ఇంటర్, డిగ్రీ మరియు బీటెక్ తర్వాత భారతీయ నౌకాదళంలో చేరేందుకు అందుబాటులో వివిధ రకాల ఎంట్రీ స్కీమ్‌లు వివరాలు తెలుసుకోండి. ఇండియన్ నేవీ ఏటా కొన్ని వేల ఉద్యోగాలు భర్తీచేస్తుంది. 7,500 కిలోమీటర్ల సుదీర్ఘమైన భారతీయ తీరం వెంబడి వ్యాపార, వాణిజ్య, రక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ నావికాదళం, ఏటా సమర్ధవంతులైన భారతీయ యువతకు వివిధ నియామక ప్రక్రియల ద్వారా ఉపాధి కల్పిస్తుంది.
ఇంటర్, డిగ్రీ మరియు బీటెక్ తర్వాత భారతీయ నౌకాదళంలో ఆఫీసర్లుగా చేరండి. దేశ తీరప్రాంత రక్షణ వ్యవహారాలలో కీలకపాత్ర వహించే నేవీ ఆఫిసర్ మరియు ఇతర ఉద్యోగాలను 9 రకాల నియామక ప్రక్రియల ద్వారా భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగ ప్రకటనలు అన్ని జాతీయ, ప్రాంతీయ వార్త పత్రికలలో ప్రచారించబడతాయి. అవివాహితులైన యువతి, యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసునేందుకు అర్హులు.
ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యేందుకు ఎంట్రీ స్కీమ్‌లు
-
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంట్రీలు
-
ఇండియన్ నేవీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ
-
ఇండియన్ నేవీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ
-
ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్
-
ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంట్రీ
-
ఇండియన్ నేవీ యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్
-
ఇండియన్ నేవీలో సెయిలర్ ఎంట్రీ
-
ఇండియన్ నేవీలో మహిళల ఎంట్రీ
-
కోస్ట్ గార్డు ఉద్యోగాలు
1. యూపీఎస్సీ ఎంట్రీ ద్వారా ఇండియన్ నేవీ ఉద్యోగాలు
భారతీయ నౌకాదళంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నాలుగు రకాల నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. వీటిలో గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా, అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలను నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తుంది. అదే సమయంలో ప్రత్యేకంగా ఎంట్రీ ద్వారా ఎన్‌సీసీ అభ్యర్థులను భర్తీ చేస్తుంది.
యూపిఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్
ఈ నియామక ప్రకటన ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఎంపిక పక్రియ రాత పరీక్ష మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆయా అకాడమీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యతో పాటుగా సాయుధ దళాల ట్రైనింగ్ అందిస్తారు.
ఈ నియామక పరీక్ష, యేటా రెండు సార్లు జరుగుతుంది. జూన్ మరియు అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ మరియు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 23 ఏళ్ళ మధ్య ఉండాలి. తప్పనిసరి అవివాహితులై ఉండాలి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పూర్తి వివరాలు
యూపీఎస్సీ NDA & NA ఎగ్జామ్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్వహిస్తారు. ఇంటర్ అర్హుతతో భారత త్రివిధ దళాలలో చేరేందుకు ఇదే మంచి అవకాశం. ఈ పరీక్షను యూపీఎస్సీ జాతీయ స్థాయిలో ఏటా రెండు సార్లు జరుపుతుంది. రాతపరీక్ష మరియు సర్వీస్స్ సెలక్షన్ బోర్డు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎంపికైనఅభ్యర్థులకు పూణేలో ఖాదక్వస్లా నేషనల్ డిఫెన్సె అకాడమీలో 3 ఏళ్ళ పాటు గ్రాడ్యుయేషన్ పాటుగా సాయుధ దళాల ట్రయినింగ్ అందిస్తారు. మూడేళ్ళ ట్రయినింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఆయా సాయుధ దళాల అకాడమీలకు పంపిస్తారు. పూర్తి వివరాలు
యూపీఎస్సీ ద్వారా ఇండియన్ నేవీ ఎన్‌సీసీ ఎంట్రీ
నావల్ వింగ్ సీనియర్ డివివి ఎన్‌సిసి 'సి' సర్టిఫికేట్ హోల్డర్‌ల కోసం ఈ నియామక ప్రకటన విడుదల చేస్తారు. ఎన్‌సిసి 'సి' సర్టిఫికేట్ కలిగిన బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. సీడీఎస్ఈ ప్రకటనతో పాటు దీనిని ప్రచురిస్తారు. ఈ ప్రవేశానికి ఎటువంటి వ్రాత పరీక్ష నిర్వహించబడదు. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును నేరుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ) యొక్క ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ ద్వారా ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ కోసం డిప్యూట్ చేయబడతారు. ఇందులో అర్హత సాధించిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్యంగా ఉన్నట్లు తేలితే, ఆల్ ఇండియా మెరిట్ ఆధారంగా ఇండియన్ నేవీలో ప్రవేశం కల్పిస్తారు. ఈ ఎంట్రీ ద్వారా ఎంపిక చేయబడిన అధికారుల శిక్షణ సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి/జులైలో ప్రారంభమవుతుంది.
