ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు మంత్రులు 2024
Study Material

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు మంత్రులు 2024

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 12 జూన్ 2024న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఎన్నికలలో పోటీపడి విజేతగా నిలిసాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి మరియు 24 మంది కేబినేట్ మంత్రులు ఉన్నారు. ఈ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి 21 మంది, జనసేన పార్టీ నుండి ముగ్గురు మరియు భారతీయ జనతా పార్టీ నుండి ఒకరు మంత్రులుగా ఉన్నారు . మొత్తం 25 మందిలో 17 మంది మొదటిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

  • భారత రాజ్యాంగం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికోబడుతుంది.
  • రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నాయకత్వం వహిస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కార్యనిర్వాహక వ్యవస్థకు నిజమైన అధిపతిగా ఉంటారు.
  • రాష్ట్ర ముఖ్యమంత్రిని మరియు ఆయన మంత్రిమండలిని గవర్నర్ నియమిస్తారు.
  • గవర్నర్ రాష్ట్రా అధిపతిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ రోజువారీ నిర్వహణను ముఖ్యమంత్రి మరియు అతని మంత్రి మండలి చూసుకుంటుంది.
  • ఆంధ్ర ప్రదేశ్ ద్విసభా పరిపాలన విధానాన్ని కలిగి ఉంది.
  • అందులో దిగువ సభగా రాష్ట్ర అసెంబ్లీ (శాసనసభ / విధాన సభ), ఎగువ సభగా రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్ / విధాన పరిషత్) ఉంటాయి.
  • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 175 మంది శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు), 58 మంది శాసన మండలి (ఎమ్యెల్సీలు) సభ్యులు ఎన్నుకోబడుతారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు మంత్రుల జాబితా

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
 ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్
ప్రధాన సలహాదారు
ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్
ఏపీ అసెంబ్లీ స్పీకర్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్
ఏపీ కౌన్సిల్ ఛైర్మెన్ కొయ్యే మోషేను రాజు
ఏపీ డిప్యూటీ ఛైర్మెన్
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్
ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్

ఏపీ మంత్రివర్గం 2023

మినిస్టర్ పేరు మంత్రిత్వ శాఖ నియోజకవర్గం
నారా చంద్రబాబు నాయుడు (టీడీపీ) జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్

కేటాయించని ఇతర శాఖలు

కుప్పం
కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన) పంచాయతీ రాజ్
గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా
ఫారెస్ట్ & ఎన్విరాన్మెంట్
సైన్స్ & టెక్నాలజీ
పిఠాపురం
నారా లోకేష్ (టీడీపీ) సమాచార సాంకేతికత
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్
మానవ వనరుల అభివృద్ధి
రియల్ టైమ్ గవర్నెన్స్
మంగళగిరి
కింజరాపు అచ్చన్నాయుడు (టీడీపీ) వ్యవసాయం
సహకారం
మార్కెటింగ్
పశుసంరక్షణ
డెయిరీ డెవలప్‌మెంట్ & ఫిషరీస్
టెక్కలి
నాదెండ్ల మనోహర్ (జనసేన) కంజ్యూమర్ అఫైర్స్ & సివిల్ సప్లైస్ తెనాలి
కొల్లు రవీంద్ర (టీడీపీ) గనులు మరియు భూగర్భ శాస్త్రం
ఎక్సైజ్ శాఖ
మచిలీపట్నం
వంగలపూడి అనిత (టీడీపీ) హోమ్ శాఖ & డిజాస్టర్ మానేజ్మెంట్ పాయకరావుపేట
పయ్యావుల కేశవ్ (టీడీపీ) ఫైనాన్స్ మినిస్టర్
ప్రణాళిక
వాణిజ్య పన్నులు
శాసన వ్యవహారాలు
ఉరవకొండ
పొంగూరు నారాయణ (టీడీపీ) పురపాలక & పట్టణాభివృద్ధి నెల్లూరు సిటీ
ఎస్. సవిత (టీడీపీ) బీసీ సంక్షేమం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం
చేనేత మరియు వస్త్రాలు.
పెనుకొండ
నస్యం మహ్మద్ ఫరూక్ (టీడీపీ) లా & జస్టిస్
మైనారిటీ సంక్షేమం
నంద్యాల
కొలుసు పార్థసారధి (టీడీపీ) గృహ నిర్మాణం

సమాచారం & పబ్లిక్ రిలేషన్స్

నూజివీడు
నిమ్మల రామా నాయుడు (టీడీపీ) జలవనరుల అభివృద్ధి పాలకొల్లు
డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి (టీడీపీ) సామాజిక సంక్షేమం
వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం
సచివాలయం & గ్రామ వాలంటీర్
కొండపి
సత్య కుమార్ యాదవ్ (బీజేపీ) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య ధర్మవరం
ఆనం రామనారాయణ రెడ్డి (టీడీపీ) దేవాదాయ శాఖ ఆత్మకూర్
అనగాని సత్య ప్రసాద్ (టీడీపీ) రెవెన్యూ శాఖ

రిజిస్ట్రేషన్ & స్టాంపులు

రేపల్లె
టీజీ భరత్ (టీడీపీ) పరిశ్రమలు మరియు వాణిజ్యం
ఆహర తయారీ
కర్నూలు
కందుల దుర్గేష్ (జనసేన) టూరిజం, కల్చర్ అండ్ యూత్ అడ్వేన్సమెంట్

సినిమాటో గ్రఫీ

నిడదవోలు
బీసీ జనార్ధన్ రెడ్డి (టీడీపీ) రోడ్స్ & బిల్డింగ్స్

మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు

బనగానపల్లె
గొట్టిపాటి రవి కుమార్ (టీడీపీ) విద్యుత్ శాఖ అద్దంకి
గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ) ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ట్రైబల్ మినిస్టర్ సాలూరు
వాసంశెట్టి సుభాష్ (టీడీపీ) శ్రమ
కర్మాగారాలు
భీమా వైద్య సేవలు
రామచంద్రపురం
కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ) ఎంఎస్ఎంఈ
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP)
ఎన్నార్ఐ సాధికారత & సంబంధాలు
గజపతినగరం
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (టీడీపీ) రవాణా
యువత & క్రీడలు
రాయచోటి

Post Comment