Daily Current Affairs Quiz: 20 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 20 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(20 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. గూగుల్ ఇండియాకు నూతన కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. సంజయ్ గుప్తా
  2. ప్రీతి లోబానా
  3. రోమా దత్త
  4. సుందరి పిచాయ్
సమాధానం
2. ప్రీతి లోబానా

2. ఒడిశా మాస్టర్స్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు?

  1. కాయ్ యాన్ యన్
  2. పీవీ సింధు
  3. అన్మోల్ ఖర్బ్
  4. సైనా నెహ్వాల్
సమాధానం
1. కాయ్ యాన్ యన్

3. 2023, నవంబర్‌తో పోలిస్తే 2024, నవంబర్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు ఎంత పెరిగాయి?

  1. 32.47 %
  2. 95.18 %
  3. 41.75 %
  4. 54.72 %
సమాధానం
4. 54.72 %

4. జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నవారు?

  1. హర్మన్ ప్రీత్ కౌర్
  2. హీనా సిద్ధు
  3. రియా శిరీష్ తట్టే
  4. రహి సర్నోబాట్
సమాధానం
3. రియా శిరీష్ తట్టే

5. 'కౌన్ దేశ్ కో వాసి వేణుకి' డైరీకి 84వ వ్యాస్ సమ్మాన్ 2024ని పొందినవారు?

  1. సూర్యబాల
  2. చిత్రాముద్గల్
  3. కృష్ణ సోబ్టీ
  4. నజిరా శర్మ
సమాధానం
1. సూర్యబాల

6. గత డిసెంబర్ 17న శ్రీలంక పార్లమెంట్ నూతన స్పీకర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. హరిణి అమరసూరియ
  2. రిజ్వీ సలిహ్
  3. జగత్ విక్రమరత్నే
  4. అశోక సప్‌మల్ రన్‌వాలా
సమాధానం
3. జగత్ విక్రమరత్నే

7. ఆర్‌బీఎల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మళ్లీ ఎవరు నియమితులయ్యారు?

  1. ప్రశాంత్ కుమార్
  2. అమితాబ్
  3. సందీప్ భక్షి
  4. ఆర్ సుబ్రమణ్య కుమార్
సమాధానం
4. ఆర్ సుబ్రమణ్య కుమార్

8. వడోదరలోని గతిశక్తి విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని దేనితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?

  1. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
  2. ఇండియన్ నేవీ
  3. డీఆర్‌డీవో
  4. ఇండియన్ ఆర్మీ
సమాధానం
2. ఇండియన్ నేవీ

9. నిర్దేశక్ అనే సర్వనౌకను ఏ షిప్‌యార్డ్‌ నిర్మించింది?

  1. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్
  2. గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్
  3. కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్
  4. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజినీర్స్
సమాధానం
4. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజినీర్స్

10. మధ్యప్రదేశ్ నిర్వహించిన 105 అంతర్జాతీయ ఆటలోని ప్రదర్శన థీమ్?

  1. ఉమెన్ ఎంపవర్‌మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్
  2. హెల్త్ ప్రొటెక్షన్ ఫ్రం మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్
  3. ఫారెస్ట్ బయోలాజికల్ డైవర్సిటీ
  4. సస్టెయినబుల్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్
సమాధానం
1. ఉమెన్ ఎంపవర్‌మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్

11. గుజరాత్‌లో మొదటి అవుట్‌సోర్స్‌డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ప్లాంట్‌ను ఎక్కడ ప్రారంభించారు?

  1. వడోదర
  2. అహ్మదాబాద్
  3. సూరత్
  4. రాజ్‌కోట్
సమాధానం
3. సూరత్

12. ఈ-ఎన్‌డబ్ల్యూఆర్‌ల ద్వారా రైతులకు క్రెడిట్ మదింపును సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం?

  1. ఫార్మర్ ఎంపవర్‌మెంట్ స్కీం
  2. క్రెడిట్ గ్యారంటీ స్కీం
  3. ఈ-కిసాన్ క్రెడిట్ స్కీం
  4. వేర్‌హౌస్ లోన్ గ్యారంటీ స్కీం
సమాధానం
2. క్రెడిట్ గ్యారంటీ స్కీం

13. దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత శాతం పెరిగాయి?

  1. 10 శాతం
  2. 16.5 శాతం
  3. 15 శాతం
  4. 16 శాతం
సమాధానం
2. 16.5 శాతం

14. ఏ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను కోల్‌కతాలో ప్రారంభించింది?

  1. ఇన్ఫోసిస్
  2. మైక్రోసాఫ్ట్
  3. టీసీఎస్
  4. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
సమాధానం
1. ఇన్ఫోసిస్

15. పారిశ్రామికవేత్తల అగ్రహురున్ జాబితాలో ఎవరు ఉన్నారు?

