An adverb is a word or an expression that modifies a verb, adjective, another adverb, determiner, clause, preposition, or sentence. Adverbs typically express manner, place, time, frequency, degree, level of certainty, etc.
Adjective అనేది Noun, Pronoun ల యొక్క లక్షణాలు చెపితే, Adverb అనేది Verb, Adjective, ఇంకో adverb కి ఉండే లక్షణాలను చెపుతుంది. కాని మూడింటిలో Verb యొక్క లక్షణాన్ని ఎక్కువ వివరిస్తుంది కాబట్టి దీన్ని Adverb అంటారు.
అంటే Adverb అనే ఈ బాషా భాగం, Verb పక్కన చేరడం వలన ఆ క్రియ యొక్క నిర్దిష్ట గుణం లేదా లక్షణం బయటకు వ్యక్తమవుతోంది. సాధారణంగా Adjective చేసే పని క్వాలిఫై చేయడమైతే, Adverb చేసే పనిని మోడిఫై చేయడం అంటారు.
ఉదాహరణకు "చీమ పాకుతుంది" అనే ఒక వాక్యం తీసుకుంటే, ఈ వాక్యంలో పాకుతుంది అనేది సాధారణ క్రియ. ఈ క్రియలో వివరం ఏదీ లేదు. ఈ క్రియకు ఏదో ఒక క్రియ విశేషణం చేర్చడం ద్వారా ఆ క్రియ యొక్క పరిధి పెంచొచ్చు లేదా అర్ధవంతం చేయొచ్చు.
చీమ ఎలా పాకుతుంది..? అనే ప్రశ్న సందిస్తే ..దానికి సమాధానాలు కావాలి. అప్పుడు నెమ్మదిగా పాకుతుంది, వేగంగా పాకుతుంది, లేదా అందంగా పాకుతుంది లేకుంటే కుంటుతూ పాకుతుంది అనేవి సమాదానాలు అవుతాయి. ఇలా అదనంగా చేర్చిన పదాలనే Adverbs అంటారు.
చీమ వేగంగా పాకుతుంది అన్నప్పుడు, 'వేగంగా' అనే మాట చీమకు సంబంధించిన లక్షణమా ? లేదా పాకడానికి సంబంధించిన లక్షణమా ? అంటే Noun లక్షణమా లేదా Verb లక్షణమా ? ఈ సంగతి అర్ధం చేసుకుంటే Adjective , Adverb కి మధ్య తేడా తేలిగ్గా తెలుస్తుంది.
క్రియ గురించి వివరించడం అంటే అది ఎలా జరుగుతుందో వివరించడం ఒక్కటే కాదు, అది ఎప్పుడు (కాలం), ఎక్కడ (స్థలం), ఏ స్థాయిలో (డిగ్రీ), ఎందుకు (కారణం) అలానే జరిగిందో, లేదా జరుగుతోందో లాంటి అన్ని వివరాలు కూడా క్రియను వివరించడం కిందకే వస్తాయి.
క్రియ మీద ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏ స్థాయిలో అనే ప్రశ్నలు వేస్తె, వచ్చే సమాధానాలన్నీ Adverbs అవుతాయి. వీటి రకాలన్నీ చదివితే, ఇంగ్లీష్ భాషలో సగం పదాలు Adverbs అవుతాయనడంలో అతియోశక్తి లేదు.
Examples
She swims (Verb) quickly (adverb) (Here, the adverb "quickly" modifies the verb "swims) |
Geetha is an extremely (adjective) quick (adverb) swimmer (The adverb "extremely" modifies the adjective "quick.") |
She swims extremely (adverb) quickly (adverb) (The adverb "extremely" modifies the adverb "quickly.") |
How Often - Adverbs
Never | Generally | Rarely | Always |
Sometimes | Occasionally | Normally | ever |
Often | Seldom | Frequently | Hardly |
Usually | Wishfully | really | fairly |
How - Adverbs
Secretly | Fast | Well | Quickly |
Badly | Carefully | Easily | Quietly |
Lowly | Slowly | Accidentally | Cheerfully |
Worriedly | Closely | Strongly | Beautifully |
How Much - Adverbs
Fully | Entirely | Too | Extremely |
Enough | Very | Almost | Rather |
Deeply | Completely | Just | A lot |
Many | Much | Nothing | A few |
Where Adverbs
Towards | There | Inside | Here |
Back | Above | Away | Far |
Downstairs | Outside | Abroad | Behind |
Indoor | Nearby | Anywhere | Elsewhere |
When Adverbs
Last year | Today | Soon | Yesterday |
Last month | Tomorrow | Now | Tonight |
Later | Last week | Then | Then |