కేంద్ర సాయుధ పోలీసు బలగాలు | జీకే ప్రశ్నలు & సమాధానాలు
Study Material Telugu Gk

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు | జీకే ప్రశ్నలు & సమాధానాలు

భారతదేశంలో మొత్తం 7 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఉన్నాయి. వీటిని గతంలో సెంట్రల్ పారా-మిలిటరీ ఫోర్సెస్ (CPMF)గా పిలిచేవారు. 2011 నుండి "పారామిలిటరీ" అనే పదాన్ని తొలగించి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) అనే పేరుతొ పిలుస్తున్నారు. ఈ దళాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో దేశ అంతర్గత భద్రత మరియు సరిహద్దుల రక్షణకు బాధ్యత వహిస్తాయి.

Advertisement

కేంద్ర సాయుధ పోలీసు బలగాలుగా వర్గీకరించవచ్చు. అవి బోర్డర్ గార్డింగ్ ఫోర్సెస్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్. బోర్డర్ గార్డింగ్ ఫోర్సెస్ పరిధిలో అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, మరియు సశాస్త్ర సీమా బాల్ ఉండగా ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పరిధిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉన్నాయి. ఇక చివరిగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌గా పరిగణించబడుతుంది.

7 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

1. అస్సాం రైఫిల్స్

అస్సాం రైఫిల్స్ అనేవి సరిహద్దు భద్రత, తిరుగుబాటు వ్యతిరేకత మరియు ఈశాన్య భారతదేశంలో శాంతిభద్రతల నిర్వహణకు బాధ్యత వహించే కేంద్ర పారామిలిటరీ దళం. వీరు 1,643 కిలోమీటర్ల పొడవైన ఇండో-మయన్మార్ సరిహద్దుకు ఏడాది పొడుగునా రక్షణ కల్పిస్తారు. అస్సాం రైఫిల్స్ భారతదేశంలోని పురాతన పారామిలిటరీ దళంగా పరిగణించబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం మేఘాలయ (షిల్లాంగ్) లో ఉంది.

అస్సాం రైఫిల్స్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న అప్పటికి విధి విధానాల కార్యాచరణను భారత సైన్యం నిర్వహిస్తుంది. దీనిని 1835 లో బ్రిటిష్ వారు ప్రారంభించారు. ఈశాన్య భారతదేశంలో బ్రిటిష్ రాజ్ విస్తరణలో భాగంగా ఆ ప్రాంతంలోని తిరుగుబాటును అణచివేసేందుకు దీనిని స్థాపించారు. అస్సాం రైఫిల్స్ పరిధిలో ప్రస్తుతం 65 వేలకు పైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

అస్సాం రైఫిల్స్‌ను "సెంటినెల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్" మరియు "ఫ్రెండ్స్ ఆఫ్ ది హిల్ పీపుల్" అని కూడా పిలుస్తారు. ఈ సాయుధ దళాలు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో భారతదేశం తరుపున కీలక భూమిక పోషించాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఈ దళాలు అస్సాం సివిల్ పోలీస్‌లో భాగమయ్యాయి. అయితే స్వాతంత్ర్యం తర్వాత, భారత ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు దాని స్వంత డైరెక్టర్ జనరల్‌ను కేటాయించింది.

  • సాయుధ దళం పేరు : అస్సాం రైఫిల్స్
  • సాయుధ దళ విధి : ఇండో-మయన్మార్ సరిహద్దు రక్షణ
  • ప్రధాన కార్యాలయం : షిల్లాంగ్
  • స్థాపించిన ఏడాది : 1835
  • అత్యున్నత పదవి : డైరెక్టర్ జనరల్ (డీజీ)

2. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) పాకిస్తాన్, చైనా మరియు బంగ్లాదేశ్‌తో ఉన్న ఇండియా సరిహద్దు రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తుంది. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారత సరిహద్దు ఔట్‌పోస్టులపై పాకిస్తాన్ దాడులు పెరగడంతో దేశ సరిహద్దు రక్షణ వ్యూహంతో దీనిని 1 డిసెంబర్ 1965లో స్థాపించారు. బిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది. డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఉండే ఈ కార్యాలయాన్ని ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్ అని పిలుస్తారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా పరిగణించబడుతుంది. భారత భూభాగాల రక్షణలో బిఎస్ఎఫ్ తొలి రక్షణ వలయంగా ఉంటుంది. పాకిస్తాన్ (3,310 కిమీ), చైనా (3,488 కిమీ), బంగ్లాదేశ్ (4,096 కిమీ) పరిధిలో అధికారికంగా 6,300 కి.మీ.లకు పైగా భారత సరిహద్దులను బిఎస్‌ఎఫ్ పహారా కాస్తుంది. ప్రధానంగా సరిహద్దు నేరాలను నిరోధించడంతో పాటుగా, భారతదేశ భూభాగంలోకి అనధికారిక ప్రవేశం లేదా నిష్క్రమణ, స్మగ్లింగ్ మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది.

సరిహద్దు రక్షణ దళాలు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. ప్రపంచంలో ఎడారిలో, చిత్తడి నేలలలో, కొండలలో, అడవుల్లో మరియు అతిశీతల మంచు పర్వతాలలో సరిహద్దు భద్రతను నిర్వర్తించే ఏకైక దళం బీఎస్ఎఫ్ మాత్రమే. బిఎస్ఎఫ్ యందు మానవ సిబ్బందితో పాటుగా ప్రత్యేక ప్రాంతాల్లో కుక్కలు, ఒంటెలు, గుర్రాలు కూడా విధులు నిర్వర్తిస్తాయి

బిఎస్ఎఫ్ ప్రహర కాసే కొన్ని కీలక సరిహద్దులలో భారతదేశం -బంగ్లాదేశ్ ఎన్‌క్లేవ్‌, చైనా పరిధిలో అర్డాగ్ -జాన్సన్ లైన్, మాకార్ట్‌నీ -మాక్‌డొనాల్డ్ లైన్, మెక్‌మాన్ లైన్, పాకిస్తాన్ పరిధిలో రాడ్‌క్లిఫ్ లైన్, లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ మరియు సర్ క్రీక్ వంటివి ఉన్నాయి.

బిఎస్ఎఫ్ పాల్గున్న కీలక యుద్ధాలలో 1971 భారత-పాకిస్తాన్ యుద్ధం (లోంగేవాలా యుద్ధం), ఆపరేషన్ బ్లూ స్టార్ (1984), ఆపరేషన్ బ్లాక్ థండర్ , 1970ల్లో పంజాబ్ ఖలిస్తాన్ తిరుగుబాటు, జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాటు, ఆపరేషన్ విజయ్ - కార్గిల్ యుద్ధం, 2001–2002 ఆపరేషన్ ప్రకర్మ్ – ఇండియా-పాకిస్తాన్ స్టాండాఫ్ వంటివి ఉన్నాయి.

  • సాయుధ దళం పేరు : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
  • సాయుధ దళ విధి : ఇండో-పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • స్థాపించిన ఏడాది : 1965
  • అత్యున్నత పదవి : డైరెక్టర్ జనరల్ (డీజీ)

3. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 7 కేంద్ర సాయుధ బలగాలతో ఒకటి. ఇది దేశంలోని 356 పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలకు, ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భద్రత కల్పిస్తుంది. దీనిని 15 మార్చి 1969న భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

సీఐఎస్ఎఫ్ ప్రస్తుతం దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, మెట్రో రైలు నెట్‌వర్క్‌లు, ప్రభుత్వ భవనాలు, వారసత్వ ప్రదేశాలు, స్మారక చిహ్నాలను, యూనివర్శిటీలు, అణు విద్యుత్ ప్లాంట్లు, గనులు, అంతరిక్ష సంస్థాలు, వీఐపి భద్రతతో పాటు విపత్తు నిర్వహణలో కూడా సేవలు అందిస్తుంది. వీటితో పాటుగా దేశ అంతర్గత భద్రత, ఎన్నికలు, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు మరియు భారత ప్రభుత్వం వారికి ఇచ్చే ప్రతి ఇతర విధులను కూడా నిర్వహిస్తుంది.

