Daily Current Affairs Quiz: 25 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 25 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(25 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ప్రపంచ పాస్‌పోర్ట్ సూచికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?

  1. 25వ స్థానం
  2. 35వ స్థానం
  3. 45వ స్థానం
  4. 85వ స్థానం
సమాధానం
4. 85వ స్థానం

2. ఇటీవల, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు?

  1. నేపాల్
  2. భూటాన్
  3. మయన్మార్
  4. బంగ్లాదేశ్
సమాధానం
1. నేపాల్

3. భారతదేశం నవంబర్ 20-24, 2024 వరకు ఏ రాష్ట్రంలో మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ను నిర్వహించనుంది?

  1. గుజరాత్
  2. కేరళ
  3. గోవా
  4. మహారాష్ట్ర
సమాధానం
3. గోవా

4. 2024, నవంబర్ 19న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లు ఎన్నో ఇండియా-ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు?

  1. రెండో
  2. మూడో
  3. నాలుగో
  4. ఐదో
సమాధానం
1. రెండో

5. ఏ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉన్న ధుద్మరాస్ అనే గ్రామాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) ఉత్తమ పర్యాటక విలేజ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసింది?

  1. ఒడిశా
  2. కర్ణాటక
  3. ఛత్తీస్‌గఢ్
  4. తెలంగాణ
సమాధానం
3. ఛత్తీస్‌గఢ్

6. 2025 జీ-20 అధ్యక్ష భాద్యతలను ఏ ఆఫ్రికా దేశం దక్కించుకుంది?

  1. చైనా
  2. దక్షిణాఫ్రికా
  3. అమెరికా
  4. అర్జెంటీనా
సమాధానం
2. దక్షిణాఫ్రికా

7. ఇటీవల వార్తల్లో చూసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది?

  1. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
  2. వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ
  3. ఆర్థిక మంత్రిత్వ శాఖ
  4. రక్షణ మంత్రిత్వ శాఖ
సమాధానం
3. ఆర్థిక మంత్రిత్వ శాఖ

8. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు 'బోలా అహ్మద్ టినుబు' నకు సిలోఫర్ పంచామృత కలశాన్ని బహుమతిగా ఇచ్చారు?

  1. నైజీరియా
  2. అర్జెంటీనా
  3. ఉక్రెయిన్
  4. భూటాన్
సమాధానం
1. నైజీరియా

9. 'క్లెమేట్ ఛేంజ్ ఫెర్మామెన్స్ ఇండెక్స్ (సిసిపిఐ) 2025' లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?

  1. 1వ
  2. 4వ
  3. 5వ
  4. 10వ
సమాధానం
4. 10వ

10. 'గ్లోబల్ అలయెన్స్ ఎగైనెస్ట్ హాంగర్ అండ్ పావర్టీ (ఆకలి, పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ కూటమి)'ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది?

  1. అర్జెంటీనా
  2. బ్రెజిల్
  3. బ్రిటన్
  4. బెల్జియం
సమాధానం
2. బ్రెజిల్

11. ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్‌ని ఎన్ని రైల్వే స్టేషన్లు విజయవంతంగా సాధించాయి?

  1. 120
  2. 130
  3. 140
  4. 150
సమాధానం
4. 150

12. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న సెలా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. అస్సాం
  3. కర్ణాటక
  4. కేరళ
సమాధానం
1. అరుణాచల్ ప్రదేశ్

13. 'తేన్మల కుల్లన్' అనే మరుగుజ్జు ఆవును స్వదేశీ జాతిగా గుర్తిస్తున్నట్లు ఏ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రకటించింది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తమిళనాడు
  3. కేరళ
  4. మహారాష్ట్ర
సమాధానం
3. కేరళ

14. ఇటీవల, ఏ రాష్ట్రం 7వ తరగతి ఐసిటి (ICT) పాఠ్యపుస్తకాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభ్యాసాన్ని ప్రవేశపెట్టింది?

  1. గుజరాత్
  2. తమిళనాడు
  3. కేరళ
  4. రాజస్థాన్
సమాధానం
3. కేరళ

15. ఇటీవల, ఏ రాష్ట్రం ఆసియా రాజు రాబందుల కోసం ప్రపంచంలోనే మొదటి సంరక్షణ మరియు పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది?

  1. హర్యానా
  2. ఉత్తరప్రదేశ్
  3. జార్ఖండ్
  4. ఒడిశా
సమాధానం
2. ఉత్తరప్రదేశ్

16. ఇటీవల, భారతదేశంలోని మొట్టమొదటి యునెస్కో 'సిటీ ఆఫ్ లిటరేచర్'గా కేరళలోని ఏ నగరాన్ని అధికారికంగా ప్రకటించారు?

