రోగ్రామ్స్ కి సంబంధించి అనుభవజ్ఞుల సలహాలు పొందేందుకు సహాయపడుతుంది. దీనితో పాటు జీమ్యాట్ పరీక్షకు సంబందించి ఒక హ్యాండ్ బుక్ ఫ్రీ గా లభిస్తుంది.

పరీక్ష కేంద్రం ఎంపిక: ఇండియా లో జీమ్యాట్ పరీక్ష 34 సిటీలలో దాదాపు 39 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీకు  అందుబాటు దూరంలో ఉంటె పక్కన ఉన్న తమిళనాడు, బెంగళూరు పరీక్ష కేంద్రాలను కూడా ఉపయోగించుకోవచ్చు.

పరీక్ష షెడ్యూలు రిజిస్టర్ చేసుకునే ముందు MBA వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఎన్నుకోండి. ఎన్నుకున్న పరీక్ష కేంద్రంలో మీకు కావాల్సిన సమయంలో పరీక్ష నిర్వహణ తేదీలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి. ప్రతి పరీక్ష కేంద్రంలో నెలలో ఒకటి నుండి నాలుగు సార్లు పరీక్ష నిర్వహించబడుతుంది.

అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్: జీమ్యాట్ పరీక్ష ఏడాది పొడుగునా జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు తమకు అందుబాటులో లేదా తాము సంసిద్ధమయ్యే సమయాల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. కాని పరీక్ష అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్ ఏర్పాటు చేసుకునేముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోండి. మొదటిది మీరు అడ్మిషన్ పొందే బిజినెస్ స్కూల్ యొక్క ప్రవేశ తేదీలను దృష్టిలో పెట్టుకోండి.

రెండు పరీక్ష కు సంసిద్ధమయ్యేందుకు మీకు కావాల్సిన సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక చివరిగా పరీక్ష కేంద్రం ఎంపిక, ఆ సమయంలో ఆ ప్రాంతంలో వసతి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోండి . పరీక్ష షెడ్యూలును మీరు ఆన్‌లైన్‌ MBA అకౌంట్ లో, టెలిఫోన్లో, పోస్టల్లో మరియు ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. జీమ్యాట్ పరీక్షకు ఏడాదిలో గరిష్టంగా 5 సార్లు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది.

జీమ్యాట్ ఎగ్జామ్ నమూనా

జీమ్యాట్ ముఖ్యంగా మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఉండల్సిన కనీస నైపుణ్యాలను పరీక్షించి బిజినెస్ కోర్సులకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండే విద్యార్థులను అందిస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ రీజనింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, అనలాటికల్ రైటింగ్ విభాగాలతో జరిపే ఈ పరీక్ష ద్వారా అభ్యర్థి యొక్క బాష మరియు నైపుణ్య వ్యక్తీకరణ సామర్ధ్యాలను అంచనావేస్తారు.

అభ్యర్థి యెంత సామర్ధ్యగా రాయగలడు, ఎంత సరళంగా మాట్లాడగడు, యెంత సృజన్మకంగా కమ్యూనికేట్ చేయగలడు, సమస్యల విశ్లేషించే పద్దతి మరియు వాటిని పరిష్కరించే తీరు వంటి వివిధ అంశాలను పరీక్షిస్తారు.

ఆన్‌లైన్‌ లో కంప్యూటర్ ఆధారంగా జరిగే జీమ్యాట్ క్యూస్షన్ పేపర్ నాలుగు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నల సంఖ్యతో పాటు నిర్దిష్ట సమయాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 3 గంట 7 నిముషాల నిడివితో సాగే ఈ పరీక్షలో రెండు భాగాలు పూర్తయిన తర్వాత 8 నిముషాలు విరామం తీసుకోవచ్చు.

