Advertisement
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లుగా చేరండి
Career Guidance Volunteer Programs

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లుగా చేరండి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీరుగా చేరండి. ప్రకృతి విపత్తుల సమయంలో, దేశ అత్యవసర సమయాల్లో వైద్య మరియు మానవీయ కోణంలో స్వచ్చంధ సేవలు అందించే భారత రెడ్ క్రాస్ సొసైటీ (IRCS)  1920 లో స్థాపించబడింది.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలో బాధిత సైనికులకు సహాయక సేవలు అందించలనే సంకల్పంతో దీన్ని నెలకొల్పారు . ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేశంలో బ్లడ్ బ్యాంకుల నిర్వహణ, విద్య మరియు శిక్షణ కార్యక్రమాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ప్రథమ చికిత్స కార్యక్రమాలు, క్షయవ్యాధి నివారణ (TB) ప్రాజెక్ట్లు వంటివి నిర్వహిస్తుంది.

భారత రెడ్ క్రాస్ సొసైటీ భారతదేశమంతటా 700 పైగా శాఖలను కలిగిఉంది. జూనియర్ వాలంటీర్ కార్యక్రమాల ద్వారా వేల సంఖ్యలో యువతను స్వచ్చంధ సేవకులుగా అవకాశం కల్పిస్తుంది."మానవత్వం, నిష్పాక్షికత, తటస్థత, స్వాతంత్ర్యం, స్వచ్ఛంద సేవ, ఐక్యత మరియు సార్వత్రికత" అనే ఏడు  ప్రాథమిక సూత్రాల ఆధారంగా పనిచేసే రెడ్ క్రాస్ యందు వాలంటీర్లుగా చేరి దేశంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు యందు ప్రజలకు సహాయం చేసే అదృష్టం దక్కించుకొండి.

సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్ (SERV) ప్రోగ్రాం

భారత రెడ్ క్రాస్ సొసైటీ ఇటీవలే సోషల్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్ (SERV) కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాన్ ఇండియా ప్రాతిపదికన మాస్టర్ ట్రైనర్లు, ఇన్‌స్ట్రక్టర్లు మరియు SERV వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. శిక్షణ పొందిన SERV వాలంటీర్లు, SERV బోధకులను జిల్లా కేంద్రానికి 1000 మంది చెప్పనా అందుబాటులో వుంచుతుంది.

ప్రతి రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖలో కనీసం ఒక మాస్టర్ ట్రైనర్ అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసింది. వీరంతా అవసరమయ్యే సమయంలో సామాజిక ప్రచారాలుతో పాటుగాఆరోగ్య మరియు విపత్తు సంబంధిత సందేశాలను, సేవలను అందిస్తారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మొదటి కమ్యూనిటీ రెస్పాండర్లుగా వీళ్లంతా ముందు వరుసలో ఉంటారు. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యాలయం (NHQ) మరియు సంబంధిత కార్యకలాపాల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి.

భారత రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొందండి

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం మరియు జిల్లా స్థాయిలో శాఖలు ఉన్నాయి. భారతదేశ రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన సంబంధిత రాష్ట్ర/జిల్లా శాఖలో నమోదు చేసుకోవడం ద్వారా సభ్యత్వం పొందొచ్చు. యువత స్వచ్చంధ సేవలో భాగమయ్యేందుకు భారత రెడ్ క్రాస్ సొసైటీ నాలుగు మార్గాలలో అవకాశం కల్పిస్తుంది. వీటిలో

  1. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మెంబెర్‌షిప్
  2. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వాలంటీర్
  3. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ యూత్ /జూనియర్ రెడ్ క్రాస్ మెంబెర్
  4. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ  డొనేషన్స్

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మెంబెర్‌షిప్ పొందండి

భారత రెడ్ క్రాస్ సొసైటీ 7 రకాల మెంబర్షిప్ ఎంపికలను అందుబాటులో ఉంచింది. ఇందులో ప్యాట్రన్ సభ్యతం తీసుకునే వారికీ భారత రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుని హోదాలో భారత రాష్ట్రపతి గౌరవ సంతకం చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ప్యాట్రన్ సభ్యత్వ ధృవపత్రాన్ని అందిస్తారు.

