Advertisement
కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్ 2022
Telugu Current Affairs

కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్ 2022

భారత తీరప్రాంత రక్షణ వ్యవహారాలు నిర్వర్తించే ఇండియన్ కోస్ట్ గార్డ్, వివిధ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు కోరుతుంది. పోస్టుల వారీగా గణితం కాంబినేషన్'లో డిప్లొమా, ఇంటర్, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు 28 ఫిబ్రవరి 2022 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

భర్తీచేసే పోస్టు  ఖాళీలు
జనరల్ డ్యూటీ 50
టెక్నికల్ (మెకానికల్ & ఎలక్ట్రికల్) 15

ఎలిజిబిలిటీ మరియు దరఖాస్తు వివరాలు

  • ఎలిజిబిలిటీ : వివిధ పోస్టుల వారిగా డిప్లొమా, ఇంటర్, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు
  • వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 24 ఏళ్ళు మించకూడదు.
  • దరఖాస్తు ఫీజు : 250/- (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
  • దరఖాస్తు ప్రారంభ తేది : 15 ఫిబ్రవరి 2022
  • దరఖాస్తు తుది గడువు : 28 ఫిబ్రవరి 2022
  • రఖాస్తు విధానం : ఆన్‌లైన్

నియామక షెడ్యూల్

దశలు/తేదీలు జనరల్ డ్యూటీ CPL - SSA Tech (Mech) Tech (Elect)
స్టేజ్ I మార్చి 2022 మార్చి 2022 మార్చి 2022 మార్చి 2022
స్టేజ్ II జూన్ 2022 జూన్ 2022 జూన్ 2022 జూన్ 2022
స్టేజ్ III జులై-అక్టోబర్ 2022 జులై-అక్టోబర్ 2022 జులై-అక్టోబర్ 2022 జులై-అక్టోబర్ 2022
స్టేజ్ IV జులై-డిసెంబర్ 2022 జులై-డిసెంబర్ 2022 జులై-డిసెంబర్ 2022 జులై-డిసెంబర్ 2022
స్టేజ్ V డిసెంబర్ 2022 డిసెంబర్ 2022 డిసెంబర్ 2022 డిసెంబర్ 2022

ఎంపిక విధానం

ఎంపిక ఐదు దశలలో జరుగుతుంది. మొదటి దశలో దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రధాన కేంద్రాలలో 400 మార్కులకు కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (CGCAT) నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ నోయిడా, ముంబై/గోవా, చెన్నై, మరియు కోల్‌కతా కేంద్రాలలో ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాటు చేస్తారు. మూడవ దశలో ఫైనల్ సెలక్షన్ బోర్డు (FSB) ఆధ్వర్యంలో సైకాలాజికల్ టెస్ట్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

మూడవ దశలో షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు, నాలుగవ దశలో మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మెడికల్ టెస్ట్ అర్హుత పొందిన వారిని చివరిగా అందుబాటులో ఉండే సీట్ల సంఖ్యా ఆధారంగా తుది ఎంపికను పూర్తిచేస్తారు.

కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (CGCAT) విధానం

సెక్షన్ I : జనరల్ డ్యూటీ (CPL & SSA ఎంట్రీ)
సబ్జెక్టు  ప్రశ్నలు మార్కులు సమయం 
ఇంగ్లీష్ 25 ప్రశ్నలు 100 మార్కులు 2 గంటలు
రీజనింగ్ & న్యూమరికాల్ ఎబిలిటీ 25 ప్రశ్నలు 100 మార్కులు
జనరల్ సైన్స్ & మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 100 మార్కులు
జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 100 మార్కులు
సెక్షన్ II : టెక్నికల్ డ్యూటీ (మెకానికల్ ఎంట్రీ)
సబ్జెక్టు  ప్రశ్నలు మార్కులు సమయం 
ఇంగ్లీష్ 10 ప్రశ్నలు 40 మార్కులు 2 గంటలు
రీజనింగ్ & న్యూమరికాల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు 40 మార్కులు
జనరల్ సైన్స్ & మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు 40 మార్కులు
జనరల్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు 40 మార్కులు
మెకానికల్ 60 ప్రశ్నలు 240 మార్కులు
సెక్షన్ III : టెక్నికల్ డ్యూటీ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఎంట్రీ)
సబ్జెక్టు  ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్ 10 ప్రశ్నలు 40 మార్కులు 2 గంటలు
రీజనింగ్ & న్యూమరికాల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు 40 మార్కులు
జనరల్ సైన్స్ & మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు 40 మార్కులు
జనరల్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు 40 మార్కులు
ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ 60 ప్రశ్నలు 240 మార్కులు

Post Comment