నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(28 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. పురావస్తు శాస్త్రవేత్తలు ఏ హరప్పా ప్రదేశంలో ఐదువేల సంవత్సరాల నాటి నీటి నిర్వహణ వ్యవస్థను కనుగొన్నారు?
- లోథాల్
- కాలిబంగన్
- రాఖీగర్హి
- రోపార్
సమాధానం
3. రాఖీగర్హి
2. ఏ భారత నావికాదళ నౌక మారిషస్‌లో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించింది?
- ఐఎన్ఎస్ శార్దూల్
- ఐఎన్ఎస్ సర్వేక్షణ
- ఐఎన్ఎస్ విక్రాంత్
- ఐఎన్ఎస్ కాందేరి
సమాధానం
2. ఐఎన్ఎస్ సర్వేక్షణ
3. దేశంలో ఏ విమానాశ్రయం ఉత్తమ దేశీయ విమానాశ్రయం బిరుదును పొందింది?
- ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
- ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
- మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
- కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
సమాధానం
3. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
4. మోరిగావ్‌లోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఏ రాష్ట్రం యాంటీ డిప్రెడేషన్ స్క్వాడ్‌లను ప్రవేశపెట్టింది?
- మణిపూర్
- ఒడిశా
- మధ్యప్రదేశ్
- అసోం
సమాధానం
4. అసోం
5. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ 2025కు ఏ దేశం హోస్ట్ చేస్తుంది?
- ఫ్రాన్స్
- ఇండియా
- చైనా
- రష్యా
సమాధానం
2. ఇండియా
6. 2024, డిసెంబర్‌లో నోరోవైరస్ వ్యాప్తిని ఏ దేశం నివేదించింది?
- ఫ్రాన్స్
- యునైటెడ్ స్టేట్స్
- చైనా
- రష్యా
సమాధానం
2. యునైటెడ్ స్టేట్స్
7. ఏడు ఖండాల్లో ఎత్తయిన శిఖరాలను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు ఎవరు?
- ప్రగతి బిస్త్
- కామ్య కార్తికేయన్
- సనయా గుప్తా
- కీర్తి రావత్
సమాధానం
2. కామ్య కార్తికేయన్
8. ఎథికల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆర్బీఐ కమిటీ చైర్మన్ ఎవరు?
- ఉర్జిత్ పటేల్
- రఘురాం రాజన్
- పుష్పక్ భట్టాచార్య
- నందన్ నీలేకని
సమాధానం
3. పుష్పక్ భట్టాచార్య
9. డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
- రఘురాం రాజన్
- ఉర్జిత్ పటేల్
- భట్టాచార్య
- రజత్ వర్మ
సమాధానం
4. రజత్ వర్మ
10. సోలార్ అగ్రికల్చర్ ఫీడర్ 2.0ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
- మహారాష్ట్ర
- బీహార్
- కర్ణాటక
- తమిళనాడు
సమాధానం
1. మహారాష్ట్ర
11. భారత సైన్యం లడఖ్‌లోని ఏ సరస్సు దగ్గర శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు?
- పాంగాంగ్
- ఇందిరా
- పులికాట్
- సాంబార్
సమాధానం
1. పాంగాంగ్
12. 13వ జాతీయ విత్తన కాంగ్రెస్‌ను 2024 నవంబర్ 28 నుంచి 30 వరకు ఏ నగరంలో నిర్వహించారు?
- హైదరాబాద్
- చెన్నై
- లక్నో
- వారణాసి
సమాధానం
4. వారణాసి
13. నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్ (ఎన్ఆర్ఐ) 2024 నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? (
- 35
- 40
- 49
- 51
సమాధానం
3. 49
14. 2024 డిసెంబరు 1 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా ఏ భారతీయుడు పదవీ బాధ్య తలు చేపట్టారు?
- జై షా
- అమిత్ షా
- గంగూలీ
- సచిన్
సమాధానం
1. జై షా
15. భారత్ ఇటీవల ఏ కాలానికిగాను యునైటెడ్ నేషన్స్ పీస్ బిల్డింగ్ కమిషన్ (పీబీసీ)కు తిరిగి ఎన్నికైంది?
- 2023-24
- 2024-25
- 2025-26
- 2026-27
సమాధానం
3. 2025-26
16. అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహి స్తారు?
