12 Spelling Rules in English with Examples | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English

12 Spelling Rules in English with Examples | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్

ఒక మాట రాసేందుకు ఏ అక్షరాలు అవసరమో, ఆ అక్షరాల కూర్పే ఆ మాటకు స్పెల్లింగ్ అవుతుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ వ్యవహారం పెద్ద తలపోటుతో కూడుకున్నది. ఈ తలపోటు పరాయి భాష వాళ్ళకే కాదు, ఇంగ్లీష్ మాతృబాష అయిన వారికి కూడా ఉంటుంది. తెలుగు భాషతో పోల్చుకుంటే ఇంగ్లీష్ పద నిర్మాణంలో చాలా పెద్ద తేడాలున్నాయి.

Advertisement

తెలుగులో ఒక అచ్చు అక్షరం, విడిగా ఉన్నప్పుడు ఏ శబ్దంతో పలుకుతుందో, హల్లుతో చేరినప్పుడు కూడా అదే శబ్దంతో పలుకుతుంది. ఉదా: "ఇ" అనే తెలుగు అచ్చు, విడిగా ఉన్నప్పుడు 'ఇ' శబ్దం ఇచ్చినట్లే, 'క్' తో కలిసి 'కి' అయినప్పుడు కూడా 'ఇ' శబ్దాన్నే ఇస్తుంది.

ఇంగ్లీషులో ఒక అచ్చు అక్షరం విడిగా ఉన్నప్పుడు ఏ శబ్దం ఇస్తుందో, హల్లుతో కలిసినప్పుడు అదే శబ్దంతో ఉండదు. ఉదా : E అనే ఇంగ్లీష్ అచ్చు విడిగా ఉండేటప్పుడు "ఇ" అనే శబ్దంతో ఉంటుంది. ఇది ఒక హల్లుతో కలిసినప్పుడు "ఎ" గా పలుకుతుంది (E + K = Ke). ఇక్కడ K తో E తో కలిసి "కి" శబ్దం వస్తుంది అని అనుకుంటాం. కాని అది 'కె' గా పలుకుతుంది. అలానే k(కె) తో i (ఐ) కలిసి 'కై' అవ్వాలి కాని అది 'కి' గా పలుకుతుంది.

ఈ అక్షర శబ్దాల గోల కొంచెంపు పక్కన పెడితే, ఇంగ్లీష్ అక్షర నిర్మాణంలో ఇంకో పెద్ద తలనొప్పి ఉంది. తెలుగు అక్షరాలు తెలిస్తే తెలుగు మాటలు రాసే విధంగా, ఆల్ఫాబెట్ తెలిస్తే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రాయలేము. ఇక్కడ అక్షరాలతో పాటుగా, ప్రతి మాట యొక్క స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇంగ్లీష్ స్పెల్లింగుల్లో, ఒక ప్రధాన నియమం ఉంటూనే, అసలు ఏ నియమమూ లేదు అనిపించేటంతా గందరగోళం కూడా వుంది. తెలుగులో పిల్లిని ''పిల్లిగా" రాసేటప్పుడు ఏ సందేహం కలగదు కాని, ఇంగ్లీషులో రాసేటప్పుడు ఈ అనుమానం కలుగుతుంది. 'Cat' క్యాట్ అయినప్పుడు 'Kat' క్యాట్ ఎందుకు కాకూడదు ..! అనే అనుమానం స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రారంభంలో చాలా మందిలో కలుగుతుంది.

ఒక భాషను రాయడంలో అన్ని స్పెల్లింగులూ ఒకే రకమైన నియమం మీద ఆధారపడి ఉండటమే తేలికైన పద్దతి. ఈ నియమం తెలుగులో ఉంది కానీ ఇంగ్లీషులో లేదు. ఏదైనా తరుసుగా ఉపయోగించని ఇంగ్లీష్ పదం యొక్క స్పెల్లింగును సొంత ఊహతో రాసే అవకాశం ఈ భాషలో ఉండదు.

అలాంటి సందర్భాలలో మనుకున్న ఏకైక దిక్కు డిక్షనరీని ఆశ్రయించడం. ఒక భాషని నేర్చుకునేటప్పుడు దాని పద్దతులను, నియమాలను పాటించడం మినహా, అంతకంటే చేసేదేమి ఉండదు. కనుక ఇంగ్లీషు స్పెల్లింగులో రాసే సమయంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఇప్పుడు చూద్దాం.