టెస్ట్ సెక్షన్ ప్రశ్నలు సమయం ప్రశ్నల తీరు స్కోరింగ్
అనలాటికల్ రైటింగ్ 1 30 ని అనాలిసిస్ ఆఫ్ ఆర్గుమెంట్ 0-6
ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ 12 30 ని గ్రాఫిక్ ఇంటర్ప్రిటేషన్, టేబుల్ అనలిసిస్ 1-8
క్వాంటిటేటివ్ రీజనింగ్ 31 62 ని డేటా సఫీసెన్సీ, ప్రాబ్లం సాల్వింగ్ 6-51
వెర్బల్ రీజనింగ్ 36 65 ని క్రిటికల్ రీజనింగ్, సెంట్రన్సు కరెక్షన్ 6-51

అనలాటికల్ రైటింగ్: ఈ సెక్షన్ లో బిజినెస్ లేదా ఇతర ఆసక్తికర అంశాలకు సంబంధించి విశ్లేషాత్మకంగా ఒక వ్యాసం వ్రాయవలసి ఉంటుంది. ఇచ్చిన టాపిక్ పై ఒక వాదన సృష్టించి దాన్ని విమర్శాత్మకంగా మీ దృష్టికోణంలో విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం అభ్యర్థి యొక్క రచన సామార్ధ్యాన్ని మరియు విశ్లేషణ సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు మాత్రమే నిర్వహిస్తారు. దీనికి 30 నిముషాలు సమయం ఇవ్వబడుతుంది.

ఇంటిగ్రేటెడ్ రీజనింగ్: ఈ సెక్షన్ లో గ్రాఫిక్స్, టెక్స్ట్, పట్టికలతో కూడిన డేటా ఇవ్వబడుతుంది. డేటా కు సంభందించిన పూర్తి మూలలను విశ్లేషించి వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థి యొక్క డేటా విశ్లేషాత్మక సామర్ధ్యాన్ని, నిర్ణయాత్మక సామార్ధ్యాన్ని అంచనావేస్తారు. 30 నిముషాల నిడివిలో ఉండే ఈ భాగంలో మొత్తం 12 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

క్వాంటిటేటివ్ రీజనింగ్: ఈ సెక్షన్ లో మ్యాథమెటిక్స్ సంబంధించిన అర్థమెటిక్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, మరియు జామెట్రీ కి సంబంధించిన అంశాల యందు అభ్యర్థి యొక్క క్వాంటిటేటివ్ ఎబిలిటీని పరీక్షిస్తారు. ఈ సెక్షన్ లో ఉన్న 31 ప్రశ్నలను 62 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

వెర్బల్ రీజనింగ్: వెర్బల్ రీజనింగ్ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్ మరియు సెంటెన్స్ కరెక్షన్ సంబంధించిన ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ సెక్షన్ ద్వారా అభ్యర్థి పఠన సామర్థ్యం, గ్రహణ సామర్ధ్యాన్ని అంచనావేస్తారు, ఈ సెక్షన్ మొత్తం 36 ప్రశ్నలను 65 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

జీమ్యాట్ స్కోరింగ్ విధానం

జీమ్యాట్ స్కోరింగ్ ఫార్మేట్ మిగతా అర్హుత పరీక్షలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అలానే ఇది అన్ని బిజినెస్ స్కూళ్లకు ఆమోదయోగ్యాంగా ఉంటుంది. కాని ఈ స్కోర్ లెక్కింపు ప్రక్రియ అనేక సంక్లిసమైన అంశాలలో ముడిపడి ఉంటుంది. జీమ్యాట్ అధికారిక స్కోరు కార్డు లో అభ్యర్థి రాసిన నాలుగు భాగాల విడివిడి స్కోరులతో పాటుగా అభ్యర్థి మొత్తం స్కోరును కూడా పొందుపరుస్తారు. జీమ్యాట్ మొత్తం స్కోరులో క్వాంటిటేటివ్ రీజనింగ్ మరియు వెర్బల్ రీజనింగ్ స్కోర్లు మాత్రమే కలిపి చూపిస్తారు.

జీమ్యాట్ మొత్తం స్కోరు పరిధి 200 నుండి 800 వరకు ఉంటుంది. అందులో రెండు వంతుల మంది స్కోరు 400 నుండి 600 మధ్య ఉంటుంది. జీమ్యాట్ మొత్తం స్కోరులో అనాలిటికల్ రైటింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ సంబందించిన స్కోరులు కలుపబడవు. మొత్తం స్కోరులో క్వాంటిటేటివ్ మరియు వెర్బల్ రీజనింగ్ సంబంధించిన స్కోరు మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది.