  1. కోజికోడ్
  2. పాల్‌ఘాట్
  3. కొచ్చి
  4. కొల్లాం
సమాధానం
1. కోజికోడ్

17. ఇటీవల, బొగ్గు మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రంలో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (UCG) కోసం భారతదేశపు మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది

  1. గుజరాత్
  2. జార్ఖండ్
  3. ఒడిశా
  4. కర్ణాటక
సమాధానం
2. జార్ఖండ్

18. ఇటీవల, రాజస్థాన్ తర్వాత గిగ్ వర్కర్స్ కోసం చట్టాన్ని తీసుకువచ్చిన రెండవ రాష్ట్రం ఏది?

  1. కర్ణాటక
  2. కేరళ
  3. గుజరాత్
  4. నాగాలాండ్
సమాధానం
1. కర్ణాటక

19. ఇటీవల వార్తల్లో వచ్చిన విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, 2024 ప్రధాన లక్ష్యం ఏమిటి?

  1. విపత్తు సహాయ నిధులను పెంచడానికి
  2. సమగ్ర విపత్తు డేటాబేస్‌ను రూపొందించడానికి మరియు అర్బన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయడానికి
  3. పై రెండూ
  4. 2 మాత్రమే
సమాధానం
4. 2 మాత్రమే

20. 2025, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా ఏ నదుల సంగమ ప్రదేశంలో ఘనంగా ప్రారంభమైంది?

  1. గంగ, యమున, సరస్వతి
  2. గంగ, పద్మ, గోదావరి
  3. గోదావరి, పెన్నా, కృష్ణ
  4. గంగ, నర్మదా, యమున
సమాధానం
1. గంగ, యమున, సరస్వతి

21. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలోని సోన్‌మార్గ్ ప్రాంతంలో 'జడ్ మోడ్' సొరంగాన్ని ప్రారంభించారు?

  1. జమ్మూకాశ్మీర్
  2. హర్యానా
  3. హిమాచల్ ప్రదేశ్
  4. కేరళ
సమాధానం
1. జమ్మూకాశ్మీర్

22. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025లో ఎన్ని కోట్లు దాటే అవకాశం ఉందని 'ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్, 2024' అంచనా వేసింది?

  1. 50 కోట్లు
  2. 70 కోట్లు
  3. 80 కోట్లు
  4. 90 కోట్లు
సమాధానం
4. 90 కోట్లు

23. ఇటీవల 'ఈ- విరాట' అనే ఎలక్ట్రిక్ కారును ఏ కంపెనీ అవిష్కరించింది( ఇది ఆ కంపెనీ నుంచి వచ్చిన తొలి బ్యాటరీ కారు)?

  1. టాటా
  2. మహేంద్ర
  3. మారుతి సుజికి
  4. హ్యుందాయ్
సమాధానం
3. మారుతి సుజికి

24. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పండించిన 1010, 1064 రకం బియ్యాన్ని లక్ష టన్నులు ఎగుమతి చేయడానికి రాష్ట్ర సర్కార్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?

  1. నైజీరియా
  2. బ్రెజిల్
  3. ఫిలిప్పీన్స్
  4. చైనా
సమాధానం
3. ఫిలిప్పీన్స్

25. 2025, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇటీవల కేంద్రం ఎంత ప్యాకేజీని ప్రకటించింది?

  1. 11,220 కోట్లు
  2. 11,440 కోట్లు
  3. 11,330 కోట్లు
  4. 12,202 కోట్లు
సమాధానం
2. 11,440 కోట్లు

26. తమ దేశ రాజధానిని టెహ్రాన్ నుంచి దక్షిణ తీరప్రాంత నగరం మక్రాన్‌కు మారుస్తున్నట్టు ఇటీవల ఏ దేశం ప్రకటించింది?

  1. ఇరాక్
  2. ఇరాన్
  3. ఇండోనేషియా
  4. ఇజ్రాయెల్
సమాధానం
2. ఇరాన్

27. జోసెఫ్ ఔన్ ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

  1. నైజీరియా
  2. ఇండోనేషియా
  3. లెబనాన్
  4. ఫిలిపిన్స్
సమాధానం
3. లెబనాన్

28. ప్రధాన మంత్రి మోదీ విద్యార్థులతో ముచ్చటించేందుకు ప్రతీ ఏట నిర్వహించే పరీక్ష పే చర్చ (పీపీసి) కార్యక్రమానికి ఈ సారి ఎన్ని కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారని కేంద్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు?

  1. 2.45 కోట్లు
  2. 2.79 కోట్లు
  3. 3.33 కోట్లు
  4. 2.55 కోట్లు
సమాధానం
2. 2.79 కోట్లు

29. ఆసియాలోనే అతిపెద్ద 'గామా- రే ఇమేజింగ్ టెలిస్కోప్' ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు?

  1. లద్ధాక్
  2. చిత్రిపోరా
  3. మంగళ్‌పోరా
  4. ఖలూరా
సమాధానం
1. లద్ధాక్

30. ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యాన శ్లోకమైన 'హనుమాన్ చాలీసా'ను ఏ భాషలోకి అనువదించారు?

  1. ఆంగ్లం
  2. హిందీ
  3. ఉర్దూ
  4. మరాఠి
సమాధానం
1. ఆంగ్లం

Post Comment