తెలంగాణ బీసీ, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు మరియు హాస్టళ్లు
Scholarships

తెలంగాణ బీసీ, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు మరియు హాస్టళ్లు

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు, హాస్టల్స్ ద్వారా నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తి విద్య మరియు వసతిని అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ మరియు హాస్టళ్లల్లో 3 లక్షలకు పైగా విద్యార్థులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు ఉచిత ఐఐటీ, నీట్ కోచింగ్ అందిస్తారు.

ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత వసతి, గురుకుల విధానపు బోధన, నెలకు 700 నుండి 1500 రూపాయల వ్యయంతో పౌష్ఠిక ఆహారం. యూనిఫామ్ దుస్తులు, సాక్స్'లు, దుప్పటి, బంకర్ బెడ్, టై, బెల్ట్, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ప్లేట్, గ్లాస్ వంటివి అందిస్తారు.

స్కాలర్షిప్ తెలంగాణ రెసిడెన్సియల్ స్కూల్స్ & హాస్టల్స్
స్కాలర్షిప్ టైప్ ఉచిత విద్య & వసతి
ఎవరికి అందిస్తారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు
అర్హుత రెండు లక్షలలోపు కుటుంబ ఆదాయం

అంతే కాకుండా విద్యార్థుల నెలవారీ కాస్మొటిక్ ఖర్చుల కోసం V, VI క్లాస్ పిల్లలకు 50-100/- అందిస్తారు. VII నుండి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు 150/- రూపాయలు అందజేస్తారు. ఒక సారి 5వ తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తారు.

గురుకుల రెసిడెన్సీ పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ, ప్రవేశ పరీక్షా నిర్వహించడం ద్వారా జరుగుతుంది. ప్రవేశ పరీక్షా V తరగతికి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు మాత్రమే నిర్వహిస్తారు. మిగతా తరగతులకు ఖాళీలను అనుచరించి ఎప్పటికి అప్పుడు ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర సాధారణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మెరిట్ ఆధారంగా లేదా లాటరీ పద్దతిలో ప్రవేశాలు నిర్వహిస్తారు.

ఎవరు అర్హులు

తెల్ల రేషన్ కార్డు ఉండి, కుటుంబ ఆదాయం లక్ష రూపాయలోపు ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ పాఠశాల అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఏ జిల్లాకు చెందిన విద్యార్థులు ఆ జిల్లా పరిధిలో ఉండే పాఠశాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హుత ఉండే విద్యార్థులు రెసిడెన్సియల్ స్కూల్స్  పోర్టల్ లేదా గురుకుల పాఠశాల అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారికీ, వారి జిల్లా పరిధిలో అడ్మిషన్ కల్పిస్తారు. ఇతర సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ప్రవేశాలు లాటరీ లేదా ముందు తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

Post Comment