Daily Current Affairs Quiz: 23 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 23 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(23 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. దొమ్మరాజు గుకేశ్ 2025-తాజా ఫిడే ర్యాంకింగ్స్‌లో 2784 రేటింగ్ పాయింట్లతో ఎన్నో స్థానంలో నిలిచాడు.?

  1. మొదటి స్థానం
  2. రెండో స్థానం
  3. నాలుగో స్థానం
  4. ఐదో స్థానం
సమాధానం
3. నాలుగో స్థానం

2. ఎన్నికల సంఘం 2025, జనవరి 22న విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో ఓటర్ల సంఖ్య ఎన్ని కోట్లకు చేరింది?

  1. 92.1 కోట్లు
  2. 94.1 కోట్లు
  3. 95.1 కోట్లు
  4. 99.1 కోట్లు
సమాధానం
4. 99.1 కోట్లు

3. 2025లో మన దేశం నుంచి 97వ ఆస్కార్ నామినేషన్లలో నిలిచిన ఆడమ్ జే గ్రేవ్స్ తెరకెక్కించిన లఘు చిత్రం ఏది?

  1. అనూజ
  2. కృతీ
  3. అహల్య
  4. ఖుజ్లీ
సమాధానం
1. అనూజ

4. భారతదేశంలో 69వ రైల్వే డివిజన్ ఏది?

  1. విశాఖపట్టణం
  2. జమ్ము
  3. వరంగల్
  4. సిమ్లా
సమాధానం
2. జమ్ము

5. ఇటీవల ఇస్రో కొత్త ఛైర్మన్‌గా కిందివారిలో ఎవరు నియమితులయ్యారు?

  1. వి. నారాయణన్
  2. వి. సుందర్
  3. వి. కమల్
  4. వి. రాజన్
సమాధానం
1. వి. నారాయణన్

6. ఎస్టీ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి రూ.5,000 ఆర్థికసాయం అందించే 'షాహిద్ మాధో 'సింగ్ ఖర్చా' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. ఒడిశా
  3. ఛత్తీస్‌గఢ్
  4. మిజోరం
సమాధానం
2. ఒడిశా

7. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. బహదూర్ సింగ్
  2. కమల్ సింగ్
  3. వి. సుమిత్
  4. జై షా
సమాధానం
1. బహదూర్ సింగ్

8. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ 2024 - 25 విజేత ఎవరు?

  1. తమిళనాడు
  2. విదర్భ
  3. ఉత్తరప్రదేశ్
  4. కర్ణాటక
సమాధానం
4. కర్ణాటక

9. 'మహిళల శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం లైంగిక వేధింపే' అని ఇటీవల ఏ హైకోర్టు చెప్పింది?

  1. మద్రాసు హైకోర్టు
  2. ఒడిశా హైకోర్టు
  3. కేరళ హైకోర్టు
  4. కోల్‌కతా హైకోర్టు
సమాధానం
3. కేరళ హైకోర్టు

10. 'మిడిల్ క్లాస్ ఇండియా: డ్రైవింగ్ ఛేంజ్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచురీ' పుస్తక రచయిత ఎవరు?

  1. అమిత్ షా
  2. మనీష్ పాండే
  3. మనోజ్ పాండే
  4. నంద కిషో
సమాధానం
2. మనీష్ పాండే

11. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం ఏ రాష్ట్రం 'నో హెల్మెట్ నో ఫ్యూయల్' అనే నూతన పాలసీ తీసుకొచ్చింది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తెలంగాణ
  3. కేరళ
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
4. ఉత్తరప్రదేశ్

12. 18వ ప్రవాసీ భారతీయ దివస్ ఇటీవల 2025, జనవరి 8–10 మధ్య ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన క్రిస్టీన్ కార్లా కాంగలూ ఏ దేశ అధ్యక్షురాలు?

  1. ట్రినిడాడ్, టొబాగో
  2. గయానా
  3. సురినాం
  4. ఫిజీ
సమాధానం
1. ట్రినిడాడ్, టొబాగో

13. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ ప్రవాసీ భారతీయ దివస్‌లో ఎంతమందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు?

  1. 27
  2. 28
  3. 29
  4. 30
సమాధానం
1. 27

14. ఇండియన్ వాటర్‌వర్క్స్ అసోసియేషన్ 57వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది?

  1. బిలాస్‌పూర్
  2. రాయ్‌పూర్
  3. భువనేశ్వర్
  4. సిమ్లా
సమాధానం
2. రాయ్‌పూర్

15. 2025, జనవరిలో సింగపూర్ గౌరవ పౌర పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది?

