టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ 2023 | రిజిస్ట్రేషన్ తేదీలు
Latest Jobs TSPSC

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ 2023 | రిజిస్ట్రేషన్ తేదీలు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రకటన ద్వారా ఒక్క ఆర్థిక శాఖలోనే దాదాపు 712 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుండి ఫిబ్రవరి 23 మధ్య చేపట్టనున్నట్లు వెల్లడించింది.

Advertisement

టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూపు III పోస్టుల నియామక ప్రక్రియ రాతపరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా నిర్వహిస్తారు. రాతపరీక్ష మూడు పాపేర్లుగా 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హుత పొందివారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి వివిధ రిజర్వేషన్ల వారీగా తుది నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. దరఖాస్తు  ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు అయితే రాతపరీక్షకు ముందు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

టీఎస్పీఎస్సీ గ్రూపు 3 ఖాళీలు

ఖాళీ పోస్టులను కమ్యూనిటీ వారీగా, వివిధ కోటాల వారీగా మరియు మల్టీ జోనల్ వారీగా భర్తీ చేస్తారు.

మైనార్టీస్ వెల్ఫేర్ - 6 పోస్టులు ఎస్సీ డెవలప్మెంట్ - 36 పోస్టులు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ - 18 ఖాళీలు సెకండరీ ఎడ్యుకేషన్ - 56 పోస్టులు
పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ - 29 ఖాళీలు రోడ్డు & బిల్డింగ్ - 12 పోస్టులు
ప్లానింగ్ - 03 ఖాళీలు ట్రైబల్ వెల్ఫేర్ - 28 పోస్టులు
రెవెన్యూ శాఖ - 73 ఖాళీలు ఉమెన్, చైల్డ్ డెవలప్మెంట్ - 3 పోస్టులు
అగ్రికల్చర్ కో ఆపరేటివ్ - 27 ఖాళీలు టూరిజం డెవలప్మెంట్ - 05 పోస్టులు
యానిమల్ హుస్బెండరీ, డైరీ, ఫిషెరీ డెవలప్మెంట్ - 2 పోస్టులు హయ్యర్ ఎడ్యుకేషన్ - 89 ఖాళీలు
బీసీ వెల్ఫేర్ - 27 పోస్టులు హోమ్ శాఖ - 70 ఖాళీలు
ఎనర్జీ - 02 పోస్టులు ఇండస్ట్రీస్ & కామర్స్ - 25 ఖాళీలు
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ & టెక్నాలజీ - 7 పోస్టులు ఏరియా డెవలప్మెంట్ - 01 పోస్టు
ఫైనాన్స్ - 712 పోస్టులు లేబర్ & ఎంప్లాయిమెంట్ - 33 ఖాళీలు
ఫుడ్ & సివిల్ సప్లయిస్ - 16 పోస్టులు ఫామిలీ & హెల్త్ - 39 పోస్టులు
జనరల్ అడ్మినిస్ట్రేషన్ - 46 పోస్టులు  మొత్తం ఖాళీలు - 1,365

టీఎస్పీఎస్సీ గ్రూపు 3 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • డిస్టెన్స్ మరియు ఓపెన్ డిగ్రీ పూర్తిచేసిన వారు యూజీసీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 44ఏళ్ళ మధ్య ఉండాలి. కమ్యూనిటీ కోటా పరిధిలో వయోపరిమితి సడలింపు ఉంటుంది.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 24 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 23 ఫిబ్రవరి 2023
హాల్ టికెట్ ఆగష్టు 2023
ఎగ్జామ్ తేదీ  ఆగష్టు 2023
ఫలితాలు అక్టోబర్ 2023

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో అందుబాటులో ఉంటుంది. పరీక్ష రుసుము చెల్లించిన దరఖాస్తులు మాత్రమే పరిగణంలోకి తీసుకోబడతాయి.

