October 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023 Telugu Current Affairs

October 2023 Current Affairs Questions In Telugu

30 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ అక్టోబర్ 2023. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. కింది వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారి ఏది ?

  1. చంగ్లా పాస్
  2. ఖర్దుంగ్ లా పాస్
  3. ఉమ్లింగ్ లా పాస్
  4. మయోడియా పాస్
సమాధానం
3. ఉమ్లింగ్ లా

2. అంతర్జాతీయ అహింసా దినోత్సవంను ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు ?

  1. మథర్ థెరీసా
  2. నెల్సన్ మండేలా
  3. మహాత్మా గాంధీ
  4. ఉరి అవ్నేరీ
సమాధానం
3. మహాత్మా గాంధీ

3. ఇటీవలే శానిటరీ ప్యాకెట్ల పంపిణీలో గిన్నిస్ రికార్డ్‌ను నెలకొల్పిన వెల్ఫేర్ ట్రస్ట్ ఏది ?

  1. ఒడిశా వెల్ఫేర్ ట్రస్ట్
  2. అస్సాం వెల్ఫేర్ ట్రస్ట్
  3. మిజోరాం వెల్ఫేర్ ట్రస్ట్
  4. చండీగఢ్ వెల్ఫేర్ ట్రస్ట్
సమాధానం
4. చండీగఢ్ వెల్ఫేర్ ట్రస్ట్

4. నోబెల్ బహుమతి కింది వాటిలో ఏ విభాగంలో అందిస్తారు ?

  1. మెడిసిన్ & సోషియాలజీ
  2. స్టాటిస్టిక్స్ & ఎకానమీ
  3. ఫిజియాలజీ & లిటరేచర్
  4. ఆప్షన్ 2 & 3 సరైనవి
సమాధానం
3. ఫిజియాలజీ & లిటరేచర్

5. రసాయన శాస్త్రంలో 2023 నోబెల్ బహుమతి విజేత ఎవరు ?

  1. మౌంగి బావెండి & లూయిస్ బ్రూస్
  2. అలెక్సీ ఎకిమోవ్‌
  3. పియర్ అగోస్టిని & ఫెరెన్క్ క్రౌజ్
  4. ఆప్షన్ 1 & 2 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1 & 2 సరైనవి

6. 2023 నోబుల్ శాంతి పురస్కారం విజేత ?

  1. అబీ అహ్మద్
  2. నర్గేస్ మొహమ్మది
  3. అలెస్ బిలియాట్స్కీ
  4. డిమిత్రి మురాటోవ్
సమాధానం
2. నర్గేస్ మొహమ్మది  

7. ఆర్21/మెట్రిక్స్-ఎం వాక్సిన్ ఏ వ్యాధి నివారణకు సంబంధించి ఆమోదం పొందింది ?

  1. కోవిడ్ 19
  2. ఎబోలా వైరస్
  3. నిపా వైరస్
  4. మలేరియా
సమాధానం
4. మలేరియా

8. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు గ్లోబల్ అంబాసిడర్‌ ఎవరు ?

  1. షేన్ వార్న్
  2. రాహుల్ ద్రావిడ్
  3. రికీ పాంటింగ్
  4. సచిన్ టెండూల్కర్‌
సమాధానం
4. సచిన్ టెండూల్కర్‌

9. తెలంగాణలోని ఏ జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది ?

  1. భద్రాద్రి కొత్తగూడెం
  2. ములుగు
  3. మణుగూరు
  4. జయశంకర్-భూపాలపల్లి
సమాధానం
2. ములుగు

10. దేశంలో మొదటి కుల గణన నిర్వహించిన రాష్ట్రం ఏది ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. రాజస్థాన్
  3. ఒడిశా
  4. బీహార్
సమాధానం
4. బీహార్ 

11. ఇరానీ కప్ అనేది దేశంలో ఏ క్రీడకు సంబంధి నిర్వహిస్తారు ?

  1. క్రికెట్
  2. కబడ్డీ
  3. హాకీ
  4. ఫుట్‌బాల్
సమాధానం
1. క్రికెట్

12. బాడిస్ లిమాకుమి అనే రంగులు మార్చే చేప ఏ రాష్టంలో గుర్తించబడింది ?

  1. కేరళ (చలియార్ నది)
  2. అరుణాచల్ ప్రదేశ్ (సియోమ్ నది)
  3. తెలంగాణ (మూసీ నది)
  4. నాగాలాండ్‌ (మిలక్ నది)
సమాధానం
4. నాగాలాండ్‌లోని మిలక్ నది

13. 2023 ఆసియా క్రీడలకు ఏ నగరం ఆతిధ్యం ఇచ్చింది ?

  1. గ్వాంగ్‌జౌ సిటీ
  2. బీజింగ్ సిటీ
  3. హాంగ్‌జౌ సిటీ
  4. నాన్జింగ్ సిటీ
సమాధానం
3. హాంగ్‌జౌ సిటీ

14. ఇటీవలే సిక్కిం వరదలకు కారణమైన హిమనదీయ సరస్సు ?