జీమ్యాట్ స్కోరు లెక్కించె విధానం: జీమ్యాట్ ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నకు నిర్దిష్టమైన మార్కులు ఉండవు. ప్రతి ప్రశ్నకు ఒకటి నుండి కొంత పరిధి వరకు మార్కులు ఇవ్వబడతాయి. ఈ మార్కులు కేవలం అభ్యర్థి వ్రాసిన సమాధానాల తీరు, వాటి సంఖ్యా, వాటి క్లిష్టత స్థాయిని ఆధారంగా చేసుకుని మాత్రమే ఇవ్వబడతయి. ఒక అభ్యర్థి ఒక క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం చేసినప్పుడు దాని తర్వాత వచ్చే ప్రశ్న ఇంకా క్లిష్టంగా ఇవ్వబడుతుంది.

అదే అభ్యర్థి ఒక సులువైన ప్రశ్నకు సమాధానం చేసినప్పుడు లేదా తప్పు సమాధానం చేసినప్పుడు తర్వాత వచ్చే ప్రశ్నల స్థాయి తగ్గుతుంది. సులభమైన ప్రశ్నలకు ఇచ్చే స్కోరు కంటే కఠినమైన ప్రశ్నలకు ఇచ్చే స్కోరు అధికంగా ఉంటుంది. ఒక అభ్యర్థి 50 సులభమైన ప్రశ్నలకు సమాధానం చేసినప్పుడు వచ్చిన స్కోరు కంటే, 30 కఠినమైన ప్రశ్నలకు సమాధానం చేసేటప్పుడు వచ్చే స్కోర్ అధికంగా ఉంటుంది. అలానే అభ్యర్థులు సమాధానం చేసిన ప్రశ్నల సంఖ్యా పైన కూడా స్కోరు ఆధారపడి ఉంటుంది.

సబ్జెక్టు స్కోరు మరియు ఇంక్రిమెంట్
అనలాటికల్ రైటింగ్ 0-6  (0.5 స్కోరు పాయింట్ ఇంక్రిమెంట్ )
ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ 1-8  (1 స్కోరు పాయింట్ ఇంక్రిమెంట్ )
క్వాంటిటేటివరీజనింగ్ 6-51  (1 స్కోరు పాయింట్ ఇంక్రిమెంట్ )
వెర్బల్ 6-51  (1 స్కోరు పాయింట్ ఇంక్రిమెంట్ )

ఉదాహరణకు అనలాటికల్ ఎస్సై రైటింగ్ లో స్కోరింగ్ పరిధి 0 నుండి 6 వరకు ఇవ్వబడుతుంది అనుకుంటే అందులో ఇచ్చిన వ్యాసాన్ని పూర్తిస్థాయిలో వ్రాసిన వారికీ 6 పాయింట్లు, సగటు స్థాయిలో వ్రాసిన వారికీ 5, మాధ్యమంగా వ్రాసిన వారికీ 4, పరిమితంగా వ్రాసిన వారికీ 3, అక్షర దోషాలతో వ్రాసేవారికి 2, అసలు అవగాహన లేకుండా రాసిన వారికీ 1 పాయింట్ ఇవ్వబడుతుంది.

జీమ్యాట్ స్కోర్ కార్డు

పరీక్ష పూర్తియిన 2 లేదా 3 వారాల తర్వాత అభ్యర్థులకు అధికారక స్కోరు కార్డు అందజేస్తారు. దానికంటే ముందు పరీక్ష రోజున పరీక్ష పూర్తయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్ పై మీ అనధికారిక అంచనా స్కోరు ప్రదర్శించబడుతుంది. చూపించిన ఫలితాలను మీ సంబంధిత బిజినెస్ స్కూళ్లకు నివేదించేలా లేదా రద్దు చేసుకుంటారా అనే నిర్ణయం తీసుకునేందుకు 2 నిముషాల సమయం ఇస్తుంది.

మీరు చూపిన ప్రతిభ ఆధారంగా దాన్ని రద్దు చేసుకుంటారా లేదా నివేదిస్తారా అనే నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది. ఒక వేళా మీరు నివేదిస్తే ఆ స్కోరు మీరు కోరుకునే బిజినెస్ స్కూళ్లకు అందుబాటులో ఉంచుతుంది. జీమ్యాట్ స్కోర్ కార్డు 5 ఏళ్ళు చెల్లుబాటులో ఉంటుంది.

Advertisement