ఇండియాకు చెందిన ISpiice (ఇంటిగ్రేటెడ్ సోషల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియన్ చైల్డ్ ఎడ్యుకేషన్) చైల్డ్ ఎడ్యుకేషన్ మరియు విమెన్ ఎంపవర్మెంట్ అంశాల యందు వాలంటీర్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
గ్రామీణ భారతదేశంలోని అత్యంత అణగారిన వర్గాల మహిళలు మరియు పిల్లలకు సంబంధించి టీచింగ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌లు, చైల్డ్‌కేర్ ప్రోగ్రామ్‌లు, మహిళా సాధికారత కార్యక్రమాలు, పునరుద్ధరణ కార్యక్రమాలు, స్లమ్ లేదా స్ట్రీట్ చిల్డ్రన్ టీచింగ్ ప్రోగ్రామ్స్, హెల్త్ కేర్ సర్వీసెస్, టీచింగ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అంశాలతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఐస్పీస్ ప్రోగ్రాంలు ఒక వారం వ్యవధి నుండి గరిష్టంగా ఏడాది నిడివితో అందిస్తుంది. ఈ ప్రోగ్రాంలో స్వచ్చంధ సేవతో పాటుగా వారాంతాల్లో తాజ్ మహల్ టూర్, హిమాలయన్ ట్రెక్కింగ్ టూర్, మనాలి, జైపూర్‌లో అడ్వెంచర్ టూర్ మరియు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సందర్శన వంటి పర్యాటక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ప్రోగ్రాంలలో విదేశీయలతో పాటుగా దేశీయులు కూడా పాల్గునే అవకాశం కల్పిస్తున్నారు.
సామాజిక సేవ & ట్రావెలింగ్ అంశాలపై అభిరుచి వుండే వారికీ ఈ వాలంటీర్ ప్రోగ్రామ్స్ జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాలను అందిస్తుంది. ఒక వైపు సామజిక సేవ చేసే అదృష్టంతో పాటుగా మరో వైపు ఇండియాను సందర్శించే గొప్ప అవకాశం ఈ ప్రోగ్రాముల ద్వారా మీకు లభిస్తుంది.
ప్రోగ్రాం రుసుములు వారానికి గరిష్టంగా 150 $ డాలర్ల నుండి ప్రారంభం అవుతాయి. ఈ రుసుములతో విమానాశ్రయం పికప్ నుండి వసతి, భోజనం వరకు అన్ని రకాల సేవలు కల్పిస్తారు. ప్రోగ్రాం పూర్తియ్యాక వాలంటీర్ సర్టిఫికెట్ అందిస్తారు.
స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడం వలన, మీ సాధారణ పర్యటన వైవిధ్య భరితమవుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని స్థానిక సమాజలతో భాగస్వామ్యం చేస్తుంది, కొత్త సంస్కృతులను ప్రామాణికమైన రీతిలో అనుభవించే అవకాశం లభిస్తుంది.
ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇది ఉత్తమమైన మార్గం. మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి, జీవితకాల స్నేహాలను పెంచుకోవడానికి మరియు మీ అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ క్లిష్ట సమయంలో నిజమైన ప్రభావం చూపాలనుకుంటే ఈ అనుభూతిని తప్పక ఆస్వాదించాల్సిందే.