12 ఇంగ్లీష్ స్పెల్లింగ్ నియమాలు

  1. ప్రతి ఇంగ్లీషు పదంలో తప్పనిసరి ఒక Vowel అక్షరం ఉంటుంది.
  2. ప్రతీ Syllable కూడా ఒక Vowel అక్షరం కలిగి ఉంటుంది.
  3. Q తో ప్రారంభమయ్యే అన్ని పదాలలో రెండవ అక్షరం U అయ్యి ఉంటుంది. (Ex : queen, earthquake, equity).
  4. ఒక పదంలో X అక్షరం తర్వాత ఎప్పుడూ S అక్షరం ఉండదు. ( Ex : Excite , Excise)
  5. షార్ట్ vowel శబ్దం కలిగిఉండే పదాలు, ఒక vowel అక్షరాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. (Ex : at, it, hot, red, up).
  6. ఒక syllable ఉండే పదాలలో చివరి అక్షరం "F/ L/ S" ఉంటె, సదురు అక్షరాలకు అదనంగా అవే అక్షరాలు కలిపి, ద్వంద అక్షరాలుగా రాయాల్సి ఉంటుంది. (Ex : stiff stall)
  7. E' చివరి అక్షరంతో ఉండే పదాలు, ఏదైనా Suffix పదంతో కలిసేటప్పుడు, ఆ పదంలోని చివరి 'E' అక్షరం తొలగించి మిగతా స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. (Ex : Come + ing = Coming, Race + ing = Racing )
  8. "All" అనే Prefix పదం ఇంకో పదంతో కలిసే సందర్భంలో 'All' లోని రెండవ "L" తొలగించి మిగతా స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. (Ex : All + Time = Altime, All + Most = Almost, All + Ready = Already)
  9. సాధారణంగా ఏదైనా పదానికి Prefix పదం కలిపేటప్పుడు..ఆ స్పెల్లింగులో దాదాపు ఎటువంటి మార్పూ ఉండదు. (Ex : de + activate= deactive, non + fiction = nonfiction)
  10. Vowel అక్షరంతో ముగిసే పదాలు, "ed, ing " వంటి Suffix పదాలతో కలిసే సందర్భంలో Suffix మరియు పదానికి మధ్య "Y" అక్షరం చేర్చి స్పెల్లింగ్ పూర్తిచేయాలి. (Ex : Jocke + ing= Jockeying, journeying)
  11. Pronouns రాసేటప్పుడు మొదటి అక్షరం క్యాపిటల్ అక్షరంతో రాయాలి.
  12. "J మరియు V" చివరి అక్షరంగా ఇంగ్లీషులో దాదాపు ఎటువంటి పదాలు ఉండవు.

Prefixes and Suffixes

ఇంగ్లీష్ పద నిర్మాణంలో Prefixes and Suffixes పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఇంగ్లీషులో చాలామట్టుకు పదాలు రెండు లేదా మూడు మాటల లేదా పదాల కలయిక వలన ఏర్పడతాయి. ఇందులో ఒకటి ప్రధాన పదంగా (Base/Root Word) ఉండగా, మిగతా పదం Prefix లేదా Suffix గా ఉంటుంది.

Root పదానికి ముందు వైపు వచ్చి చేరే పదాన్ని Prefix అంటారు. అలానే వెనక పైపు వచ్చి చేరే పదాన్ని Suffix అంటారు. ఈ Suffix మరియు Prefix ఒక నిర్దిష్ట అర్దాన్ని కలిగివుండి, వాటితో కలిసే పదాలకు ఇదే అర్దాన్ని ఆపాదిస్తాయి.

Prefix Words & Examples

Root word కు ముందు వచ్చి చేరే పదాన్ని లేదా పద సముదాయాన్ని Prefix Words అంటారు. ఉదాహరణకు "IM" అనే prefix పదాన్ని తీసుకుందాం. "im" అంటే సాధారణంగా Not, without అనే అర్ధం వస్తుంది. ఇప్పుడు ఈ పదాన్ని ప్రధాన బేస్ వర్డ్ possible లేదా proper కి కలిపినప్పుడు అవి impossible మరియు improper గా మారుతాయి.

ఇక్కడ గమనించారా, ఇంతవరకు 'సాధ్యం" అనే అర్దాన్ని ఇచ్చే possible అనే రూట్ వర్డ్, Im అనే prefix చేరడంతో అసాధ్యంగా (impossible) మార్పుచెందింది. మరిన్ని ఉదాహరణలు చూద్దాం.

Prefix Meaning Examples
- de from, down, away, reverse, opposite decode, decrease
- dis not, opposite, reverse, away disagree, disappear
- ex out of, away from, lacking, former exhale, explosion
- il not illegal, illogical
- im not, without impossible, improper
- in not, without inaction, invisible
- miss bad, wrong mislead, misplace
- non not nonfiction, nonsense
- pre before prefix, prehistory
- pro for, forward, before proactive, profess, program
- re again, back react, reappear
- un against, not, opposite undo, unequal, unusual

Suffix Words & Examples

Root word కు వెనుక వచ్చి చేరే పదాన్ని లేదా పద సముదాయాన్ని Suffix Words అంటారు. ఉదాహరణకు "Less" అనే Suffix పదాన్ని తీసుకుందాం. "Less" అంటే సాధారణంగా without అనే అర్ధం వస్తుంది. ఇప్పుడు ఈ పదాన్ని ప్రధాన బేస్ వర్డ్ flavor కి కలిపినప్పుడు అది flavorless గా మారుతుంది.

Prefix Meaning Examples
-able able to, having the quality of comfortable, portable
-al relating to annual comical
-er comparative bigger, stronger
-est superlative strongest, tiniest strongest, tiniest
-ful full of beautiful, grateful
-ible forming an adjective reversible, terrible
-ily forming an adverb eerily, happily, lazily
-ing denoting an action, a material, or a gerund  acting, showing
-less without, not affected by  friendless, tireless
-ly forming an adjectivey clearly, hourl clearly, hourl
-ness denoting a state or condition kindness, wilderness
-y full of, denoting a condition, or a diminutive glory, messy, victory

ఇంగ్లీషులో స్పెల్లింగ్స్ నేర్చుకోవడం ఎప్పటికి కొలిక్కిరాని పని. ఇంగ్లీషులో ఎంత ఉద్దండ పండితులైన స్పెల్లింగ్స్ విషయానికి వచ్చేసరికి, వాళ్ళు కూడా ఏదో సందర్భంలో తికమక పడుతుంటారు.

కొన్నిసార్లు ఈ నియమాలన్ని గుర్తిపెట్టుకునే బదులు, మాట్లాడేందుకు అవసరమయ్యే కొన్ని మాటలను నేర్చుకోవడం ఉత్తమం అనే భావన కలుగుతుంటుంది. ఏదిఏమైనా నిరంతర అభ్యాసన మరియు పదాలను గుర్తుపెట్టుకోవడం ఒక్కటే దీనికి పరిస్కారం చూపిస్తుంది.

Advertisement

Post Comment