Advertisement
అమెరికాలో ఉన్నత విద్య : విశ్వవిద్యాలయాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజులు
Abroad Education

అమెరికాలో ఉన్నత విద్య : విశ్వవిద్యాలయాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజులు

అమెరికాలో ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి సమాచారం పొందండి. విదేశాల్లో ఉన్నత విద్య అనగానే టక్కున గుర్తుకొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. గత రెండు మూడేళ్ళలో ఇండియా నుండి యూఎస్ స్టూడెంట్ వీసా కోసం సుమారు 10 మిల్లియన్లకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే యూఎస్ వెళ్లే అదృష్టం దక్కించుకుంటున్నారు. ఇందులో సగానికి పైగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉండటం గమనర్హం.

ఎందుకు అంతలా యూఎస్ చదువుల పైన మోజు అని అడిగితే దానికి గల ప్రధాన కారణం యూఎస్ ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రంగా ఉండటం ఒకెత్తు అయితే, ప్రపంచ టాప్ యూనివర్సిటీలు ఇక్కడ కొలువుదీరి ఉండటం కారణం మరో కావొచ్చు. ఇది మాత్రమే కాకుండా యూఎస్ రిటర్న్ విద్యార్థులు కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలు దక్కే అవకాశం ఉండటం కూడా కారణం కావొచ్చు.

ఇన్ని ప్రత్యేక లాభాలు ఉన్నంత మాత్రాన అమెరికాకు పోయి ఉన్నత విద్య చదవడం అందరికి సాధ్యమయ్యేది కాదు. ఇది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నది. అంతే కాకుండా యూఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం, దాని తర్వాత స్టూడెంట్ వీసా ఆమోదం పొందటం అంత సులభం కాదు. కానీ మీకు  అమెరికాకు వెళ్లేందుకు ఆర్థిక పరమైన ఆసరా ఉండి, దానికి మించి కెరీర్ పరమైన ఉన్నత ఆశయం ఉంటె తప్పక ప్రయత్నించండి.

అమెరికాలో ఉన్నత విద్యకు పంచ సూత్రాలు

ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లేందుకు ప్లాన్ చేసే విద్యార్థులు, దానికి ముందు ఈ కింది ఐదు అంశాల యందు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటి మీకు యూనివర్సిటీని ఎంపిక, రెండవది కోర్సుకు సంబంధించి ప్రవేశ పరీక్షా అర్హుత ఉత్తీర్ణత. దీనితో పాటుగా TOEFL వంటి ఆంగ్ల అర్హుత పరీక్షా ఉత్తీర్ణత పొందాలి. మూడవది ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం. నాల్గువది స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు. ఇక చివరిది అమెరికాకు ప్రయాణం.

బెస్ట్ యూనివర్సిటీ ఎంపిక

యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టములో పలానా యూనివర్సిటీ బెస్ట్ అని చెప్పే యూనివర్సిటీ ర్యాంకింగ్ సిస్టం లేదు. Student and Exchange Visitor Program (SEVP) డేటా ప్రకారం దాదాపు 9000 పైగా యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితా నుండి మీ కోర్సుకు & బడ్జెటుకు సరిపడే యూనివర్సిటీ ఎంపిక  చేసుకోవాలి. యూనివర్సిటీని ఎంపిక చేసేముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చేసుకోవాలి. ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు మీ దగ్గర ఉండే మీకు తగిన యూనివర్సిటీని సులభంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

  • Why do you want to study in the United States?
  • Where will you fit in best?
  • Which colleges or universities will meet your needs?
  • Will you need financial assistance?
  • What are the application and financial aid deadlines?
  • Where do you want to live in the United States?

ఎలిజిబిలిటీ & ఎంట్రన్స్ ఎగ్జామ్స్

రెండవ దశలో మీరు ఎంపిక చేసుకున్న యూనివర్సిటీ యందు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సదురు యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే వాటికీ సంబంధించిన ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. వివిధ యూజీ & పీజీ కోర్సులకు సంబంధించి యూఎస్ లో 9 రకాల ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. క్రింది జాబితాలో SAT,  ACT ప్రవేశ పరీక్షలు అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు సంబంధించనివి.

వీటితో పాటుగా విదేశీ విద్యార్థులు యూఎస్ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందాలంటే TOEFL ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్హుత పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. TOEFL స్కోర్ లేకుండా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన అడ్మిషన్ కల్పించారు.

