Advertisement
ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ డిప్లొమా గర్ల్ స్టూడెంట్స్
Scholarships

ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ డిప్లొమా గర్ల్ స్టూడెంట్స్

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అందించే ఈ స్కాలర్షిప్ టెక్నికల్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు పొందే మహిళా విద్యార్థులకు అందిస్తారు. మహిళ విద్యార్థులను సాంకేతిక విద్యకు దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో AICTE దీన్ని అమలుచేస్తుంది. ఈ స్కాలర్షిప్ పరిధిలో ఏటా 5000 మంది టెక్నికల్ డిగ్రీలు చదువుకునే మహిళా విద్యార్థులు లబ్దిపొందుతున్నారు. ఈ పథకం పరిదిలో ఆంధ్రప్రదేశ్ నుండి గరిష్టంగా 318 స్కాలర్షిప్'లు, తెలంగాణ నుండి 206 స్కాలర్షిప్'లు పొందే అవకాశం ఉంది.

స్కాలర్షిప్ పేరు ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్ (టెక్నికల్ డిప్లొమా)
ఎవరు అర్హులు టెక్నికల్ డిప్లొమాలలో ప్రవేశం పొందిన మహిళా విద్యార్థులు
దరఖాస్తు ముగింపు తేదీ 15-01-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 31-01-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 31-01-2022

ఈ స్కాలర్షిప్'కు ఎంపికైన విద్యార్థులకు ఏటా 50,000 /- స్కాలర్షిప్ అందిస్తారు. దీన్ని గరిష్టంగా మూడేళ్లు అమలుచేసారు. ఈ స్కాలర్షిప్ తగినన్ని దరఖాస్తు లేని సమయంలో ఇదే స్కాలర్షిప్'ను టెక్నికల్ డిగ్రీలను చదివే మహిళా విద్యార్థులకు అందిస్తారు.

ఎవరు అర్హులు

ఈ స్కాలర్షిప్ స్కీమ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ పొందిన మహిళా విద్యార్థులు అర్హులు. విద్యార్థి టెన్త్ పూర్తిచేసిన రెండేళ్లలో డిప్లొమాలో చేరాల్సి ఉంటుంది. ఈ పథకం కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు మహిళా విద్యార్థులకు మాత్రమే అమలుచేసారు. విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం 8 లక్షలకు మించి ఉండకూడదు. విద్యార్థి 75% అకాడమిక్ హాజరు తప్పనిసరి నమోదు చేయాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హుత కలిగిన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని సక్రమంగా ఉండే దరఖాస్తులను వివిధ దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం తుది అర్హుతల జాబితాను రూపొందించి స్కాలర్షిప్ అందిస్తారు. సమాన అర్హుతలు కలిగిన విద్యార్థులను టెన్త్ కాల్స్ మెరిట్ మరియు వయస్సు ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. ఎక్కువ వయస్సు ఉండే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

దరఖాస్తు చేసే ముందు మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ కార్డు, మొబైల్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్లు అందుబటులో ఉంచుకోండి. ఈ స్కీమ్ చెందిన పూర్తి సమాచారం యూజీసీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది.

Post Comment