వైస్ ప్యాట్రన్, లైఫ్ మెంబెర్ మరియు లైఫ్ అసోసియేట్ సభ్యత్వం తీసుకునే వారికీ సొసైటీ చైర్మన్ మరియు సెక్రటరీ జనరల్ సంతకం చేసిన సభ్యత్వ ధృవపత్రాన్ని అందిస్తారు. సభ్యత్వం జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయాలు సిపార్సు చేసే వారికీ మాత్రమే కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు మీ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీన కార్యాలయాలను సంప్రదించడం ఈ అవకాశాన్ని దక్కించుకొవచ్చు.

Indian red cross

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వాలంటీర్ అవ్వండి

1920 లో రెడ్ క్రాస్ ప్రారంభమైనప్పటి నుండి రెడ్ క్రాస్ చేపట్టే అన్ని కార్యకలాపాలకు వాలంటీర్లు వెన్నెముకగా ఉన్నారు. అవసరమైన ప్రతి సందర్భంలో లక్షలాది మంది బలహీన ప్రజలకు సహాయం చేస్తూ వస్తున్నారు. రెడ్ క్రాస్ కూడా సాధ్యమైనప్పుడల్లా వాలంటీర్లను గుర్తిస్తుంది. వారికీ తగిన వ్యక్తిగత అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది.

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జాతి, లింగం, మత విశ్వాసం, వయస్సు, వైకల్యం లేదా సభ్యత్వంతో సంబంధం లేకుండా వాలంటీర్లకు సేవ చేసే అవకాశం కల్పిస్తుంది. వాలంటీర్లందరూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొందడానికి అర్హులు. ఆసక్తి ఉండే అభ్యర్థులు మీ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించడం ఈ అవకాశాన్ని దక్కించుకొవచ్చు.

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ యూత్ & జూనియర్ రెడ్ క్రాస్ మెంబెర్ అవ్వండి

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ యూత్ & జూనియర్ రెడ్ క్రాస్ మెంబెర్ కార్యక్రమం పాఠశాల, కాలేజీ విద్యార్థులకు సంబంధించిన వాలంటీరి ప్రోగ్రాం. విద్యాసంస్థల సిపార్సు ద్వారా తమ స్థానిక కమ్యూనిటీలలోని అత్యంత బలహీన వ్యక్తుల అవసరాలను తీర్చడంలో ఈ యువ వాలంటీర్లు భాగస్వామ్యం అవుతారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వంలో గణనీయమైన భాగం వీళ్లతోనే నిండి ఉంటుంది. యువత సామాజిక కార్యక్రమాలలో భాగమవ్వడం కొంటె గొప్ప విషయం ఇంకేముంటుంది. ఆసక్తి ఉండే విద్యార్థులు మీ కాలేజీ యాజమాన్యం సహాయంతో స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించండి.

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కోసం డొనేషన్స్

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం లేని వారికి..డొనేషన్స్ అందివ్వడం ద్వారా ఆ సేవలో భాగస్వామ్యం చేసే అవకాశం కల్పిస్తుంది. సమాజానికి సేవ చేయాలంటే ఫీల్డ్ స్థాయిలోనే చేయాల్సిన అవసరం లేదు. దాతృత్వం కూడా చేయొచ్చు.

దాతృత్వం అనేది నిజంగా ఒక గొప్ప గుణం. అవకాశం ఉన్న సంధర్భాలలో ఈ గుణాన్ని ప్రతి ఒక్కరు ప్రదర్శించాల్సినేదే. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఎవరో ఒక అభాగ్యుడికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు. రెడ్ క్రాస్ దాతలు ఇచ్చే ప్రతి రూపాయికి సంపూర్ణ న్యాయం చేస్తుంది.

Post Comment