  1. రాధాకృష్ణన్ దామని
  2. నందన్ రెడ్డి
  3. దీపెందర్ గోయల్
  4. శ్రీహర్ష మాజేటి
సమాధానం
1. రాధాకృష్ణన్ దామని

16. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించేందుకు సిద్ధమైంది. యూసీసీ బిల్లు 2024ను రాష్ట్ర శాసనసభ ఎప్పుడు ఆమోదించింది?

  1. 2024, ఫిబ్రవరి
  2. 2024, ఏప్రిల్
  3. 2024, మే
  4. 2024, మార్చి
సమాధానం
1. 2024, ఫిబ్రవరి

17. ఏ రాష్ట్రంలో గంగానది డాల్ఫిన్ మొదటి ఉపగ్రహ ట్యాగింగ్ ప్రారంభంతో దేశం చరిత్రాత్మక మైలురాయిని సాధించింది?

  1. త్రిపుర
  2. అసోం
  3. మణిపూర్
  4. మేఘాలయ
సమాధానం
2. అసోం

18. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో దేశం పురోగతి సాధించింది. 2019 నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో 23వ స్థానం నుంచి ఏ స్థానానికి చేరుకుంది?

  1. 1
  2. 2
  3. 3
  4. 4
సమాధానం
3. 3

19. లాజిస్టిక్స్ సంబంధిత విద్య, పరిశోధన, శిక్షణ కోసం భారత నౌకాదళంతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

  1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  2. గతి శక్తి విశ్వవిద్యాలయం
  3. నేషనల్ డిఫెన్స్ అకాడమీ
  4. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ
సమాధానం
2. గతి శక్తి విశ్వవిద్యాలయం

20. దేశంలో 150 గమ్యస్థానాలకు అనుసంధానం చేసిన మొదటి విమానాశ్రయం ఏది ?

  1. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
  2. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
  3. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు
  4. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఢిల్లీ
సమాధానం
4. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఢిల్లీ

21. 2024, నవంబర్ డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఎంత?

  1. 1.89 శాతం
  2. 2.10 శాతం
  3. 2.40 శాతం
  4. 1.29 శాతం
సమాధానం
1. 1.89 శాతం

22. 2024, డిసెంబర్ నాటికి నమస్తే పథకం కింద ఎంత మంది సెప్టిక్ ట్యాంక్ కార్మికులను గుర్తించారు?

  1. 24,574
  2. 57,758
  3. 2,13,604
  4. 441,800
సమాధానం
2. 57,758

23. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గ్రామీణ పేదల కోసం ప్రారంభించిన గృహ నిర్మాణ పథకం పేరు?

  1. బంగ్లర్ బారి
  2. సుభ్ గృహ యోజన
  3. గ్రామీణ ఆవాస్ యోజన
  4. పక్కా ఘర్ స్కీమ్
సమాధానం
1. బంగ్లర్ బారి

24. ఇండియన్ నేవీ నిర్వహించిన 2024 అడ్మిరల్ కప్‌ను ఏ దేశం గెలుచుకుంది?

  1. ఇటలీ
  2. రష్యా
  3. జపాన్
  4. సింగపూర్
సమాధానం
2. రష్యా

25. తాన్‌సేన్ సంగీత ఉత్సవం ఏటా డిసెంబర్ లో ఏ నగరంలో జరుపుకొంటారు?

  1. ఉజ్జయిని
  2. భోపాల్
  3. గ్వాలియర్
  4. రెవా
సమాధానం
3. గ్వాలియర్

26. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన మొక్క ‘జింపీ-జింపీ' ఏ దేశానికి చెందింది?

  1. న్యూజిలాండ్
  2. రష్యా
  3. మెక్సికో
  4. ఆస్ట్రేలియా
సమాధానం
4. ఆస్ట్రేలియా

27. 2025 లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది?

  1. ఉత్తరాఖండ్
  2. హిమాచల్ ప్రదేశ్
  3. రాజస్థాన్
  4. ఒడిశా
సమాధానం
1. ఉత్తరాఖండ్

28. 2024, డిసెంబర్‌లో ఐఎస్ఏ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేయడంతో అంతర్జాతీయ సౌర కూటమిలో ఏ దేశం చేరింది?

  1. రష్యా
  2. మాల్డోవా
  3. కెన్యా
  4. ఉక్రెయిన్
సమాధానం
2. మాల్డోవా

29. ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత జోధయ్య బాయి ఏ భారతీయ గిరిజన సమాజానికి చెందినవారు?

  1. సంతాల్
  2. బిల్
  3. గోండు
  4. బైగ
సమాధానం
4. బైగ

30. తన తెలుగు విమర్శ అయిన 'దీపిక'కు 2024 సాహిత్య అకాడమీ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?

  1. పెనుగొండ లక్ష్మీనారాయణ
  2. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి
  3. అందె శ్రీ
  4. కమ్మగాని మొగిలయ్య గౌడ్
సమాధానం
1. పెనుగొండ లక్ష్మీనారాయణ

Post Comment