ఫీజు జనరల్ అభ్యర్థులు నిరుద్యోగులు
అప్లికేషన్ ఫీజు 200/- 200/-
ఎగ్జామ్ ఫీజు 120/- మినహాయింపు

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 దరఖాస్తు విధానం

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఓటీపీఆర్ ఐడీ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడీ లేని వారు కొత్తగా ఓటిపీఆర్ ఐడీ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ మరియు ఇతర సంబంధిత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

టీఎస్పీఎస్సీ పోర్టల్ యందు ఉన్న గ్రూప్ 3 లింక్ ఉపయోగించించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. మొదటిగా ఓటిపిఆర్ మరియు పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చగానే అభ్యర్థుల డేటా లోడ్ అవుతుంది.

అందులో ఇదివరకే మీరు పొందుపర్చిన వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు మరోమారు సరిచూసుకుని, అవసరమయ్యే ఇతర అవసరాలను అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో  దరఖాస్తు చేస్తున్న పోస్టు మరియు ఎగ్జామ్ సెంటర్ వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తివుతుంది.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ సెంటర్లు

  • హైదరాబాద్
  • కరీంనగర్
  • ఖమ్మం
  • హనుమకొండ
  • నిజామాబాద్

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ నమూనా

టీఎస్‌పీఎస్సీ గ్రూపు III పోస్టుల నియామక ప్రక్రియ రాతపరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా నిర్వహిస్తారు. రాతపరీక్ష 450 మార్కులకు 3 పేపర్లుగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్దతిలో నిర్వహించనున్నారు.  ప్రతి పేపర్ 150 ప్రశ్నలతో, 2.30 గంటల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఒక్కో పేపర్ కోసం వివరంగా తెలుసుకుందాం.

జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ (పేపర్ పేపర్ I)

పేపర్ I లో భాగంగా 150 మార్కులకు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సంబందించిన అంశాలతో నిర్వహస్తారు. ప్రశ్న పత్రం మూడు సెక్షన్లుగా, ఒక్కో సెక్షన్ యందు 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

హిస్టరీ, పాలిటి & సొసైటీ ( పేపర్ II )

పేపర్ II హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ అంశంలో కూడిన ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఆవిర్భావం, భారత రాజ్యాంగం & రాజకీయ వ్యవస్థ మరియు ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ & పబ్లిక్ పాలసీ అంశాల నుండి ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
తెలంగాణ హిస్టరీ, పాలిటి & సోసిటీ స్ట్రక్చర్ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

ఇండియన్ ఎకానమీ & డెవలప్మెంట్ ( పేపర్ III )

పేపర్ III భారతీయ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి సంబంధిత అంశంలో కూడిన ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో భారతీయ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు మరియు సవాళ్లు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి మరియు మార్పు సమస్యలు వంటి సంబంధిత అంశాల నుండి ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
భారతీయ & తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

సర్టిఫికెట్ వెరిఫికేషన్

రాతపరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగా, వివిధ సమీకరణలు పరిగణలోకి తీసుకుని తుది ఎంపికను పూర్తిచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేట్ పూర్తిచేసి నియామక పత్రాలు జారీ చేస్తారు.

కేటగిరి & రిజర్వేషన్ కేటగిరి & రిజర్వేషన్ 
బీసీ - 29%
ఎస్సీ - 15%
ఎస్టీ - 7%
EWS - 10%
Sports - 2%
PH - 4%.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 క్వాలిఫైయింగ్ మార్కులు

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, మాజీ సైనికులు - 40% మార్కులు తప్పనిసరి.
  • బీసీ అభ్యర్థులు లకు 35 శాతం మార్కులు తప్పనిసరి.
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎంపిక ప్రక్రియ

టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 నియామక ప్రక్రియ రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారితంగా ఉంటుంది. రాతపరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులను పోస్టుల ఖాళీల వారీగా, జోన్ల వారీగా, కమ్యూనిటీ వారీగా, ఇతర రిజర్వేషన్ కోటాల వారీగా షార్ట్ లిస్టు రూపొందిస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి తుది ఎంపిక చేపడతారు.

Advertisement

Post Comment