Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 21 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 21 జనవరి 2024

January 21, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన ఐదవ దేశంగా జపాన్

చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన ఐదవ దేశంగా జపాన్ అవతరించింది. జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) అంతరిక్ష నౌక జనవరి 19న చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా ఈ చారిత్రాత్మకమైన ఫీట్‌ను సాధించింది. యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ (రష్యా), చైనా మరియు భారతదేశం తర్వాత ఈ ముఖ్యమైన విజయాన్ని సాధించిన ఐదవ దేశంగా జపాన్ నిలిచింది.

ఈ ప్రయోగాన్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ నిర్వహించింది. ఈ మిషన్ చంద్ర శిలల అధ్యయనం, చంద్రుని ధూళిన విశ్లేషించడం, చంద్ర ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయడం మరియు భవిష్యత్తులో వనరుల వినియోగానికి గల సామర్థ్యాన్ని పరిశోధించడం లక్ష్యంగా పెట్టుకుంది.

బెంగళూరు & ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లకు బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

సివిల్ ఏవియేషన్ యొక్క వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2024లో బెంగళూరు మరియు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లు సంయుక్తంగా 'బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఆఫ్ ది ఇయర్'ని కైవసం చేసుకున్నాయి. ఈ  రెండు విమానాశ్రయాలు తమ ఆపరేషనల్ ఎక్సలెన్స్, ప్రయాణికుల సౌకర్యం మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం ఈ అవార్డు అందుకున్నాయి.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దీనికి భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరు పెట్టబడింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం. ఇది 2009 నుండి ప్రయాణీకుల రద్దీ పరంగా భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ఉంది. అలానే  కార్గో ట్రాఫిక్ పరంగా 2020 ఆర్థిక సంవత్సరంలో 6.73 కోట్ల (67.3 మిలియన్లు) ప్రయాణీకులను నిర్వహించింది.

బెంగుళూరు విమానాశ్రయంను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. బెంగళూరు స్థాపకుడైన కెంపె గౌడ I పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. ఢిల్లీ, ముంబై తర్వాత ఈ విమానాశ్రయం ప్రయాణీకుల రద్దీ, ఎయిర్ ట్రాఫిక్ కదలికలు మరియు దేశీయ మొత్తం కార్గో ద్వారా భారతదేశంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ఉంది.

పెప్సికో ఇండియా తదుపరి సీఈఓగా జాగృత్ కొటేచా

పెప్సికో ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా జాగృత్ కొటేచా నియమితులయ్యారు. జాగృత్ కొటేచా ఇదివరకు పెప్సికో ఆఫ్రికా, మిడిల్-ఈస్ట్ మరియు సౌత్ ఆఫ్రికా యొక్క చీఫ్ కమర్షియల్ ఆఫీసరుగా సేవలు అందించారు. ప్రస్తుతం పెప్సికో ఇండియా సీఈఓగా ఉన్న అహ్మద్ ఎల్ షేక్ తర్వాత ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.

పెప్సికో 1989లో భారతదేశంలోకి ప్రవేశించింది. తర్వాత కాలంలో ఇది భారతదేశంలో అతిపెద్ద ఆహార మరియు పానీయాల వ్యాపారాలలో ఒకటిగా ఎదిగింది. పెప్సికో ఇండియా యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోలో పెప్సి, లేస్, కుర్కురే, ట్రోపికానా, గాటోరేడ్ మరియు క్వేకర్ వంటి దిగ్గజ బ్రాండ్‌లు ఉన్నాయి.

అస్సాం ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ ప్రారంభం

అస్సాం ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనే నూతన పథకాన్ని ఆవిష్కరించింది. గ్రామీణ సూక్ష్మ-ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించే లక్ష్యంతో గ్రామీణ మహిళా వ్యవస్థాపకులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది. ఈ పథకం 40 లక్షల మంది స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) సభ్యుల లక్ష్యంగా అమలు చేయబడుతుంది. దీని కోసం దాదాపు 4వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు.

ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్‌ కింద అర్హులైన ప్రతి మహిళకు మూడేళ్లలో రూ.35,000 అందజేస్తారు. మొదటి రెండేళ్లలో ఏడాదికి రూ. 12,500 చెప్పున, చివరి ఏడాది 10 వేల చెప్పున ఆర్థిక సహాయం కల్పిస్తారు. అయితే ఈ పథకం అమలులో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి.

ఈ పథకం కేవలం ఒకరు లేదా ఇద్దరు పిల్లల తల్లులకు మాత్రమే అందిస్తారు.ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలు ముగ్గురు కంటే ఎక్కువ పిల్లలను కలిగి ఉండకూడదని, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు నలుగురు పిల్లల కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు అనే నిబంధన చేర్చారు. అలానే పిల్లలు పాఠశాలలో చేర్పించి ఉండాలనే నిబంధన కూడా ఉంది. దీనితో పాటుగా

47వ కోల్‌కతా బుక్ ఫెయిర్‌ను ప్రారంభించిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 47వ అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శనను జనవరి 18న ప్రారంభించారు. సాల్ట్ లేక్‌ సెంట్రల్ పార్క్‌లోని బోయి మేళా ప్రాంగన్‌లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ జనవరి 18 నుండి 31 వరకు నిర్వహించారు. ఈ ఏడాది యునైటెడ్ కింగ్‌డమ్‌ను థీమ్ దేశంగా ప్రతిపాదించారు. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా గుర్తింపు పొందింది. కోల్‌కతా దుర్గాపూజ తరువాత, ఈ పుస్తక మహోత్సవం 13 రోజుల పాటు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద కార్యక్రమంగా నిర్వహిస్తారు.

అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్ 1976లో మొదటిసారి నిర్వహించారు. అప్పటి నుండి యేటా ఈ వేడుక నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ ఫెయిర్ మరియు లండన్ బుక్ ఫెయిర్ తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వార్షిక పుస్తకాల సమ్మేళనంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నాన్-ట్రేడ్ బుక్ ఫెయిర్ కూడా.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2024

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024 అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ ఏడాది మొత్తం 19 మంది బాలలకు రాష్ట్రపతి ఈ అవార్డులు అందజేశారు. వీటిలో శౌర్యం, సైన్స్ & టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ విభాగాల్లో ఒక్కో అవార్డు, సామాజిక సేవ విభాగంలో నాలుగు అవార్డులు, క్రీడల విభాగంలో ఐదు అవార్డులు మరియు కళ & సంస్కృతి కేటగిరీలో ఏడు అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డులు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా యేటా అందజేస్తారు.

భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రదానం చేస్తుంది. ఈ అవార్డు బాలల అసాధారణ విజయాలను గుర్తిస్తుంది. ప్రతి అవార్డు గ్రహీతకు రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్‌ మరియు సర్టిఫికెట్‌ అందజేస్తారు.ఈ  అవార్డు గ్రహీతల ఎంపిక కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి అధ్యక్షతన జాతీయ ఎంపిక కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.

గ్రహీత పేరు రాష్ట్రం అవార్డు కేటగిరి
1. ఆదిత్య విజయ్ బ్రహ్మనే (మరణానంతరం) మహారాష్ట్ర శౌర్యం
2. అనుష్క పాఠక్ ఉత్తర ప్రదేశ్ కళ & సంస్కృతి
3. అరిజిత్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ కళ & సంస్కృతి
4. అర్మాన్ ఉబ్రాణి ఛత్తీస్‌గఢ్ కళ & సంస్కృతి
5. హేత్వీ కాంతిభాయ్ ఖింసూరియా గుజరాత్ కళ & సంస్కృతి
6. ఇష్ఫాక్ హమీద్ జమ్మూ & కాశ్మీర్ కళ & సంస్కృతి
7. ఎండీ హుస్సేన్ బీహార్ కళ & సంస్కృతి
8. పెండ్యాల లక్ష్మీ ప్రియ తెలంగాణ కళ & సంస్కృతి
9. సుహాని చౌహాన్ ఢిల్లీ ఆవిష్కరణ
10. ఆర్యన్ సింగ్ రాజస్థాన్ సైన్స్ & టెక్నాలజీ
11. అవనీష్ తివారీ మధ్యప్రదేశ్ సామాజిక సేవ
12. గరిమా హర్యానా సామాజిక సేవ
13. జ్యోత్స్న అక్తర్ త్రిపుర సామాజిక సేవ
14. సయం మజుందర్ అస్సాం సామాజిక సేవ
15. ఆదిత్య యాదవ్ ఉత్తర ప్రదేశ్ క్రీడలు
16. చార్వి ఎ కర్ణాటక క్రీడలు
17. జెసిక్కా నెయి సారింగ్ అరుణాచల్ ప్రదేశ్ క్రీడలు
18. లింతోయ్ చనంబం మణిపూర్ క్రీడలు
19. ఆర్ సూర్య ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ క్రీడలు

ఐక్యరాజ్యసమితి ఫిషరీస్ బాడీలో వైస్-ఛైర్ స్థానాన్ని దక్కించుకున్న భారత్

భారతదేశం ఇటీవలే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓ), ఫిషరీస్ కమిటీ (సీఓఎఫ్ఐ) సబ్-కమిటీ ఆఫ్ ఫిషరీస్ మేనేజ్‌మెంట్ యొక్క మొదటి వైస్ చైర్‌గా నిమితులయ్యింది. గ్లోబల్ ఫిషరీస్ గవర్నెన్స్ రంగంలో భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన విజయం. ఎఫ్ఎఓ ఫిషరీస్ బ్యూరోలో భారతదేశం సభ్యుడిగా చేరిన 57 ఏళ్లలో ఒక హోదాను దక్కించుకోవడం ఇదే మొదటిసారి.

గ్లోబల్ ఫిషరీస్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన చర్చలు మరియు నిర్ణయాలలో ఈ స్థానం భారతదేశానికి అదనపు స్వరాన్ని అందిస్తుంది. మొదటి వైస్ చైర్‌గా, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మత్స్య సంపద స్థిరత్వం మరియు అభివృద్ధిని ప్రభావితం చేసే విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది.

ఆహార భద్రత మరియు జీవనోపాధి కోసం మత్స్య సంపదపై ఎక్కువగా ఆధారపడే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం వాదిస్తూ, గ్లోబల్ సౌత్ ప్రతినిధిగా భారతదేశం ఈ పాత్రను స్వీకరిస్తుంది. ప్రపంచంలో 28 మిలియన్లకు పైగా లోతట్టు మరియు సముద్ర మత్స్యకారులతో భారతదేశం అగ్రశ్రేణి ఫిషింగ్ దేశాలలో ఒకటిగా ఉంది.

ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓ) అనేది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఇదిప్రపంచ పోషకాహారం మరియు ఆహార భద్రతను మెరుగుపరచడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తుంది. ఇది 16 అక్టోబర్ 1945న స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం రోమ్ (ఇటలీ) లో ఉంది.

ఫిషరీస్ కమిటీ (సీఓఎఫ్ఐ) అనేది మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క పని కార్యక్రమాలను సమీక్షించే ఒక విభాగం. ఇది అంతర్జాతీయ మత్స్య మరియు ఆక్వాకల్చర్ సమస్యలపై కాలానుగుణ సమీక్షలను నిర్వహించి, అటువంటి సమస్యలకు పరిష్కారాలను అంచనా వేయడం దీని విధి.

Post Comment