ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ 2023-24 వెలువడింది. ప్రభుత్వరంగ బ్యాంకులలో మొత్తం 710 ప్రత్యేక క్యాడర్ అధికారుల పోస్టుల నియామకం కోసం దరఖాస్తు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 21 నవంబర్ 2022 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టు సంబంధిత స్పెషలైజెడ్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది, 20 నుండి 30 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. నియామక ప్రక్రియ రాతపరీక్ష, ప్రొఫిషనల్ నాలెడ్జ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి మరిన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
నోటిఫికేషన్ నెంబర్ | CRP SPL-XII |
పోస్టుల సంఖ్యా | 710 |
నోటిఫికేషన్ తేదీ | 31/10/2022 |
దరఖాస్తు తుది గడువు | 21/11/2022 |
ఎగ్జామ్ ఫీజు | 850/- |
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మినహా ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు సంబంధించి ప్రత్యేక విధులు నిర్వహించే అనలిస్టులు, లా ఆఫీసర్లు, ఎకానమిస్టులు, రిస్క్ అనలిస్టులు, సెక్యూరిటీ అధికారులు, సిస్టం అధికారులు, చార్టడ్ అకౌంటెంట్ల నియామకం కోసం ఈ నియామక పరీక్ష నిర్వహిస్తారు.
అలానే వివిధ ఇంజినీర్లు, స్టాటిస్టిషియన్స్, బాష అధికారులు, ఫైర్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు వంటి సిబ్బంది నియామకాల కోసం కూడా ఈ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు. వివిధ బ్యాంకులలో ఉండే ఖాళీలు ఆధారంగా ఏడాది పొడుగునా జరిగే ఈ స్పెషలిస్ట్ అధికారుల నియామక ప్రక్రియ పూర్తి వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం.
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 2023
-
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంటులో పాల్గునే బ్యాంకులు
-
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షకు ఎవరు అర్హులు
-
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ షెడ్యూల్ 2022
-
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ దరఖాస్తు ఫీజు
-
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ దరఖాస్తు ప్రక్రియ
-
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్ష నమూనా
-
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నియామక ప్రక్రియ
రిక్రూట్మెంట్ యందు పాల్గునే బ్యాంకులు
బ్యాంకు ఆఫ్ బరోడా | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు |
బ్యాంకు ఆఫ్ ఇండియా | పంజాబ్ నేషనల్ బ్యాంకు |
బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర | పంజాబ్ & సింధ్ బ్యాంకు |
కెనరా బ్యాంకు | యూకో బ్యాంకు |
సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా | యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా |
ఇండియన్ బ్యాంకు - NA | - |
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ ఎలిజిబిలిటీ
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ నియామకాలు అవసరానికి అనుగుణంగా ఏడాది పొడుగునా ఐబిపిఎస్ భర్తీ చేస్తుంది. ప్రకటనలో ఉండే పోస్టు, గ్రేడును అనుచరించి విద్య అర్హుత, వయసు మరియు అనుభవం సరిపోయే భారతీయ పౌరులు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హుత నియమాలు ప్రతి పోస్టుకు మారుతూ ఉంటాయి. చాలా పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేపడతారు. ఫైర్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, మరి కొన్ని సీనియర్ ఆఫీసర్స్ మరియు తక్కువ దరఖాస్తులు వచ్చిన పోస్టులను వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు వారీగా ఖాళీలు | |||
---|---|---|---|
పోస్టు | పోస్టుల ఖాళీలు | ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ | |
ఐటీ ఆఫీసర్స్ (స్కేల్ 1) | 44 | ఇంజినీరింగ్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేషన్ గ్రూపులు | |
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ 1) | 516 | అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు | |
రాజ్ బాషా అధికారి (స్కేల్ 1) | 25 | హిందీ, సంస్కృతీ, హిందీ భాషల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ | |
లా ఆఫీసర్ (స్కేల్ 1) | 10 | లా గ్రాడ్యుకేషన్ (బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని ఉండాలి) | |
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ 1) | 15 | ఎంబీఏ హెచ్ఆర్ సంబంధిత కోర్సులు | |
మార్కెటింగ్ ఆఫీసర్ | 100 | మార్కెటింగ్ మానేజ్మెంట్ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ |
స్పెషలిస్టు ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2023 షెడ్యూల్
ప్రిలిమ్స్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 1 నవంబర్ 2022 |
దరఖాస్తు తుది గడువు | 21 నవంబర్ 2022 |
కాల్ లెటర్ డౌన్‌లోడ్ | డిసెంబర్ 2022 |
ప్రిలిమినరీ పరీక్ష | 24/31 డిసెంబర్ 2022 |
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు | జనవరి 2023 |
మెయిన్స్ షెడ్యూల్
మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ | జనవరి 2023 |
మెయిన్స్ పరీక్ష | 29 జనవరి 2023 |
మెయిన్స్ పరీక్ష ఫలితాలు | ఫిబ్రవరి 2023 |
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ | ఫిబ్రవరి 2023 |
ఇంటర్వ్యూ ఫలితాలు | మార్చి 2023 |
ప్రోవిషనల్ అల్లొట్మెంట్ | ఏప్రిల్ 2023 |
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ దరఖాస్తు ఫీజు
కేటగిరి | ధరఖాస్తు ఫీజు ( ఇంటిమేషన్ చార్జీ) | |
1 | ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ట్రాన్స్ జండర్ | 175/- (కేవలం ఇంటిమేషన్ చార్జీ ) |
2 | జనరల్ మరియు ఓబీసీ | 850/- (ధరఖాస్తు రుసుము+ఇంటిమేషన్ చార్జీ) |
స్పెషలిస్టు ఆఫీసర్ దరఖాస్తు విధానం
సంబంధిత రంగంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ యందు పొందిపర్చిన విదంగా ఐబీపీఎస్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోవాలి.