2008 నుండి దేశ వ్యాప్తంగా ప్రైవేట్ మరియు సహకార సంస్థలకు, విదేశాల్లోని భారతీయ మిషన్‌లకు, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో రక్షణ కల్పించేందుకు బాధ్యత వహిస్తుంది. సీఐఎస్ఎఫ్‌కు డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి నాయకత్వం వహిస్తారు.

  • సాయుధ దళం పేరు : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
  • సాయుధ దళ విధి : పరిశ్రమలకు రక్షణ
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • స్థాపించిన ఏడాది : 1969
  • అత్యున్నత పదవి : డైరెక్టర్ జనరల్ (డీజీ)

4. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది దేశ అంతర్గత భద్రత కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రధాన కేంద్ర పోలీసు దళం. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశంలో శాంతిభద్రతలను మరియు తిరుగుబాటును నియంత్రించేందుకు 1939 లో ఏర్పాటు చేసారు. భారత స్వాతంత్ర్యం తర్వాత 28 డిసెంబర్ 1949న సీఆర్పీఎఫ్ చట్టం ద్వారా ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మారింది.  దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

సీఆర్పీఎఫ్‌కు ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన డైరెక్టర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సీఆర్పీఎఫ్‌ దళాలు వివిధ ఉపవిభాగాలుగా సేవలు అందిస్తాయి.

  1. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ : ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) అనేది ఇండియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ప్రత్యేక బెటాలియన్ వింగ్. ఇది మతపరమైన అల్లర్లు మరియు సంబంధిత పౌర అశాంతిని ఎదుర్కోవడానికి అక్టోబర్ 1992లో ఏర్పాటు చేయబడింది.
  2. పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ : పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ అనేది పార్లమెంట్ భద్రతకు సంబందించిన సాయుధ రక్షణ దళం. వీరు అణు మరియు బయో-రసాయనిక దాడులు, ఇతర రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించిన ప్రవర్తనా నిర్వహణ, పోరాడడంలో శిక్షణ పొంది ఉంటారు.
  3. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) : స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది సీఆర్పీఎఫ్‌ యొక్క ఎలైట్ బెటాలియన్. ఇది ప్రధానమంత్రి అధికారిక నివాసంకు, ఆయన కార్యాలయానికి అలాగే ప్రధాని బహిరంగ కార్యక్రమాలకు, పర్యటనలకు భద్రత కల్పిస్తుంది.
  4. కోబ్రా : కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) అనేది భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి 2008లో సృష్టించబడిన సీఆర్పీఎఫ్‌ యొక్క ప్రత్యేక ఆపరేషన్ యూనిట్. వీరు గెరిల్లా వార్‌ఫేర్‌లో ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. నక్సలైట్ గ్రూపులను ట్రాక్ చేయడానికి, వేటాడేందుకు మరియు నిర్మూలించడానికి వీరు బాధ్యత వహిస్తారు.
  • సాయుధ దళం పేరు : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
  • సాయుధ దళ విధి : దేశ అంతర్గత రక్షణ
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • స్థాపించిన ఏడాది : 1939
  • అత్యున్నత పదవి : డైరెక్టర్ జనరల్ (డీజీ)

5. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ అనేది టిబెట్ సరిహద్దుల వెంబడి మోహరించిన భారతదేశ సరిహద్దు గస్తీ సంస్థ. 1962 నాటి చైనా-భారత యుద్ధం తర్వాత అదే ఏడాది దీనిని ఏర్పాటు చేశారు. అయితే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ 1992 నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

ఇండో-టిబెటన్ దళాలు ప్రస్తుతం లడఖ్‌లోని కారకోరం పాస్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని దిఫులా వరకు సరిహద్దు వెంబడి మోహరించబడ్డాయి ఉంటాయి. వీరు ఉత్తర సరిహద్దులపై నిఘా, సరిహద్దు ఉల్లంఘనలను గుర్తించడంతో పాటుగా, అక్రమ వలసలు మరియు సరిహద్దు స్మగ్లింగ్‌ కార్యకలాపాలను నియంత్రిస్తారు. అలానే పర్వత ప్రాంతాల విపత్తుల సమయంలో విపత్తు రెస్క్యూ సేవలు అందిస్తారు.