  1. చంద్ర తాల్ సరస్సు
  2. రూప్‌కుండ్ సరస్సు
  3. లొనాక్ సరస్సు
  4. కేదార్తాల్ సరస్సు
సమాధానం
3. లొనాక్ సరస్సు

15. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహారం అందించిన మొదటి రాష్ట్రం ఏది ?

  1. తెలంగాణ
  2. ఆంధ్రప్రదేశ్
  3. తమిళనాడు
  4. పంజాబ్
సమాధానం
3. తమిళనాడు

16. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది ?

  1. నేపాల్
  2. ఇండియా
  3. బంగ్లాదేశ్
  4. రష్యా
సమాధానం
3. బంగ్లాదేశ్

17. ఇస్రో యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఏది ?

  1. చంద్రయాన్ మిషన్
  2. గగన్‌యాన్ మిషన్
  3. ఆదిత్య ఎల్1 మిషన్
  4. కార్టోశాట్ మిషన్
సమాధానం
2. గగన్‌యాన్ మిషన్

18. నాగపట్నం నుండి శ్రీలంకకు ప్రారంభించిన ప్యాసింజర్ ఫెర్రీ సర్వీసు పేరు ?

  1. వాయేజ్ ఎక్స్‌ప్రెస్
  2. మహాబాహు క్రూజ్
  3. గంగా విలాస్ క్రూజ్
  4. చెరియపాణి ఫెర్రీ
సమాధానం
4. చెరియపాణి ఫెర్రీ

19. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ దేనికి సంబందించింది ?

  1. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ఆపరేషన్
  2. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనిక ఆపరేషన్
  3. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ సైనిక ఆపరేషన్
  4. ఇజ్రాయిల్‌లో హమాస్ సైనిక ఆపరేషన్
సమాధానం
3. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ సైనిక ఆపరేషన్

20. తంగ్సా టెక్స్‌టైల్ ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ పొందింది ?

  1. తమిళనాడు
  2. హిమాచల్ ప్రదేశ్
  3. అరుణాచల్ ప్రదేశ్‌
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
3. అరుణాచల్ ప్రదేశ్‌

21. కింది వాటిలో అత్యధిక అసెంబ్లీ సీట్లు కలిగిన రాష్ట్రం ఏది ?

  1. రాజస్థాన్
  2. తెలంగాణ
  3. మధ్యప్రదేశ్
  4. ఛత్తీస్‌గఢ్‌
సమాధానం
3. మధ్యప్రదేశ్

22. కింది వాటిలో ఇ క్యాబినెట్ వ్యవస్థను అమలు చేస్తున్న రాష్ట్రాలు ఏవి ?

  1. త్రిపుర & అరుణాచల్ ప్రదేశ్
  2. త్రిపుర & గుజరాత్
  3. ఉత్తరప్రదేశ్ & మిజోరాం
  4. ఉత్తరాఖండ్ & కేరళ
సమాధానం
1. త్రిపుర & అరుణాచల్ ప్రదేశ్

23. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయ పౌరుల కోసం చేపట్టిన ఆపరేషన్ ?

  1. ఆపరేషన్ కావేరి
  2. ఆపరేషన్ గంగ
  3. ఆపరేషన్ దేవి శక్తి
  4. ఆపరేషన్ అజయ్
సమాధానం
4. ఆపరేషన్ అజయ్

24. ఆస్కార్ లైబ్రరీ కలెక్షన్‌లో చోటు దక్కించుకున్న భారతీయ స్క్రిప్టు ఏది ?

  1. ది ఎలిఫెంట్ విస్పరర్స్
  2. ఆల్ దట్ బ్రీత్స్
  3. ది వ్యాక్సిన్ వార్
  4. కాంతారా
సమాధానం
3. ది వ్యాక్సిన్ వార్

25. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారత ర్యాంకు ?

  1. 110 వ స్థానం
  2. 111 వ స్థానం
  3. 112 వ స్థానం
  4. 113 వ స్థానం
సమాధానం
2. 111 వ స్థానం

26. 2023 సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అందుకున్న హాలీవుడ్ నటుడు ?

  1. టామ్ క్రూజ్
  2. లియోనార్డో డికాప్రియో
  3. మైఖేల్ డగ్లస్‌
  4. విల్ స్మిత్
సమాధానం
3. మైఖేల్ డగ్లస్‌

27. నీలగిరి తహర్ పరిరక్షణ కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రారంభించిన రాష్ట్రం ?

  1. తమిళనాడు
  2. కర్ణాటక
  3. రాజస్థాన్
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
1. తమిళనాడు 

28. ఐఓసీ 141వ సెషన్‌కు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. న్యూయార్క్
  2. బీజింగ్
  3. టోక్యో
  4. ముంబై
సమాధానం
4. ముంబై

29. ఇటీవలే టిలాపియా పార్వోవైరస్ ఏ రాష్ట్రంలో బయటపడింది ?

  1. కేరళ
  2. తమిళనాడు
  3. ఒడిశా
  4. మణిపూర్
సమాధానం
2. తమిళనాడు 

30. నల్లు ఇంద్రసేన రెడ్డి ఇటీవలే ఏ రాష్ట్ర గవర్నరుగా నియమితులయ్యారు ?

  1. మణిపూర్
  2. హర్యానా
  3. త్రిపుర
  4. ఒడిశా
సమాధానం
3. త్రిపుర

Post Comment