కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | ఇంటర్నేషనల్ అఫైర్స్
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | ఇంటర్నేషనల్ అఫైర్స్

తుర్క్‌మెనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా సెర్దార్ బెర్డిముహమెడోవ్

తుర్క్‌మెనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా సెర్దార్ బెర్డిముహమెడోవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 40 ఏళ్ల యువ బెర్డిముహమెడోవ్ 72.97% ఓట్లను సాధించాడు. దీనితో అధికారికంగా అతని తండ్రి గుర్బాంగులీ బెర్డిముహమెడోవ్ నుండి మధ్య ఆసియా దేశ పగ్గాలను చేపట్టారు.

తుర్క్‌మెనిస్తాన్ మధ్య ఆసియాలో కాస్పియన్ సముద్రం సరిహద్దులో ఉన్న ఒక దేశం. ఇది ఎక్కువగా కరకుమ్ ఎడారితో కప్పబడి ఉంది. ఈ భూపరివేష్టిత దేశంకు వాయువ్య దిశలో కజకిస్తాన్, ఉత్తరాన ఉజ్బెకిస్తాన్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. పర్వతాలకు, సహజ వాయువుకు ప్రసిద్ధి చెందిన ఈ దేశం ప్రపంచంలోని అతి తక్కువ సందర్శించే దేశాలలో ఒకటిగా ఉంది.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి రష్యాను సాగనంపేందుకు తీర్మానం

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, యూఎన్ మానవ హక్కుల కౌన్సిల్ నుండి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానాన్ని ఆమోదించింది. ఉక్రెయిన్‌ పై రష్యా కొనసాగిస్తున్న ఏకపక్ష యుద్ధ ఉన్మాదానికి బదులుగా యూఎన్ సభ్య దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తీర్మానానికి సంబంధించి యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగులో అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 24 ఓట్లు రాగా, 58 దేశాలు గైర్హాజరయ్యాయి.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అనేది 47 మంది సభ్యులతో కూడిన యూఎన్ అధికారిక సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన మరియు దానికి సంబంధించిన రక్షణ వ్యవరాలను పరిశీలిస్తుంది. ప్రపంచ పౌరుల మానవ హక్కుల రక్షణకు బాధ్యత వహిస్తుంది. ఏటా వివిధ దేశాల్లో చోటుచేసుకునే మానవ హక్కుల సమస్యలు మరియు వాటి వలన ఉత్పన్నమయ్యే పరిస్థితుల గురించి చర్చించడానికి జెనీవాకేంద్రంగా  సమావేశమవుతుంది.

అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైన తోలి పీఎంగా ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడయ్యారు. 342 స్థానాలున్న పాకిస్తాన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 సభ్యులు మద్దతు పలకడంతో ఇమ్రాన్ ఖాన్, ప్రధాని పదవిని వొదులుకోవాల్సి వచ్చింది. దీనితో పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడైన మొదటి ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ అవతరించారు. ఇదే సమయంలో 75 ఏళ్ల దేశ చరిత్రలో ఏ పాక్ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయారు.

69 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, సైనిక మద్దతుతో 2018లో అధికారంలోకి వచ్చారు, అయితే ఇటీవల మిత్రపక్షాలు అతని సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలగడంతో పార్లమెంటరీలో మెజారిటీని కోల్పోయారు. కోవిడ్-19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో లేదా పాకిస్థాన్‌ను అవినీతి రహితంగా మార్చే వాగ్దానాలను నెరవేర్చడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలమవ్వడంతో ఈ రాజాకీయ సంక్షోభం ఏర్పడింది.

పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్

అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన తర్వాత, పాకిస్థాన్ పార్లమెంట్ షెహబాజ్ షరీఫ్‌ను దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. దీనితో పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్‌ ప్రమాణస్వీకారం చేసారు. షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్'కు సోదరుడు అవుతాడు. మితిమీరిన ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఇంధన సంక్షోభంతో పాకిస్తాన్'లో రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.

ప్రపంచ అతిపెద్ద సైబర్ డిఫెన్స్ ఎక్సర్ సైజ్'కు ఎస్టోనియా ఆతిధ్యం

ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ డిఫెన్స్ ఎక్సర్ సైజ్'కు ఎస్టోనియా ఆతిధ్యం అందిస్తుంది. కోఆపరేటివ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CCDCOE) పేరుతో నిర్వహిస్తున్న ఈ ఎక్సర్ సైజ్ ద్వారా ప్రభుత్వ మరియు పౌర సమాజ డేటాకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తుంది. ఇది ప్రపంచ అతిపెద్ద మరియు అత్యంత సంక్లిష్టమైన వార్షిక అంతర్జాతీయ లైవ్-ఫైర్ సైబర్ డిఫెన్స్ వ్యాయామంగా పరిగణిసస్తారు.

2007 సైబర్ దాడుల అనుభవంతో, ఎస్టోనియా ప్రభుత్వంలో నిల్వ చేయబడిన డేటా యొక్క సమగ్రతను నిర్ధారించడానికి స్కేలబుల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి అభివృద్ధి పరుస్తుంది. ఈ ఎక్సర్ సైజ్, నాటో, సిమెన్స్, మైక్రోసాఫ్ట్, టాలిన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు ఇతర భాగస్వాముల సహకారంతో CCDCOE నిర్వహిస్తుంది. నాటో కోఆపరేటివ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది నాటో గుర్తింపు పొందిన సైబర్ డిఫెన్స్ హబ్. ఇది కూటమి యొక్క సభ్య దేశాల సైబర్ రక్షణ కోసం పనిచేస్తుంది.

స్లోవేనియా ప్రధానిగా రాబర్ట్ గోలోబ్ ఎన్నిక

స్లోవేనియా నూతన ప్రధానమంత్రిగా రాబర్ట్ గోలోబ్ ఎన్నికయ్యారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో స్లోవేనియాకు మూడుసార్లు ప్రధానమంత్రిగా ఉన్న జానెజ్ జన్సా ను రాబర్ట్ గోలోబ్ నేతృత్వంలోని చిన్న గోలోబ్స్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఉదారవాద పార్టీ ఓడించింది. జానెజ్ జన్సా 2004 మరియు 2008 మధ్య మరియు 2012 మరియు 2013 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశాడు. అవినీతి కుంభకోణతో కురికిపోయిన ఈ ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల్లో ఓడిపోయింది.

Post Comment