Advertisement
ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
Telugu Current Affairs

ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి 7న ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన ఐదవ బడ్జెట్ ఇది. సాధారణ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు ద్వారా గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సంక్షేమాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగలిగిందని తెలిపారు.

ఎన్నికల నేపధ్యంలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదిం చారు. భారీ అంచనాలకు వెళ్లకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలకే పరిమితమయ్యారు. ఎప్పటిలాగానే విద్య, వైద్యం, వ్యవసా యం, సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు.

2024-25 ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ రూ.2,86,389.27 కోట్లుగా ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఇందులో మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు ఉంటుందని, ద్రవ్య లోటు రూ.55.817.50 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యలోటు జీఎస్డీపీలో దాదాపు 3.51% ఉంటుందని, రెవెన్యూ లోటు జీఎస్ఓపీలో దాదాపు 1.56 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2023-24 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 2.19 శాతం, ద్రవ్య లోటు జీఎస్ఓపీలో 4.18 శాతం ఉంటుందని తెలిపారు.

గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి

  • 2018-19లో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో ఏపీ దేశంలో 14వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 16.2 శాతానికి పెరిగింది.
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో ప్రస్తుతం ఏపీ దేశంలో 4వ స్థానంలో ఉంది.
  • గత ఐదేళ్లలో రెవెన్యూ వృద్ధి రేటు 6 శాతం కాగా ఇప్పుడు 16 శాతానికి పెరిగింది.
  • 2019లో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,081తో దేశంలో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం అది రూ.2,19,518తో 8వ ర్యాంకుకు ఎగబాకింది.
  • 2018-16లో రాష్ట్ర వ్యవసాయ రంగం సమ్మిలిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి ఎగబాకింది.
  • వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానాన్ని కైవశం చేసుకుంది.
  • డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం పేరుతొ రైతులందరికీ పంట బీమా వర్తింపచేసిన మొదటి, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
  • వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కోట్ల మంది అన్నదాతలకు గ్రామాల్లోనే పూర్తిస్థాయి వ్యవసాయ సేవలు అందిచబడుతున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు అందుకున్నాయి.
  • సూక్ష్మ నీటి పారుదల అమలులో ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉంది.
  • సూక్ష్మ నీటి పారుదల అమలులో దేశంలోని మొదటి 15 జిల్లాలలో ఆరు జిల్లాలు ఏపీ నుంచే ఉన్నాయి.
  • భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్), జాతీయ అరటి పరిశోధన సంస్థల నుంచి ఎగుమతి కార్యకలాపాలకుగాను ఉత్తమ రాష్ట్రం అవార్డును ఏపీ గెలుచుకుంది.
  • చేపల ఉత్పత్తిలో 30% వాటాతో, మొత్తం సముద్ర ఆహార ఉత్స త్తుల ఎగుమతులలో 31 శాతంతో దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది.
  • 20123లో ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు పొందింది.
  • ‣పుంగనూరు పశువులను సంరక్షిస్తున్న తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశో ధనా సంస్థ (ఐసీఏఆర్) నుంచి 'బ్రీడ్ కన్జర్వేషన్ ఆవార్డు అందుకుంది.
  • జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది.
  • దేశంలో 5 శాతం వాటాతో మహిళా యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధిలో ఏపీ 7వ స్థానంలో ఉంది.
  • ఒక జిల్లా - ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జందానీ చీరలు బంగారు బహుమతిని పొందింది.
  • చేనేత ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో నాలుగు అవార్డులను కూడా అందుకుంది.
  • ప్రధానమంత్రి పట్టణ వాస యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును ఆంధ్రప్రదేశ్ సాధించింది.
  • 2022లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల జాబితాలో ఏపీకి మూడోస్థానం లభించింది.
  • 1,35,000 మంది శాశ్వత సచివాలయ ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పా టుచేసింది.
  • వీటి పరిధిలో 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తుంది.
  • పరిపాలనాపరమైన పునర్నిర్మాణం కోసం జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచి, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచింది.
  • మహిళల రక్షణ కోసం ప్రతి జిల్లాలో దిశా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసింది.
  • రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీసుస్టేషన్లు ప్రారంభించింది.
  • ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు ఉన్నాయి.
  • 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కాస్ సంస్థను ఏర్పాటు చేసింది.

గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వ సంక్షేమం

  • జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్ల ఖర్చుతో 43 లక్షల మందికి పైగా విద్యార్థు లకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికా హారాన్ని అందిస్తోంది.
  • గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గించింది.
  • జగనన్న విద్యా దీవెన ద్వారా ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది.
  • ప్రపంచంలోని టాప్-50 విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య చేయాలనుకునే విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది.
  • దేశంలోనే తొలి సారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా అందిచబడుతుంది.
  • మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది.
  • నాడు-నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది.
  • గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది.
  • డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తుంది.
  • ఆరోగ్య ఆసరా కింద గత ఐదేళ్లలో 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది.
  • జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది.
  • కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది.
  • వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది.
  • జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టులు ఖాళీలు సగటున 61 శాతం ఉంటే, ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించింది.
  • ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం సీబీఎస్ఈ ఎడ్యుకేషన్ అమలు చేస్తోంది.
  • త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్దమవుతుంది.
  • విద్యార్థులలో ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టౌఫెల్ సర్టిఫికేషన్ అందిస్తోంది.
  • పిల్లలకు ఉచిత కంటెంటోతో కూడిన ట్యాబ్ లను ఉచితంగా అందిస్తోంది.
  • 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచరుతో బోధన ప్రవేశపెట్టింది.
  • జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3.387 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగ్లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది.
  • మనబడి నాడు-నేరు ద్వారా 56,708. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది
  • నాడు - నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది.
  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది.
  • వీటి ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వగా, వీరిలో 35 శాతం మంది ఉద్యోగాలు పొందారు.
  • 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ బ్యాచ్లు, క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసింది.
  • 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్లను అభివృద్ధి చేసింది.
  • నూతన పింఛను పధకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిం చడానికి జీపీఎస్ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది.
  • భూములను నిషేదిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది.
  • 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు కల్పించింది.
  • వందేళ్ల తర్వాత రాష్ట్రలో భూ రీసర్వే చేసేందుకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది.
  • దీని కోసం కొత్తగా 11,118 గ్రాము సర్వేయర్లను నియమించింది.
  • ఇప్పటివరకు 17:53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు అందించారు.
  • 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి.
  • ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచింది.
  • 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేయడంతో పాటుగా, 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలు చేసింది.
  • వైఎస్సార్ ఆసరా పథకం కింద 2018 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించింది.
  • ఈ పథకం కోసం 2019 నుంచి రూ.25,571 ఖర్చు చేసింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు కలిగించింది.
  • వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి గ్గించింది. గత ఐదేళ్లలో ఈ పథకం కింద 84,731 కోట్లు ఖర్చు చేసింది.
  • ఇంటి ముంగిటికే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో 9,280 సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. సబ్సిడీ బియ్యం కోసం ప్రభుత్వం రూ.29,628 కోట్లు ఖర్చు చేసింది.
  • గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4,63,697 ఇళ్లతో సహా, 1.58 లక్షల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది.

గత ఐదేళ్లలో నవరత్న పథకాల కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చు

  • వైఎస్సార్ వాహన మిత్ర కింద 2.78 లక్షల మందికి రూ.1,305 కోట్లు
  • వైఎస్సార్ లా నేస్తం కింద 6.069 మందికి నెలకు రూ.5 వేలు చొప్పున భృతి
  • వైఎస్సార్ కళ్యాణమస్తు. వైఎస్సార్ షాదీ తోఫా కింద 46,329 మందికి రూ.350 కోట్లు.
  • ఉపాధి హామీ పథకం కింద 2,141 లక్షల పని దినాల ద్వారా 45 లక్షల కుటుంబాల్లోని 72 లక్షల మందికి చెల్లింపులు.
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం.
  • వైఎస్సార్ బీమా కింద 49,000 కుటుంబాలకు రూ.650 కోట్లు.
  • ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1,257 కోట్లు
  • వైఎస్సార్ కాపు నేస్తం కింద 77 లక్షల మందికి రూ.39,247 కోట్లు
  • వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 983 కోట్లు.
  • జగనన్న తోడు కింద 16.78 లక్షల మందికి రూ.3,374 కోట్లు
  • జగనన్న చేదోడు కింద 3.40 లక్షల మందికి రూ.1.268 కోట్లు
  • అగ్ర వర్ణాలు అయిన కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ వర్గాలకు చెందిన కోటి 15 లక్షల మందికి రూ.36,321 కోట్లు
  • జగనన్న అమ్మఒడి కింద 43.61 మంది మహిళకు 26,067 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా కింద 78.94 లక్షల మందికి 25,571 కోట్లు
  • వైఎస్సార్ చేయూత కింద 26 లక్షల మహిళకు 14,129 కోట్లు.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సమగ్ర స్వరూపం

  • ఆంధ్రప్రదేశ్ మొత్తం గ్రామ సచివాలయాలు : 10,960
  • ఆంధ్రప్రదేశ్ మొత్తం వార్డు సచివాలయాలు : 4,044
  • ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మొత్తం ఉద్యోగులు : 4 లక్షల మంది
  • ఆంధ్రప్రదేశ్ సచివాలయాల శాశ్వత ఉద్యోగులు : 1,34,694 మంది
  • ఆంధ్రప్రదేశ్ మొత్తం వాలంటీర్లు : 2,55,457 మంది

ఆంధ్రప్రదేశ్ 2024-25 బడ్జెట్ స్వరూపం

మొత్తం బడ్జెట్ 2,86,389 కోట్లు
రెవెన్యూ వ్యయం 2.30.110 కోట్లు
మూలధన వ్యయం 30,530 కోట్లు
ద్రవ్య లోటు 55,817 కోట్లు
రెవెన్యూ లోటు 24,758 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం

శాఖల వారీగా 2024 ఏపీ బడ్జెట్ కేటాయింపులు

మంత్రిత్వ శాఖ /రంగం కేటాయంపు (కోట్లలో)
విద్యారంగం 33,898 కోట్లు
వైద్య, ఆరోగ్య రంగం 17,916 కోట్లు
గ్రామీణాభివృద్ధి 17,816 కోట్లు
పట్టణాభివృద్ధి 9,546 కోట్లు
వ్యవసాయ రంగం 14,236 కోట్లు
సాగునీరు 12,038 కోట్లు
గృహ నిర్మాణాలు 7,062 కోట్లు
ప్రజా సంక్షేమం 44,668 కోట్లు
బీసీ సంక్షేమం 29,001 కోట్లు
ఎస్సీ సంక్షేమం 9,291 కోట్లు
ఎస్టీ సంక్షేమం 4,133 కోట్లు
మైనారిటీల సంక్షేమం 2,242 కోట్లు
ఇంధనం 6,595 కోట్లు
పరిశ్రమలు 2,611 కోట్లు
రవాణా 10,334 కోట్లు
శాస్త్ర సాంకేతిక , పర్యావరణం 16.32 కోట్లు
సాధారణ ఎకో సర్వీస్ 4,744 కోట్లు

Post Comment