టోఫెల్ ఎగ్జామ్ 2023 : ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ ఫీజు
Admissions Exams to study abroad

టోఫెల్ ఎగ్జామ్ 2023 : ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ ఫీజు

విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఇంగ్లీష్ దేశాల వైపు చూసే అభ్యర్థులకు అక్కడి యూనివర్సిటీలు, సంస్థలు కొన్ని ప్రాథమిక అర్హుతలు తప్పనిసరి చేసాయి. అందులో ఇంగ్లీష్ భాషకు సంబంధించి పూర్తి నైపుణ్యాలను కలిగివుండటమనేది ప్రధమ నియమం. అందువలన సదురు అభ్యర్థులు తప్పనిసరిగా TOEFL, IELTS వంటి  ఇంగ్లీష్ బాషా పరీక్షలలో అర్హుత సాధించవల్సి ఉంటుంది.

Advertisement
Exam Name TOEFL
Exam Type Proficiency Test
 proficiency In English Language
Exam Date Throughout the year
Exam Duration 3 Hours
Exam Level International Level

టోఫెల్ ప్రధానంగా ఇంగ్లీష్ యూనివర్సిటీల్లో  గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే  విద్యార్థులు యొక్క చదవటం, రాయటం మరియు మాట్లాడటం వంటి ఇంగ్లీష్ బాషా సామర్ధ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించబడుతుంది. పూర్తి ఆంగ్ల మాధ్యమంలో జరిగే అక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ లలో తమ ఇంగ్లీష్ బాషా నైపుణ్యాలతో ఇంగ్లీష్ యితర అభ్యర్థులు  ఎంతవరకు రాణించగలరు అనేది స్పష్టం చేస్తుంది.

టోఫెల్ స్కోరు ను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇంగ్లాండ్ తో పాటుగా ఆసియా మరియు యూరప్ వంటి 190 దేశాల్లో దాదాపు 10 వేలకు పైగా యూనివర్సిటీలు మరియు విద్యసంస్థలు పరిగణలోకి తీసుకుంటాయి. ప్రధానంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  యూనివర్సిటీలలో టోఫెల్ స్కోరుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

5 రకాల టోఫెల్ పరీక్షలు

  1. టోఫెల్ ఐబీటీ టెస్ట్ : ఇది పూర్తిస్థాయి అకడమిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ యొక్క ప్రీమియర్ పరీక్ష. ఇది చదవడం, వినడం, మాట్లాడటం మరియు రాయడం అనే నాలుగు అకడమిక్ ఇంగ్లీషు నైపుణ్యాలను అంచనా వేస్తుంది. విదేశీ విశ్వ విద్యాలయాల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించే వారు ఈ పరీక్షలలో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.
  2. టోఫెల్ ఎస్సెన్షియల్స్ : ఇది పరిమితస్థాయి అకడమిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పరీక్ష. ఇది ప్రాథమిక స్థాయిలో చదవడం, వినడం, మాట్లాడటం మరియు రాయడం అనే నాలుగు అకడమిక్ ఇంగ్లీషు నైపుణ్యాలను అంచనా వేస్తుంది. దీనిని కూడా దాదాపు విదేశీ విశ్వ విద్యాలయాలు ఆమోదిస్తాయి.
  3. టోఫెల్ ప్రైమరీ : ఇది 8+ వయస్సు గల విద్యార్థుల కోసం రూపొందించబడింది. దీనిని విద్యార్థుల ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల ఆంగ్ల బాష పురోగతిని పర్యవేక్షించడానికి నిర్వహిస్తారు.
  4. టోఫెల్ జూనియర్ : ఈ పరీక్షను 11 నుండి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఆంగ్ల భాషా ప్రావీణ్యం కొలిసేందుకు నిర్వహిస్తారు. అలానే విద్యార్థుల ఆంగ్ల బాష పురోగతిని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.
  5. టోఫెల్ ఐటీపీ : ఇది  18+ వయస్సు గల విద్యార్థుల కోసం రూపొందించబడింది. ఇది అకడమిక్ మరియు సోషల్ కంటెంట్‌ని ఉపయోగించి స్థానికేతర ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థుల ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల ఆంగ్ల బాష పురోగతిని పర్యవేక్షించడానికి నిర్వహిస్తారు.

టోఫెల్ పరీక్ష ఎవరికి ఉపయోగం

  • ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే విద్యార్థులకు
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రోగ్రాంలలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసేవారికి
  • స్కాలర్‌షిప్ మరియు బాషా క్వాలిఫై సర్టిఫికెట్లు పొందాలనుకునే వారికి
  • ఇంగ్లీష్ బాషా నైపుణ్యలను పరీక్షించుకునేవారికి
  • విద్య మరియు ఉద్యోగ వీసాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.