అభ్యర్థి పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే సర్టిఫికేట్లు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి.
దరఖాస్తులో వ్యక్తిగత, విద్య మరియు చిరునామా వివరాలు పొదుపర్చాక, అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ ఎగ్జామ్ నమూనా
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో రెండు దశలలో నిర్వహించబడుతుంది. ఫేజ్ I లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్/హిందీ), కొన్ని పోస్టులకు టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా పరిశీలిస్తారు.
ఫేజ్ I కు సంబంధించి అన్ని టెస్టులలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఫేజ్ II కు ఆహ్వానిస్తారు. ఫేజ్ II లో పోస్టుకు సంబంధించిన ప్రొఫిషినల్ నౌలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన వారికీ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్ నమూనా
లా ఆఫీసర్ మరియు రాజ్ బాషా అధికారి పోస్టులు | |||
సబ్జెక్టు | ప్రశ్నలు / మార్కులు | మీడియం | సమయం |
---|---|---|---|
ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 50/25 | ఇంగ్లీష్ | 40 నిముషాలు |
రీజనింగ్ | 50/50 | ఇంగ్లీష్/హిందీ | 40 నిముషాలు |
జనరల్ బ్యాంకింగ్ అవెర్నెస్ | 50/50 | ఇంగ్లీష్ /హిందీ | 40 నిముషాలు |
మొత్తం | 150 ప్రశ్నలు / 125 మార్కులు |
ఐటీ ఆఫీసర్స్,అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్,హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు | |||
సబ్జెక్టు | ప్రశ్నలు / మార్కులు | మీడియం | సమయం |
---|---|---|---|
ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 50/25 | ఇంగ్లీష్ | 40 నిముషాలు |
రీజనింగ్ | 50/50 | ఇంగ్లీష్/హిందీ | 40 నిముషాలు |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50/50 | ఇంగ్లీష్ /హిందీ | 40 నిముషాలు |
మొత్తం | 150 ప్రశ్నలు / 125 మార్కులు |
మెయిన్స్ ఎగ్జామ్ నమూనా
లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్స్,అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్,హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు | |||
సబ్జెక్టు | ప్రశ్నలు / మార్కులు | మీడియం | సమయం |
---|---|---|---|
ప్రొఫిషనల్ నాలెడ్జ్ టెస్ట్ | 60/60 | ఇంగ్లీష్/హిందీ | 45 నిముషాలు |
రాజ్ బాషా అధికారి మెయిన్స్ పరీక్షా సరళి | |||
సబ్జెక్టు | ప్రశ్నలు (హిందీ &ఇంగ్లీష్) | మార్కులు | సమయం |
---|---|---|---|
ప్రొఫిషనల్ నాలెడ్జ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్) | 45 | 60 | 30 నిముషాలు |
ప్రొఫిషనల్ నాలెడ్జ్ టెస్ట్ (డిస్క్రిప్టివ్) | 2 | 30 నిముషాలు |
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ నియామక విధానం
ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల ఖాళీ సంఖ్యను బట్టి ప్రతి పోస్టుకు మూడు నుండి ఐదు మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. పరీక్షా నిర్వహించని పోస్టులకు 7 నుండి 10 మంది అభ్యర్థులను పిలుస్తారు. ప్రొఫిషినల్ నౌలెడ్జ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా తయారుచేస్తారు.
ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు తుది దశలో 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో జనరల్ కేటగిరిఅభ్యర్థులు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇతర రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులు 30% అర్హుత మార్కులు పొందాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు ఉంటుంది. కనీస అర్హుత మార్కులను ఆయా టెస్టులలో విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా బ్యాంకు నిర్ణయిస్తుంది. రాత పరీక్షలో సాధించిన మార్కులకు 70%, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 30% వెయిటేజీ కేటాయిస్తారు.