ఫైనాన్సియల్ ప్లానింగ్

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు ప్రథమంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం పై దృష్టి సారించాలి. ఇండియా నుండి బయలుదేరిన నుండి తిరిగి ఇండియాకు చేరే వరకు అవసరమయ్యే మొత్తం ఆర్థిక అవసరాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఇదే అంశాన్ని వీసా ఇంటర్వ్యూ సమయంలో కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళా ఫైనాన్సిల్ అసిస్టెన్స్ కోసం విద్యా రుణాలపై ఆధారపడితే వాటికీ సంబంధించి పూర్తి ప్రణాలికను వీసా ఇంటర్వ్యూ సమయానికి పూర్తిచేసి ఉండాలి.

అలానే వివిధ యూనివర్సిటీలు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలు అందించే స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక చేయూత కోసం శోధన చేయండి. మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వాలు అందించే ఉచిత ఆర్థిక సహాయంలు ఎంతోకొంత ఆర్థిక చేయూతను అందిస్తాయి. విదేశీ విద్యార్థుల కోసం అమెరికా ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యా రుణాలకు కూడా అక్కడ అవకాశం ఉండదు. ఈ అంశాలు అన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమయ్యే ఏర్పాట్లు అన్ని ముందుగానే పూర్తిచేయండి.

యూఎస్ స్టూడెంట్ వీసా

యూఎస్ ఎడ్యుకేషన్ ప్లానింగులో మరో ముఖ్య ఘట్టం విద్యార్థి వీసా పొందడం. యూఎస్ స్టూడెంట్ వీసా కోసం మీరు దరఖాస్తు చేయాలంటే, ఏదైనా అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఉండాలి. అడ్మిషన్ లెటర్ అందిన వెంటనే వీసా దరఖాస్తు ప్రక్రియకు సిద్ధమవ్వాలి. మీ యూనివర్సిటీ తరగతులు ప్రాంభమయ్యేందుకు 60 రోజుల ముందుగానే స్టూడెంట్ వీసా జారీ ప్రక్రియ పూర్తివుతుంది. కావున 4 నెలల ముందుగానే వీసా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసుకోవాలి. వీసాకు సంబంధించి స్టెప్ బై స్టెప్ గైడ్ పైన ఆర్టికల్ యందు ఉంటుంది.

అమెరికా ప్రయాణానికి సన్నద్ధత

ఇక చివరిగా అమెరికాకు ప్రయాణం. ప్రయాణానికి ముందుగా సంబంధిత కార్యక్రమాలు అన్ని పూర్తిచేసుకోవాలి. అలానే ప్రయాణ సమయంలో మరియు యూనివర్సిటీ హాజరయ్యే సమయంలో అవసమయ్యే డాక్యూమెంట్స్ అన్ని భద్రంగా ఫైల్ చేసుకోవాలి. అలానే  పాసుపోర్టు, వీసా, అడ్మిషన్ లెటర్ వంటి వాటిపై విషయాల్లో అజాగ్రత్త వహించకండి. అలానే విదేశీ ప్రయాణంలో వెంట తీసుకువెళ్లాల్సిన వస్తువులు, తీసుకు వెళ్లకూడని వస్తువుల విషయంలో ముందుగా అవగాహనా పెంచుకోండి.

ఇక ఈ అంశాలు పక్కన పెడితే అమెరికాలో అడుగుపెట్టిన తరువాత అక్కడ అలవర్చుకోవాల్సిన అంశాల యందు దృష్టిపెట్టాలి. మీరు ఇప్పుడు కొత్త దేశంలో ఉన్నారు కాబట్టి వారి సంస్కృతిని, సంప్రదాయాలను, వారి నమ్మకాలను, నియమాలను గౌరవించాలి. వాటిపై మీకు ఏవిధమైన చిన్న చూపు ఉండకూడదు. అలానే  పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలు, వ్యవహార శైలి, వాతావరణ మార్పులు, మాట్లాడే బాషా, అకాడమిక్ సిస్టమ్స్, సాంస్కృతిక, సామాజిక అంశాలలో ఉండే తేడాలును అలవర్చుకోవాలి. అలానే అక్కడ కుటుంబ జీవనం, వసతి సదుపాయం, మీ బోర్డింగ్ చుట్టుపక్కల ప్రాంతాలపై ముందుగానే అవగహన పెంచుకోవాలి.

Post Comment