2. ఇండియన్ నేవీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ
ఇండియన్ నేవీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ ద్వారా ఇంటర్మీడియట్ ఎంపీసీ అభ్యర్థులను భర్తీ చేస్తుంది. ఇంటర్ ఎంపీసీ యందు కనీసం 70 శాతం మార్కులు పొంది, జేఈఈ మెయిన్ ర్యాంకింగ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు బీఈ/బీటెక్ విద్యతో పాటుగా నౌకాదళ శిక్షణ అందించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఈ నియామక ప్రకటన ఏటా రెండు సార్లు మార్చి, సెప్టెంబర్ తర్వాత నెలలలో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/ముఖ్యమైన వార్తాపత్రికలలో ప్రచురిస్తారు. జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకింగ్‌ను ప్రకటించిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు దరఖాస్తు చేసుకోవాలి.
3. ఇండియన్ నేవీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ
ఇండియన్ నేవీ గ్రాడ్యుయేట్ లెవెల్ డైరెక్ట్ ఎంట్రీ నియామక ప్రక్రియ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ) యొక్క ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ ద్వారా నిర్వహించబడుతుంది. పేర్మినెంట్ కమిషన్ మరియు షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ ఎంట్రీల కోసం డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన అవివాహిత అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ ఎంట్రీల శిక్షణ సాధారణంగా జనవరి మరియు జూలై నెలల్లో ప్రారంభమవుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రధానంగా వృత్తి నిపుణులను భర్తీ చేస్తారు. భారతీయ నౌకాదళంలో మ్యూజిషియన్ మరియు స్పోర్ట్స్ ఎంట్రీలకు సంబంధించి వారి వృత్తిపరమైన సామర్థ్యం కోసం ప్రిలిమినరీ స్కానింగ్ నిర్వహించబడుతుంది. విజయవంతమైన అభ్యర్థులు ఆ తర్వాత బెంగళూరు/భోపాల్/కోయంబత్తూర్/ వైజాగ్/కోల్‌కతాలో ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్ టెస్టులలో అర్హుత పొందిన అభ్యర్థులు, ఆల్ ఇండియా మెరిట్ ఆధారంగా ఇండియన్ నేవీలో చేర్చబడతారు. ఈ ఎంట్రీల శిక్షణ సాధారణంగా జనవరి మరియు జూలై నెలల్లో ప్రారంభమవుతుంది. నియామక ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ మరియు ఇతర ముఖ్యమైన వార్తాపత్రికలలో ద్వారా విడుదల చేస్తుంది.
4. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్
ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది. నేవీ ఆఫీసర్ ఎంట్రీ పేరుతో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా వివిధ నౌకాదళ విభాగాల ఖాళీలను భారీ చేస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులు.
ఈ ప్రవేశ పరీక్ష పూర్తి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షగా నిర్వహిస్తారు. రెండు గంటల నిడివితో జరిగే ఈ పరీక్షలో ఇంగ్లిష్, రీజనింగ్ & న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ & మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలతో కూడిన 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ నాలుగు విభాగాల్లో విడివిగా కనీసం 40% మార్కులు పొందిన వారిని షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంపిక కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు.
షార్ట్-లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు బెంగళూరు/ భోపాల్/ విశాఖపట్నం/ కోల్‌కతాలో ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ మరియు ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన వారితో తుది ఎంపిక పూర్తి చేస్తారు.
ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు
- పైలట్ (MR) - (పురుషులు & మహిళలు)
- పైలట్ (NMR) (పురుషులు)
- నావల్ ఎయిర్ ఆపరేషన్స్ - (పురుషులు & మహిళలు)
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రో (ATC) - (పురుషులు & మహిళలు)
- జనరల్ సర్వీస్ - ఎగ్జిక్యూటివ్ (పురుషులు & మహిళలు)
- హైడ్రో– పురుషులకు మాత్రమే
- జనరల్ సర్వీస్ (టెక్నికల్ – ఎలక్ట్రికల్ & ఇంజినీరింగ్)
- నావల్ ఆర్కిటెక్ట్- (పురుషులు & మహిళలు)
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ– (పురుషులు & మహిళలు)
- లాజిస్టిక్స్- (పురుషులు & మహిళలు)
- ఎడ్యుకేషన్ - (పురుషులు & మహిళలు)
- నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ (NAIC) - (పురుషులు & మహిళలు)
5. ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంట్రీ
ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంట్రీ ద్వారా సెయిలర్ విభాగంలో ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (AA), సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR), మెట్రిక్ రిక్రూట్ (MR) పోస్టులను భర్తీ చేస్తుంది. 60 శాతం మార్కులతో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అవివాహిత భారతీయ యువతి, యువకులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్మీడియేట్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి రాతపరీక్షకు ఆహ్వానిస్తారు. రాతపరీక్షలో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో ఫీజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక పూర్తిచేస్తారు. పూర్తి వివరాలు
- నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ కింద శిక్షణతో కలుపుకుని గరిష్టంగా 4 ఏళ్లలో కాలపరిమితితో నియామకాలు చేపట్టనున్నారు.
- నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సైనికులలో కేవలం 25 శాతం మంది సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు. వీళ్ళు 15 ఏళ్లపాటు సర్వీస్‌లో ఉంటారు. మిగతా సైనికులు వాలెంటరీ రిటైర్మెంట్ పద్దతితో ఇంటికి పంపబడతారు.
- నాలుగేళ్ళ తర్వాత విరమించబడ్డ సిబ్బందికి, విరమణ సమయంలో సేవనిధి పేరిట 12 లక్షల వరకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు.
- ఈ పథకం పరిధిలో ఎంపికైన వారికీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటివి లభించవు.
- విరమణ పొందిన సైనికులకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ అందజేస్తారు.
- అలానే ఉద్యోగంలో ఉన్నంతవరకు 48 లక్షల నాన్ కాంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్సు కల్పిస్తారు.
- రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
- అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
6. ఇండియన్ నేవీ యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్
యూనివర్సిటీ ఎంట్రీ స్కిం కింద ఇండియన్ నేవీలో ఆఫీసర్ హోదా కొలువును సొంతం చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీచేస్తారు. ఈ ఎంట్రీ స్కీం ద్వారా ఎంపిక అయ్యేందుకు యూపీఎస్సీ నిర్వహించే NDA /NA, CDSC, అర్హుత పరీక్షలలో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.
ముందే ప్రకటించే యూపీఎస్సీ ఉద్యోగ ప్రకటన క్యాలెండరు ఆధారంగా ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ఉద్యోగ ప్రకటనలు అన్ని జాతీయ, ప్రాంతీయ వార్త పత్రికలలో ప్రచారించబడతాయి. సముద్రంలో నిర్వహించే వివిధరకాల విధి విధానాల ఆధారంగా ఈ ఆఫీసర్ ఉద్యోగాలు ఈ కింది కేటగిరీలలో ఉంటాయి.
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్
- ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్
- ఎడ్యుకేషన్
- స్పోర్ట్స్
7. ఇండియన్ నేవీలో సెయిలర్ ఉద్యోగాలు
పది మరియు 10+2 అర్హుతతో భర్తీచేసే సెయిలర్ స్థాయి ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ. ఈ నియామక ప్రక్రియ ప్రస్తుతం నేవీ అగ్నివీరు పేరుతొ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి నియామక ప్రకటన ఏటా పలు దపాలుగా విడుదల చేస్తారు. ఈ విభాగంలో భర్తీచేసే పోస్టులను కింద గమనించగలరు.
8. ఇండియన్ నేవీలో మహిళాల ఎంట్రీ
భారతీయ నౌకాదళం లో మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయితే వీరిని షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భర్తీచేస్తారు. వీరికి గరిష్టంగా 14 ఏళ్ళపాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉంటుంది. మహిళలతో భర్తీచేసే వివిధ రకాల ఉద్యోగాలు
- నేవెల్ ఆర్కిటెక్చర్
- ఆబ్సర్వర్
- ఎడ్యుకేషన్ విధులు
- లాజిస్టిక్స్ వర్క్స్
- లా (న్యాయ సంబంధ విధులు)
- జనరల్ పైలట్
- నేవల్ ఆర్మెంట్ ఇన్స్పెక్టరేట్
- ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్) వంటి వివిధ రకాల పోస్టులను మహిళలతో భర్తీచేస్తారు.
9. కోస్ట్ గార్డు ఉద్యోగాలు
దేశ తీరప్రాంత రక్షణ వ్యవహారాల బాధ్యతను ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వర్తిస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1978 లో అధికారికంగా స్థాపించారు. దేశ ప్రాదేశిక జలాల పరిధిలో దీవుల రక్షణ, మానవ నిర్మాణాల పరిరక్షణ, సముద్ర జలాల్లో ఆపదలో చిక్కుకున్న జాలర్లను రక్షించడం, సముద్ర పర్యావరణాన్ని కాపాడడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది
ఇండియన్ కోస్ట్ గార్డు ఫ్యామిలీలో చేరేందుకు నిరుద్యోగులకు రెండు మార్గాలున్నాయి. మొదటిది ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ. రెండవది సెయిలర్ లెవెల్ ఎంట్రీ. ఇంటర్ మరియు గ్రాడ్యుయేషన్ అర్హుత ఉన్న అభ్యర్థులు ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ ద్వారా కోస్ట్ గార్డ్ లో ఉద్యోగం సాధించవచ్చు. టెన్త్, ఇంటర్ మరియు డిప్లొమా అభ్యర్థులు సెయిలర్ లెవెల్ ఎంట్రీ ద్వారా కోస్ట్ గార్డ్ జాబ్ చేజెక్కించుకునే అవకాశముంది. కోస్ట్ గార్డు ఎగ్జామ్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.