టోఫెల్ దరఖాస్తు ప్రక్రియ

టోఫెల్ పరీక్ష ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్( ETS) ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా యేటా 30 లక్షల మంది హాజరయ్యే ఈ బాష ప్రావీణ్య పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాల్లో 4500 కి పైగా పరీక్ష కేంద్రాలలో ఏడాది పొడుగునా (50 సార్లు) నిర్వహించబడుతుంది. టోఫెల్ పరీక్షకు రాసేందుకు ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. రెండు పరీక్షల మధ్య 3 రోజుల వ్యవధిలో ఏడాదిలో ఎన్నిమార్లు అయినా హాజరవ్వొచ్చు. టోఫెల్ అర్హుత స్కోర్ 2 ఏళ్ళు చెల్లుబాటు అవుతుంది

టోఫెల్ కు దరఖాస్తు చేసేముందు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొవాలి. మొదటిది అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ళు నిండి ఉండాలి. రెండవది భారత ప్రభుత్వంచే జారీచేయబడిన పాసుపోర్టు కలిగివుండాలి. ఇక చివరిది మీరు దరఖాస్తు చేయబోయే గ్రాడ్యుయేట్ కాలేజీల లిస్ట్ అందుబాటులో ఉంచుకోవాలి.

భారత విద్యార్థులకు ప్రభుత్వం చే జారీచేయబడే పాసుపోర్టును టోఫెల్ ప్రాథమిక ఐడీ గా నిర్ణహించింసి. ఇది తప్ప మిమ్మల్ని గుర్తించేందుకు ఇంకెటువంటి ఐడీ చెల్లిబాటుకాదు. పరీక్ష సమయంలో మీ ప్రాథమిక ఐడీ లో ఉన్న అంశాలు టోఫెల్ కు దరఖాస్తు చేసిన వివరాలతో సరిపోలితేనే పరీక్షకు అనుమతిస్తారు.

టోఫెల్ కు దరఖాస్తు చేసేముందు www.ets.org/toefl వెబ్‌సైట్ ద్వారా టోఫెల్ అకౌంట్ సృష్టించుకోవాలి. ఒక వేళా మీకు ఇంతక ముందు టోఫెల్ అకౌంట్ ఉంటె యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌ తో లాగిన్ అవ్వొచ్చు. రెండవ దశలో అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మూడవ దశలో సదురు పరీక్ష కేంద్రంలో సమయానుసారం పరీక్ష తేదీని రిజిస్టర్ చేసుకోవాలి.

చివరిగా సంబంధిత దరఖాస్తు రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తిచేయండి. టోఫెల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌ కాకుండా మొబైల్ మరియు మెయిల్ ద్వారా చూసుకునే అవకాశం ఉంది. మొబైల్ ద్వారా దరఖాస్తు చేసేవారికోసం గూగుల్ ప్లే స్టోర్లో టోఫెల్ యాప్ అందుబాటులో ఉంది.

టోఫెల్ పరీక్షకు వారంలో ఏడు రోజులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పరీక్ష తేదికి 7 రోజులు ముందువరకు అందుబాటులో ఉంటుంది. 40 డాల్లర్ల అపరాధ రుసుముతో పరీక్షకు 4 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. భారతీయ అభ్యర్థుల టోఫెల్ దరఖాస్తు రుసుము 180 డాలర్లు  (1300 రూపాయలు)

టోఫెల్ ఎగ్జామ్ నమూనా

టోఫెల్ అర్హుత పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. దాదాపు 3 గంటల నిడివితో సాగే ఈ అర్హుత పరీక్షలో నాలుగు సెక్షన్లలో, ఇంగ్లీష్ భాష చదవటం, వినటం, మాట్లాడటం మరియు రాయటం వంటి 4 అంశాలలో అభ్యర్థుల యొక్క ప్రావీణ్యతను పరిశీలిస్తారు. రెండు సెక్షన్ల మధ్య 10 నిమిషాలు విరామం ఉంటుంది. ఈ నాలుగు అంశాలలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది స్కోరును  ప్రకటిస్తారు.

సెక్షన్ సమయం ప్రశ్నల సంఖ్యా ప్రశ్నల స్వరూపం
Reading 54 -72   నిమిషాలు 30-40 ప్రశ్నలు ఇచ్చిన ప్రకరణలు చదివి ఆపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయాలి.
Listening 41-57 నిమిషాలు 28-39 ప్రశ్నలు ఉపన్యాసాలు లేదా తరగతి చర్చ విని ప్రతిస్పందించాలి
Speaking 17 నిమిషాలు 4 టాస్కులు తెలిసిన, చదివిన, విన్నవిషయాల గురించి అనర్గళంగా  మాట్లాడాలి.
Writing 50 నిమిషాలు 2 టాస్కులు మీరు చదివిన లేదా విన్న అంశాలను వ్యాసరూపంలో రాయాల్సి ఉంటుంది.

