Advertisement
కార్పే డైమ్ ఎడ్యుకేషన్ : స్టూడెంట్ గ్యాప్ ఇయర్ ప్రోగ్రామ్‌లు
Career Guidance Volunteer Programs

కార్పే డైమ్ ఎడ్యుకేషన్ : స్టూడెంట్ గ్యాప్ ఇయర్ ప్రోగ్రామ్‌లు

కార్పే డైమ్ అంటే ఈ రోజును ఆస్వాదించండి అని అర్ధం. ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తూ, భవిష్యత్తు గురించి కొంచెం ఆలోచించమని ప్రోత్సహించే వారిని కార్పే డైమ్ అంటారు. కార్పే డైమ్ ఎడ్యుకేషన్ ఇదే ఆలోచనతో పుట్టిన అమెరికా కేంద్రంగా స్థాపించబడింది.

కార్పే డైమ్ విద్యార్థులకు ఉపయోగపడే ఎడ్యుకేషన్ ఆధారిత వాలంటీర్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. పాఠశాల, కాలేజీ విద్యార్థులు తరగతి గది బయట అనుభవపూర్వక నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తుంది.

గ్యాప్ ఇయర్ ప్రోగ్రామ్‌లుగా రూపొందించే ఈ వీరి కార్యక్రమాలలో సాహస యాత్రలు మరియు సామాజిక సేవ మిళితమై ఉంటాయి. విద్యార్థుల యందు ధైర్య సాహసాలను నింపడం, నాయకత్వ లక్షణాలను రూపొందించడంతో పాటుగా స్థానిక కమ్యూనిటీ పరిధిలో స్వచ్చంధ సేవ చేసే అవకాశం కల్పిస్తారు.

కార్పే డైమ్ వాలంటీర్ ప్రోగ్రాంలు ఒక చిన్న, సన్నిహిత సమూహలుగా ప్రణాళిక చేయబడతాయి. ప్రతి ప్రోగ్రామ్‌లో ఇద్దరు విదేశీ విద్యావేత్తలతో పాటుగా 12 మంది విద్యార్థులు పాల్గొంటారు. ఈ ప్రోగ్రాంలు సెమిస్టరు విధానంలో నెల రోజుల వ్యవధి నుండి 6 నెలల నిడివితో ఉంటాయి. ప్రోగ్రాంలలో విద్యార్థుల ఎంపిక బట్టి థీమాటిక్ ప్రోగ్రామ్‌లు, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, ట్రెక్కింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహస కార్యక్రమాలకు కూడా చోటు కల్పిస్తారు.

ప్రతిభ చూపిన విద్యార్థులకు కాలేజీ క్రెడిట్స్ కూడా అందజేస్తారు. అలానే అర్హుత వుండే విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు ఫైనాన్సియల్ అసిస్టెన్స్ కూడా కల్పిస్తారు. తరగతి గదుల చదువుల నుండి కాస్త ఉపశమనం కోరుకునే విద్యార్థులకు  కార్పే డైమ్ అందించే ఎడ్యుకేషన్ వాలంటీర్ ప్రోగ్రాంలు గొప్ప అనుభూతిని అందిస్తాయి.ప్రోగ్రాం ప్యాకేజీలు కొంచెం ప్రీమియంగా ఉన్నా..అందులో పొందే జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి

సామాజిక సేవ & ట్రావెలింగ్ అంశాలపై అభిరుచి వుండే విద్యార్థులకు కార్పే డైమ్ వాలంటీర్ ప్రోగ్రామ్స్ జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాలని అందిస్తుంది. ఒక వైపు సామజిక సేవ చేసే అదృష్టంతో పాటుగా మరో వైపు ప్రపంచాన్ని సందర్శించే గొప్ప అవకాశం ఈ ప్రోగ్రాముల ద్వారా మీకు లభిస్తుంది.

విదేశాలలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడం వలన, మీ సాధారణ పర్యటన వైవిధ్య భరితమవుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని స్థానిక సమాజలతో భాగస్వామ్యం చేస్తుంది, కొత్త సంస్కృతులను ప్రామాణికమైన రీతిలో అనుభవించే అవకాశం లభిస్తుంది.

ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇది ఉత్తమమైన మార్గం. మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి, జీవితకాల స్నేహాలను పెంచుకోవడానికి మరియు మీ అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ క్లిష్ట సమయంలో నిజమైన ప్రభావం చూపాలనుకుంటే ఈ అనుభూతిని తప్పక ఆస్వాదించాల్సిందే.

Post Comment