అమృత AEEE 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Engineering Entrance Exams

అమృత AEEE 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

ఏఈఈఈ పరీక్షను అమృత విద్యా పీఠంలో బీటెక్ అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఏఈఈఈ అనగా అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని అర్ధం. దేశంలో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలలో 95 శాతం ప్లేస్మెంట్లతో అమృత విద్యా పీఠం ప్రధమ స్థానంలో ఉంది.

Advertisement

ఐఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగులో అమ్రిత 4వ స్థానంలో ఉండగా, దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి టైమ్స్ ఇచ్చిన ర్యాంకింగులో దేశంలో ప్రధమ స్థానం దక్కించుకుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి 200 పైగా కంపెనీలు అమ్రితలో తరుచు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందించేందుకు ముందుకు వస్తున్నాయ్యంటే వారిచ్చే క్వాలిటీ ఎడ్యుకేషన్ గూర్చి అర్థంచేసుకోవచ్చు.

అమృత విద్యాలయంకు దేశ వ్యాప్తంగా 6 క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రధాన క్యాంపస్ అమృతపురి కాకుండా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, మైసూరు మరియు కొచ్చిలో అనుబంధ క్యాంపసులు కలిగిఉంది. ఇందులో అమ్రితపురి, బెంగళూరు, చెన్నై మరియు కోయంబత్తూరులో ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది.

అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2023

Exam Name AEEE 2023
Exam Type Admission
Admission For B.Tech
Exam Date 21-28 April 2023
Exam Duration  1.30 Hours
Exam Level University Level

అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వివరాలు

అమృత విద్యా పీఠం అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు

అమృతపురి క్యాంపస్ (కేరళ)
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్)
ఎలక్ట్రికల్ & కంప్యూటర్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
బెంగుళూరు క్యాంపస్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్)
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
చెన్నై క్యాంపస్
కంప్యూటర్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ )
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ)
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
కోయంబత్తూరు క్యాంపస్
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ )
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ)
ఎలక్ట్రికల్ & కంప్యూటర్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్

ఏఈఈఈ 2023 షెడ్యూల్

ఏఈఈఈ 2023 ఫేజ్ 1
రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 2023
ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ బుకింగ్ ఏప్రిల్ 2023
ఏఈఈఈ ఎగ్జామ్ ఫేజ్ 1 21-28 ఏప్రిల్ 2023
ఫలితాలు జూన్ 2023
కౌన్సిలింగ్ జూన్ 2023
ఏఈఈఈ 2023 ఫేజ్ 2
ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ బుకింగ్ ఏప్రిల్ 2023
ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ బుకింగ్ మే 2023
ఏఈఈఈ ఫేజ్ 2 5-11 మే 2023
ఫలితాలు జూన్ 2023
కౌన్సిలింగ్ జూన్ 2023

ఏఈఈఈ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

దరఖాస్తు రుసుములు పరీక్ష కేంద్రాలు
AEEE : 1200 /-
JEE తో : 500/-
కౌన్సిలింగ్ ఫీజు : 5000/- (తిరిగి ఇవ్వబడదు)
ఆన్లైన్ రిమోట్ ప్రొటెక్టెడ్ టెస్ట్ (నేరుగా మీ ల్యాప్టాప్ లేదా పీసీ ద్వారా ప్రవేశ పరీక్షా రాయాల్సి ఉంటుంది)

 

ఏఈఈఈ ఎలిజిబిలిటీ

  • 60 శాతం మార్కులతో మ్యాథ్స్ కాంబినేషనుతో ఇంటర్/10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి
  • అభ్యర్థులు 1జులై 1999 తర్వాత జన్మించి ఉండాలి
  • SAT పరీక్షలో ఉత్తీర్ణత పొందినవారు కూడా అర్హులు
  • JEE మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత పొందినవారు కూడా అర్హులు

ఏఈఈఈ రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్

ఏఈఈఈ రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్ కోసం అభ్యర్థులు అమ్రిత అధికారిక యూనివర్సిటీ వెబ్సైటు (www.amrita.edu/btech) సందర్శించాలి. దరఖాస్తులో మీ సంబంధిత వ్యక్తిగత, విద్యా మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అదేవిధంగా మీరు పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

అభ్యర్థి అప్లికేషన్ ఐడీతో పరీక్షకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ వివరాలతో వెబ్సైటు లాగిన్ అవ్వగానే అందుబాటులో ఉన్న ఎగ్జామ్ తేదీలు మరియు సమయాలను మీకు సూచిస్తుంది. వాటిలో మీకు అనుకూలంగా ఉండే తేదీని, సమయాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్లాట్ బుకింగ్ పూర్తిచేసే ముందు అక్కడ కనిపించే మీ ప్రొఫైల్ వివరాలు సరిపోలి ఉన్నాయోలేదో గమనించడం మరవకండి. స్లాట్ బుక్ చేసుకున్నాక ప్రవేశ పరీక్షకు సంబందించిన తాజా వివరాల కోసం తరుసు యూనివర్సిటీ వెబ్సైటును సందర్శిస్తూ ఉండండి. www.amrita.edu/btech

ఏఈఈఈ ఎగ్జామ్ నమూనా

ఏఈఈఈ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది సీబీటీ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష 2.30 గంటల నిడివితో 300 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో మొత్తం మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుండి 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి.

వాటిలో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన జవాబు గుర్తించిన ప్రశ్నలకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు -1 మార్కులు తొలగిస్తారు. పరీక్షా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సిలబస్  ప్రశ్నలు మార్కులు
పార్ట్ 1 ఫిజిక్స్ 30 90
పార్ట్ 2 కెమిస్ట్రీ 25 75
పార్ట్ 3 మ్యాథ్స్ 40 120
పార్ట్ 4 ఇంగ్లీష్ 5 15
మొత్తం 100 300

ఏఈఈఈ సీట్ల కేటాయింపు ప్రక్రియ

అమృత విద్యాలయంలో ఈ ఏడాది కౌన్సిలింగ్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుంది. అర్హుత సెంట్రలైజ్డ్ సీట్స్ ఆలోకేషన్ ప్రాసెస్ (CSAP) ప్రక్రియ 3 దశలలో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తిచేయనుంది. ఏఈఈఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి నేరుగా మీ ర్యాంకు కార్డు వివరాలతో కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గునవచ్చు.

ముందుగా ప్రకటించిన తేదీన CSAP వెబ్ పోర్టల్ లైవ్ ప్రక్రియ మొదలవ్వగానే మీ మొబైల్ ఫోనుకు టెక్స్ట్ మెసేజ్ పంపిస్తరు. కౌన్సిలింగ్ ప్రక్రియలో ఒకసారి పొందుపర్చిన సమాచారం మార్చుకునే అవకాశం ఉండదు. అందువలన ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించండి. ఒకసారి సీట్ కేటాయింపు జరిగాక ఇతర అకాడమిక్ ఫీజులు చెల్లించడం ద్వారా కౌన్సలింగ్ ప్రక్రియ పూర్తిఅవుతుంది.

మరిన్ని ఏఈఈఈ వివరాల కోసం

btech@amrita.edu

9443384458 | 7034024264 | 9943984590 | 9344914201 | 9345913300 | 9946840540 | 7736546540 | 6366576503

Advertisement

Post Comment