టోఫెల్ స్కోరింగ్ విధానం

టోఫెల్ స్కోరింగ్ విధానం వంద శాతం నిష్పక్షపాతంగా ఉంటుంది. మీరు పరీక్ష ఎక్కడ రాసారు, మీకు స్కోరు ఎవరు ఇచ్చారు అనేదాన్ని పక్కన పెడితే టోఫెల్ పరీక్ష కేవలం మీ ఇంగ్లీష్ బాషా సామార్ధ్యాన్ని మాత్రమే అంచనా వేస్తుంది. ETS గుర్తింపు కలిగిన బహుళ టెస్ట్ ఆపరేటర్ల ద్వారా టోఫెల్ పరీక్ష కేంద్రం ఆధారంగా స్కోరు చేయబడుతుంది.

టోఫెల్ స్కోరింగ్ పరిధి ప్రతి సెక్షనకు 0 నుండి 30 వరకు ఉంటుంది. టోఫెల్ పరీక్ష మొత్తం స్కోరు పరిధి 0 నుండి 120 ఉంటుంది. అభ్యర్థి యెంత స్కోరు సాధిస్తే అర్హుత సాధించినట్లు అనేది మీరు దరఖాస్తు చేసుకునే యూనివర్సిటీలు, సంస్థల మీద ఆధారపడి ఉంటుంది. టోఫెల్ పరీక్ష ఏడాదిలో దాదాపు 50 సార్లు జరపబడుతుంది.

అభ్యర్థులు లేదా యూనివర్సిటీల కోరుకునే మెరుగైన స్కోరు కోసం, మూడు రోజుల వ్యవధితో  ఏడాదిలో అనేకసార్లు టోఫెల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఉంది. టోఫెల్ స్కోరు కాలవ్యవధి అర్హుత సాధించిన తేదీ నుండి 2 ఏళ్ళ వరకు చెల్లుబాటు అవుతుంది.

టోఫెల్ పరీక్ష పూర్తియైన 6 రోజుల్లో మీస్కోరు ఆన్‌లైన్‌ లో అందుబాటులో ఉంటుంది. మీ టోఫెల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి మీ స్కోరు ఎప్పుడైనా సులభంగా చూసుకోవచ్చు. అందుబాటులో ఉన్న మీ స్కోరు కార్డును పీడీఎఫ్ ఫార్మెట్లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకున్న 4 యూనివర్సిటీలకు వాటి ప్రవేశ పరీక్ష ముందు రోజు మీ టోఫెల్ స్కోరును అందజేస్తారు.

టోఫెల్ పరీక్ష ప్రణాళిక

విదేశాల్లో ఉన్నత విద్యకోసం ప్లాన్ చేసుకునే విద్యార్థులు వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసుకుంటూ వెళ్ళాలి. మొదటిగా మీరు ఏ దేశంలో ఉన్నత విద్యకోసం ప్రణాళిక చేసున్నారో..ఆ దేశానికి సంబంధించిన విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి వీసా జారీ ప్రక్రియలో అన్ని దేశాలు మొదట అభ్యర్థిలోని ఇంగ్లీష్ ప్రావీణ్యతకు ప్రాధాన్యం ఇస్తాయి.

కావున వీసాకు దరఖాస్తు చేసేముందు విద్యార్థులు ఏదైనా ఒక ఇంగ్లీష్ బాష ప్రావీణ్యత పరీక్ష అర్హుత సాధించి ఉండాలి. దానికంటే ముందు మీరు దరఖాస్తు చేసే ఇనిస్టిట్యూట్లలో ఏ ఇంగ్లీష్ అర్హుత పరీక్ష చెల్లిబాటు అవుతుందో తెల్సుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ప్రణాళిక 6 నెలల ముందు నుండే ప్రారంభించవల్సి ఉంటుంది.

మీ ఉన్నత విద్య ప్రణాళికలో మొదట మీరు ఎంచుకున్న దేశంలో, ఏయే కాలేజీలలో టోఫెల్ స్కోరు చెల్లుబాటు అవుతుందో జాబితా తయారు చేసుకోండి. ఆ కాలేజీకి ప్రవేశ దరఖాస్తు చేసే ఆరు నెలల ముందుగా టోఫెల్ పరీక్షకు మరియు ఆ దేశ విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసుకోండి. టోఫెల్ పరీక్షకు 30 నుండి 40 రోజులు ముందుగా పరీక్ష ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇలా ఆరు నెలల ముందుగా ప్రణాళిక చేయటం వలన మీ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ సమయానికి ఏ గందరగోళం లేకుండా అన్ని అందుబాటులో ఉంటాయి.

Advertisement