  • సాయుధ దళం పేరు : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్
  • సాయుధ దళ విధి : భారత్, చైనా, టిబెట్ సరిహద్దు భద్రత
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • స్థాపించిన ఏడాది : 1962
  • అత్యున్నత పదవి : డైరెక్టర్ జనరల్ (డీజీ)

6. సశాస్త్ర సీమా బల్

సశాస్త్ర సీమా బల్ అనేది నేపాల్ మరియు భూటాన్‌లతో సరిహద్దుల వెంబడి మోహరించిన భారతదేశ సరిహద్దు రక్షణ దళం. ఇది కూడా 1962 ఇండో-చైనా యుద్ధం తర్వాత దేశ సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 1963 లో ఏర్పాటు చేశారు. 2001కి ముందు ఈ దళాన్ని స్పెషల్ సర్వీస్ బ్యూరో (SSB)గా పిలిచేవారు. అయితే 2007 నుండి సశాస్త్ర సీమా బల్ పేరుతొ పిలవబడుతుంది.

  • సాయుధ దళం పేరు : సశాస్త్ర సీమా బల్
  • సాయుధ దళ విధి : భారత్, నేపాల్, టిబెట్ సరిహద్దు భద్రత
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • స్థాపించిన ఏడాది : 1963
  • అత్యున్నత పదవి : డైరెక్టర్ జనరల్ (డీజీ)

7. నేషనల్ సెక్యూరిటీ గార్డ్

నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ను సాధారణంగా బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తారు. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద భారతదేశంలోని ఉగ్రవాద నిరోధక విభాగం. దీని 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ తరువాత దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను, అంతర్గత విద్రోహ శక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసారు. అయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యాక్ట్ 1986 ద్వారా ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.

  1. స్పెషల్ యాక్షన్ గ్రూప్ (SAG) : ఇది తీవ్రవాద వ్యతిరేక మరియు తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది.
  2. స్పెషల్ రేంజర్ గ్రూప్ (SRG) : కౌంటర్ టెర్రరిస్ట్ ఫోర్స్ కింద తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి బాధ్యత వహిస్తుంది.
  3. స్పెషల్ కంపోజిట్ గ్రూప్ (SCG) : ప్రాంతీయ టెర్రర్ నిరోధక కార్యకలాపాలను నియంత్రిస్తారు. ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా మరియు గాంధీనగర్ లలో దీని ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది.
  4. ఎలక్ట్రానిక్ సపోర్ట్ గ్రూప్ (ESG) : ఇది తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన దర్యాప్తులో కమ్యూనికేషన్ మరియు సాంకేతిక మద్దతును అందిస్తుంది.
  5. నేషనల్ బాంబ్ డేటా సెంటర్ : దేశంలోని అన్ని బాంబు సంఘటనలను పర్యవేక్షించడం, రికార్డ్ చేయడం మరియు విశ్లేషించడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
  • సాయుధ దళం పేరు : నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌
  • సాయుధ దళ విధి : తీవ్రవాద కార్యకలాపాలు నియంత్రణ
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • స్థాపించిన ఏడాది : 1984
  • అత్యున్నత పదవి : డైరెక్టర్ జనరల్ (డీజీ)

ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు

1. భారతదేశపు పురాతన పారామిలిటరీ దళం ఏది ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
2. అస్సాం రైఫిల్స్

2. భారతదేశంలో అతిపెద్ద పారామిలిటరీ దళం ఏది ?

  1. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
  2. అస్సాం రైఫిల్స్
  3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్

3. కింది వాటిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిది ఏది ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్

4. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన సాయుధ దళం ఏది ?