  1. రోషిణీ నాడర్ మల్హోత్రా
  2. ముకేశ్ అంబానీ
  3. తరుణ్ దాస్
  4. సచిన్
సమాధానం
3. తరుణ్ దాస్

16. జాతీయ స్టార్టప్ రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?

  1. జనవరి 12
  2. జనవరి 14
  3. జనవరి 16
  4. జనవరి 18
సమాధానం
3. జనవరి 16

17. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

  1. నారాయణ్ సింగ్
  2. అరవింద్ సింగ్
  3. కుమార్ ప్రతాప్
  4. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్
సమాధానం
4. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్

18. ఇటీవల భారత్‌ను సందర్శించిన మొహమ్మద్ ఘాస్సన్ మౌమూన్ ఏ దేశ రక్షణమంత్రి?

  1. మాల్దీవులు
  2. సింగపూర్
  3. భూటాన్
  4. రష్యా
సమాధానం
1. మాల్దీవులు

19. 2025, ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఏఐ యాక్షన్ సమ్మిట్-2025 ఏ దేశంలో జరగనున్నాయి?

  1. చైనా
  2. ఫ్రాన్స్
  3. ఇండియా
  4. హీరో
సమాధానం
2. ఫ్రాన్స్

20. ప్రపంచంలో తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చిన కంపెనీ?

  1. టీవీఎస్
  2. బజాజ్
  3. హీరో
  4. హోండా
సమాధానం
1. టీవీఎస్

21. కృత్రిమమేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే ఉద్యోగ మార్కెట్‌కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతల్లో భారత్ ఏ ర్యాంకు సాధించింది?

  1. 2వ
  2. 3వ
  3. 4వ
  4. 5వ
సమాధానం
1. 2వ

22. 76వ గణతంత్ర దినోత్సవం (2025, జనవరి 26)కి ముఖ్య అతిథిగా వస్తున్న ప్రబోవో సుబియంటో ఏ దేశ అధ్యక్షుడు?

  1. సురినాం
  2. ఇండొనేసియా
  3. తైవాన్
  4. ఫిజీ
సమాధానం
2. ఇండొనేసియా

23. స్పేడెక్స్ డాకింగ్ సాంకేతికతను సాధించిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది?

  1. 2వ
  2. 4వ
  3. 6వ
  4. 7వ
సమాధానం
2. 4వ

24. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది?

  1. 55 ఏళ్ళు
  2. 65 ఏళ్ళు
  3. 75 ఏళ్ళు
  4. 77 ఏళ్ళు
సమాధానం
3. 75 ఏళ్ళు

25. భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన 'భేటీ బచావో, భేటీ పఢావో' కార్యక్రమం 2025 సంవత్సరం నాటికి ఎన్నేళ్లు పూర్తి చేసుకుంది?

  1. 10 సం.
  2. 12 సం.
  3. 9 సం.
  4. 8 సం.
సమాధానం
1. 10 సం.

26. 2025, తెలంగాణాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏటా ఎంత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల నిర్ణయించింది?

  1. 11 వేలు
  2. 12 వేలు
  3. 14 వేలు
  4. 15 వేలు
సమాధానం
2. 12 వేలు

27. భారత్‌పోల్ (బీహెచ్ఏఆర్ఏటీపోల్) అనే పోర్టల్‌ను ఏ కేంద్ర మంత్రి ఇటీవల ప్రారంభించారు?

  1. జె.పి నడ్డా
  2. జై శంకర్
  3. జై రామ్
  4. అమిత్ షా
సమాధానం
4. అమిత్ షా

28. అసంఘిటిత రంగ కార్మికులతో పాటు ఇతరులకు ఉపయోగపడే 'ఈ - శ్రమ్ పోర్టల్‌'ను ఎన్ని భాషలలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది?

  1. 21
  2. 22
  3. 23
  4. 24
సమాధానం
2. 22

29. 'వికసిత భారతదేశంలో భారత సంతతి వ్యక్తుల పాత్ర' అనే ఇతివృత్తంతో 18వ ప్రవాస భారతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?

  1. భువనేశ్వర్
  2. విశాఖపట్నం
  3. న్యూఢిల్లీ
  4. ముంబయి
సమాధానం
1. భువనేశ్వర్

30. ఆడ దోమలను కట్టడి చేసేందుకు మగ దోమల వీర్యంలో విషపూరిత ప్రోటీన్లు ఉత్పత్తి చేసే ప్రక్రియపై ఇటీవల ఏ దేశ పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు?

  1. అమెరికా
  2. జపాన్
  3. ఆస్ట్రేలియా
  4. చైనా
సమాధానం
3. ఆస్ట్రేలియా

Post Comment