సంకల్ప్ వాలంటీర్ ప్రోగ్రాం | అనాథాశ్రమాల్లో స్వచ్ఛంద సేవ
Career Guidance Volunteer Programs

సంకల్ప్ వాలంటీర్ ప్రోగ్రాం | అనాథాశ్రమాల్లో స్వచ్ఛంద సేవ

భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన మరియు బాధ్యతాయుతమైన స్వచ్ఛంద సంస్థల్లో సంకల్ప్ వాలంటీర్ ముందు వరుసలో ఉంటుంది. రాజస్థాన్ ఆధారిత ఈ స్వచ్చంద సంస్థ విదేశీ మరియు దేశీయ విద్యార్థులకు అనాథాశ్రమాల నిర్వహణ, వీధి పిల్లల ఎడ్యుకేషన్ మరియు పిల్లల సంరక్షణ సంబంధిత వాలంటీర్ ప్రోగ్రాంలు అందిస్తుంది.

Advertisement

సంకల్ప్ వాలంటీర్ అందించే ఈ కార్యక్రమాలు వారం రోజుల నిడివితో, ఏడాది పొడుగునా అందుబాటులో ఉంటాయి. విదేశీయులకు ప్రత్యేకంగా సమ్మర్, వింటర్ సీజనల్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. సోలోగా లేదా కుటుంబంతో లేదా బృంధంగా ఈ స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గునే అవకాశం ఉంది. ఒక వారం నిడివితో ఉండే ప్యాకేజీలు 300$ డాలర్ల రుసుముతో ప్రారంభమౌతాయి.

సామాజిక సేవ & ట్రావెలింగ్ అంశాలపై అభిరుచి వుండే వారికీ ఈ వాలంటీర్ ప్రోగ్రామ్స్ జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాలను అందిస్తుంది. ఒక వైపు సామజిక సేవ చేసే అదృష్టంతో పాటుగా మరో వైపు ఇండియాను సందర్శించే గొప్ప అవకాశం ఈ ప్రోగ్రాముల ద్వారా మీకు లభిస్తుంది.

సంకల్ప్ వాలంటీర్ ప్రోగ్రాం రుసుములు వారానికి గరిష్టంగా 300 $ డాలర్ల నుండి ప్రారంభం అవుతాయి. ఈ రుసుములతో విమానాశ్రయం పికప్ నుండి వసతి, భోజనం వరకు అన్ని రకాల సేవలు కల్పిస్తారు. ప్రోగ్రాం పూర్తియ్యాక వాలంటీర్ సర్టిఫికెట్ అందిస్తారు.

స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడం వలన, మీ సాధారణ పర్యటన వైవిధ్య భరితమవుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని స్థానిక సమాజలతో భాగస్వామ్యం చేస్తుంది, కొత్త సంస్కృతులను ప్రామాణికమైన రీతిలో అనుభవించే అవకాశం లభిస్తుంది.

ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇది ఉత్తమమైన మార్గం. మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి, జీవితకాల స్నేహాలను పెంచుకోవడానికి మరియు మీ అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ క్లిష్ట సమయంలో నిజమైన ప్రభావం చూపాలనుకుంటే ఈ అనుభూతిని తప్పక ఆస్వాదించాల్సిందే.

Advertisement

Post Comment