  1. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
  2. అస్సాం రైఫిల్స్
  3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

5. కింది వాటిలో ఏ పారామిలటరీ దళం ప్రపంచ యుద్ధంలో పాల్గొంది ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
2. అస్సాం రైఫిల్స్

6. రాన్ ఆఫ్ కచ్‌లో ప్రహర కాసే కేంద్ర సాయుధ దళం ఏది ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

7. 'ఫ్రెండ్స్ ఆఫ్ ది హిల్స్ పీపుల్' అని కింది వారిలో ఎవరిని అంటారు ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
2. అస్సాం రైఫిల్స్

8. రవాణా కోసం థార్ ఎడారిలో ఒంటెలను ఉపయోగించే సాయుధ దళం ఏది ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

9. కింది వాటిలో విదేశాల్లో కూడా భద్రత కల్పించే సాయుధ దళం ఏది ?

  1. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
  2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్

10. నక్సలైట్లను నిర్ములించేందుకు పనిచేసే సాయుధ దళం ఏది ?

  1. రాపిడ్ యాక్షన్ ఫోర్స్
  2. కోబ్రా
  3. స్పెషల్ యాక్షన్ గ్రూప్
  4. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
సమాధానం
2. కోబ్రా

11. కింది వాటిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సంబంధించిన ఉప విభాగం ఏది ?

  1. స్పెషల్ కంపోజిట్ గ్రూప్
  2. స్పెషల్ రేంజర్ గ్రూప్
  3. స్పెషల్ యాక్షన్ గ్రూప్
  4. పైవి అన్నీ
సమాధానం
4. పైవి అన్నీ

12. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను నియంత్రించే సాయుధ దళం ఏది ?

  1. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
  2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
1. నేషనల్ సెక్యూరిటీ గార్డ్

13. నేపాల్ & భూటాన్‌లతో సరిహద్దుల ప్రహర కాసే సాయుధ దళం ?

  1. అస్సాం రైఫిల్స్
  2. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. సశాస్త్ర సీమా బాల్
సమాధానం
4. సశాస్త్ర సీమా బాల్

14. మతపరమైన అల్లర్లను నియంత్రిచే సాయుధ దళం ?

  1. స్పెషల్ డ్యూటీ గ్రూప్
  2. కోబ్రా
  3. రాపిడ్ యాక్షన్ ఫోర్స్
  4. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
సమాధానం
3. రాపిడ్ యాక్షన్ ఫోర్స్

15. ఇండో-మయన్మార్ సరిహద్దు రక్షణకు బాధ్యత వహించే సాయుధ దళం ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
2. అస్సాం రైఫిల్స్

16. 'సెంటినెల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్' అని కింది వారిలో ఎవరిని అంటారు ?

  1. సశాస్త్ర సీమా బాల్
  2. అస్సాం రైఫిల్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
2. అస్సాం రైఫిల్స్

17. భారత ప్రధాని యొక్క రక్షణ బాధ్యతలను నిర్వహించే సాయుధ దళం ?

  1. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్
  2. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
  3. ఇంటెలిజెన్స్ బ్యూరో
  4. పార్లమెంట్ డ్యూటీ గ్రూప్
సమాధానం
1. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్

18. భారత రాష్ట్రపతికి ఎవరు రక్షణ కల్పిస్తారు ?

  1. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్
  2. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
  3. ఇంటెలిజెన్స్ బ్యూరో
  4. ప్రెసిడెంట్స్ బాడీగార్డ్
సమాధానం
4. ప్రెసిడెంట్స్ బాడీగార్డ్

18. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం ఏది ?

  1. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
  2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

19. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వెంబడి ప్రహర కాసే సాయుధ దళం ?

  1. నేషనల్ సెక్యూరిటీ గార్డ్
  2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
  3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సమాధానం
4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

20. భారతదేశంలో మొత్తం ఎన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఉన్నాయి ?

  1. 5 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు
  2. 6 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు
  3. 7 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు
  4. 8 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు
సమాధానం
4. 8 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

Advertisement

Post Comment