గో ఎకో అనేది ప్రముఖ పర్యావరణ పర్యాటక సంస్థ. గో ఎకో వాలంటీర్ ఆర్గనైజేషన్ 2005 లో జోనాథన్ గిల్బెన్ మరియు జోనాథన్ తాల్ చేత స్థాపించబడింది. ఈ ఆర్గనైజషన్ ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో 150 కి పైగా వన్యప్రాణులు, మానవతా మరియు పర్యావరణ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది.
గో ఎకో బృంధం అనుభవజ్ఞులైన మరియు ఉద్వేగభరితమైన నిపుణులతో సేవలు అందిస్తుంది. ట్రావెలింగ్‌తో పాటుగా వన్యప్రాణులు, మానవతా మరియు పర్యావరణ సంరక్షణ అంశాల యందు అభిరుచి ఉండే వారికీ గో ఎకో అందించే ప్రోగ్రాంలు జీవితకాలం గుర్తిండిపోయే అనుభవాలను అందిస్తాయి.
గో ఎకో ప్రస్తుతం 50 దేశాలలో 150 కంటే ఎక్కువ స్థిరమైన వాలంటీర్ & ట్రావెల్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తుంది. ఈ కార్యక్రమాలు ప్రధానంగా వన్యప్రాణుల సంరక్షణ, సముద్ర సంరక్షణ, జంతు సంరక్షణ, విద్య, పిల్లల సంరక్షణ మరియు వైద్య సంరక్షణ ఆధారితంగా ఉంటాయి. ఈ ప్రోగ్రాంలు కనిష్టంగా 1 వారం వ్యవధి నుండి గరిష్టంగా ఏడాది నిడివితో ఉంటాయి.
గో ఎకో ప్రోగ్రాం రుసుములు ప్రయాణించే దేశం ఆధారంగా వారానికి గరిష్టంగా 500 $ డాలర్ల నుండి ప్రారంభం అవుతాయి. ఈ రుసుములతో విమానాశ్రయం పికప్ నుండి వసతి, భోజనం వరకు అన్ని రకాల సేవలు కల్పిస్తారు. ప్రోగ్రాం పూర్తియ్యాక సర్టిఫికేట్ అందజేస్తారు.
వన్యప్రాణులు, మానవతా మరియు పర్యావరణ ప్రోగ్రాంలలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడం వలన, మీ సాధారణ పర్యటన వైవిధ్య భరితమవుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని స్థానిక జంతు సమాజలతో భాగస్వామ్యం చేస్తుంది, ప్రకృతిని ప్రామాణికమైన రీతిలో అనుభవించే అవకాశం లభిస్తుంది.
ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇది ఉత్తమమైన మార్గం. మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి, జీవితకాల స్నేహాలను పెంచుకోవడానికి మరియు మీ అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ క్లిష్ట సమయంలో నిజమైన ప్రభావం చూపాలనుకుంటే ఈ అనుభూతిని తప్పక ఆస్వాదించాల్సిందే.