ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ 2023
Scholarships

ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ 2023

ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ & హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ పథకాల ద్వారా అనాథలకు, లేబర్ కుటుంబాలకు చెందిన పిల్లలకు, దారిద్ర రేఖకు దిగువున ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలకు, నిరక్షరాస్య తల్లిదండ్రుల పిల్లలకు జిల్లా పరిధిలో ఉండే ఉత్తమ స్కూళ్లలో లేదా ఇనిస్టిట్యూట్లలో నాణ్యమైన పాఠశాల విద్యను అందిస్తారు.

స్కాలర్షిప్ ఉత్తమ పాఠశాలల పథకం & హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్
స్కాలర్షిప్ టైప్ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్
ఎవరికి అందిస్తారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు
అర్హుత రెండు లక్షలలోపు కుటుంబ ఆదాయం

ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్

ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద అనాథలకు, లేబర్ కుటుంబాలకు చెందిన పిల్లలకు, దారిద్ర రేఖకు దిగువున ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలకు, నిరక్షరాస్య తల్లిదండ్రుల పిల్లలకు మరియు రెండు లక్షల లోపు ఆదాయం ఉండే ఎస్సీ పిలల్లకు జిల్లా పరిధిలో ఉండే ఉత్తమ స్కూళ్లలో లేదా ఇనిస్టిట్యూట్లలో నాణ్యమైన పాఠశాల విద్యను అందిస్తారు. ఈ పథకం పరిధిలో నాన్ రెసిడెన్సియల్ కేటగిరిలో 1వ తరగతి అడ్మిషన్లు, రెసిడెన్సీ కేటగిరి కింద 5వ తరగతి అడ్మిషన్లు నిర్వహిస్తారు.

నాన్ రెసిడెన్సియల్ కేటగిరిలో ప్రవేశాలు పొందిన ఒక్కో విద్యార్థికి, ట్యూషన్ ఫీజు, బుక్స్, యూనిఫామ్ అన్ని కలుపుకుని ఏడాదికి గరిష్టంగా 20 వేలు ఖర్చుపెడుతుంది. రెసిడెన్సియల్ కేటగిరిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా 30 వేల వరకు ఖర్చు చేస్తుంది. ఈ పథకం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమలు చేస్తారు.

ఈ పథకం కింద అందుబాటులో ఉండే సీట్లలో నాన్ రెసిడెన్సియల్ కేటగిరిలో జిల్లాకు 100 చెప్పున మొత్త్తం 1300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రెసిడెన్సియల్ కేటగిరిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపూర్ & కడప జిల్లాలకు 200 సీట్లు చెప్పున, గోదావరి, కృష్ణ, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలో 300 సీట్లు చెప్పున మొత్తం 3400 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ

అనాథపిల్లలు, లేబర్ కుటుంబాలకు చెందిన పిల్లలు, దారిద్ర రేఖకు దిగువున ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలు, నిరక్షరాస్య తల్లిదండ్రుల పిల్లలు మరియు రెండు లక్షల లోపు ఆదాయం ఉండే వ్యవసాయ కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.

ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ దరఖాస్తు

ఈ పథకానికి సంబంధించి జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ స్థానిక వార్త పత్రికల్లో, న్యూస్ ఛానెళ్లలో ప్రచురిస్తారు. నోటిఫిషషన్ అనుచరించి అర్హుత ఉండే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సంఖ్యను బట్టి, జిల్లా కలెక్టర్ అర్హుత పరీక్షా లేదా లాటరీ పద్దతిలో అర్హులను ఎంపిక చేస్తారు.

ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సమయంలో పాఠశాలలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. పాఠశాల ప్రిన్సిపాల్, జాయిన్ అయినా విద్యార్థుల వివరాలు ఈపాస్ పోర్టల్'లో రిజిస్టర్ చేయడం ద్వారా ప్రభుత్వం ఈ పథకానికి చెందిన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.

అందుబాటులో ఉండే సీట్లలో 50 శాతం సీట్లు వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన పిల్లలతో భర్తీచేస్తారు. 20 శాతం సీట్లు అనాధాశ్రయ పిల్లలకు, 15 శాతం సీట్లు జోగిని పిల్లలకు మిగతా 15 శాతం సీట్లు సాధారణ కూలీ పిల్లలతో భర్తీచేస్తారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ పథకం

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ పథకం ద్వారా బేగంపేట్ మరియు రామంతాపూరులో ఉండే హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో నిరుపేద ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన I నుండి క్లాస్ X రెసిడెన్సియల్ & నాన్ రెసిడెన్సియల్ విద్యార్థులకు ఏడాదికి 90 వేల నుండి 2 లక్షల వరకు వెచ్చించి టాప్ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తుంది.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ పథకం ఎలిజిబిలిటీ

కుటుంబ ఆదాయం 1.5 లక్షలు (అర్బన్), 2 లక్షలు (రురల్) ఉండే విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసేందుకు అర్హులు. కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ పథకం దరఖాస్తు

ఈ పథకానికి సంబంధించి జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ స్థానిక వార్త పత్రికల్లో, న్యూస్ ఛానెళ్లలో ప్రచురిస్తారు. నోటిఫిషషన్ అనుచరించి అర్హుత ఉండే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సంఖ్యను బట్టి, జిల్లా కలెక్టర్ అర్హుత పరీక్షా లేదా లాటరీ పద్దతిలో అర్హులను ఎంపిక చేస్తారు.

ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సమయంలో పాఠశాలలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. పాఠశాల ప్రిన్సిపాల్, జాయిన్ అయినా విద్యార్థుల వివరాలు ఈపాస్ పోర్టల్'లో రిజిస్టర్ చేయడం ద్వారా ప్రభుత్వం ఈ పథకానికి చెందిన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. గమనిక : ప్రస్తుతం ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుంది.

Post Comment