- నవంబర్ 26
- నవంబర్ 27
- నవంబర్ 28
- నవంబర్ 29
సమాధానం
4. నవంబర్ 29
17. 2025- ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలును నరేంద్ర మోడీ తాజాగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
- ఉత్తరప్రదేశ్
- ఉత్తరాఖండ్
- హర్యానా
- గుజరాత్
సమాధానం
2. ఉత్తరాఖండ్
18. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించింది ఎవరు?
- గొంగడి త్రిష
- కమలిని
- సనిక
- ఆయుషి శుక్ల
సమాధానం
1. గొంగడి త్రిష
19. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఏ దేశ సైన్యానికి గౌరవ జనరల్‌గా నియమితులయ్యారు?
- నేపాల్
- మయన్మార్
- భూటాన్
- బంగ్లాదేశ్
సమాధానం
1. నేపాల్
20. భారత దేశపు మొదటి రాజ్యాంగ మ్యూజియంను ఇటీవల ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు?
- బనారస్ హిందూ యూనివర్సిటీ- వారాణసి
- అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ- అలీఘర్
- ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ-హర్యానా
- సెంట్రల్, అస్సాం యూనివర్సిటీ -అస్సాం
సమాధానం
3. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ-హర్యానా
21. ఇటీవల భారత్ ఏ నాలుగు యూరోపియన్ దేశాలతో కలసి చారిత్రక 'ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్(టీఈపీఏ)' ఒప్పందంపై సంతకం చేసింది?
- స్విట్జర్లాండ్,ఐస్‌లాండ్, నార్వే, లిచెన్ స్టీన్
- ఐస్‌లాండ్, జర్మనీ, ఇటలీ, నార్వే
- నార్వే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ
- స్విట్జర్లాండ్, నార్వే, ఇటలీ, లిచెన్ స్టీన్
సమాధానం
1. స్విట్జర్లాండ్,ఐస్‌లాండ్, నార్వే, లిచెన్ స్టీన్
22. 12వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ (ఐటీఎమ్)ను ఏ రాష్ట్రంలో కజిరంగా నేషనల్ పార్కులో నిర్వహించారు?
- కేరళ
- జార్ఖండ్
- ఒడిశా
- అస్సాం
సమాధానం
4. అస్సాం
23. గూగుల్ తన మొదటి 'గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)'ను స్థాపించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది?
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- తమిళనాడు
- కర్ణాటక
సమాధానం
2. తెలంగాణ
24. సెంట్రల్ విస్టా రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా 'యుగ యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియాన్ని' అభి వృద్ధి చేయడానికి భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ దేశ మ్యూజియాలతో ఒప్పందం కుదుర్చుకుంది
- ఇటలీ
- అమెరికా
- ఫ్రాన్స్
- జర్మనీ
సమాధానం
3. ఫ్రాన్స్
25. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ విభాగంలో యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులకు ఏ రాష్ట్రంలోని 'అబత్సహయేశ్వర ఆలయం' ఎంపికైంది?
- కర్ణాటక
- మహారాష్ట్ర
- కేరళ
- తమిళనాడు
సమాధానం
4. తమిళనాడు
26. 2025, జనవరి 29న భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఎన్నివ ప్రయోగాన్ని విజవంతంగా పూర్తిచేసింది?
- 95వ
- 97వ
- 99వ
- 100వ
సమాధానం
4. 100వ
27. 'నామ్‌దఫా టైగర్ రిజర్వ్' ఏ రాష్ట్రంలో ఉంది?
- అస్సాం
- అరుణాచల్ ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- జార్ఖండ్
సమాధానం
2. అరుణాచల్ ప్రదేశ్
28. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి?
- ఆంధ్రప్రదేశ్
- కర్ణాటక
- తెలంగాణ
- ఒడిశా
సమాధానం
3. తెలంగాణ
29. 'లెజిమ్' ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం?
- కర్ణాటక
- మహారాష్ట్ర
- కేరళ
- పశ్చిమ బెంగాల్
సమాధానం
2. మహారాష్ట్ర
30. డిజిటల్ వాణిజ్యాన్ని అవలంబించడంలో చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించేందుకు "MSME టీమ్ చొరవ"ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
- వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ
- ఆర్థిక మంత్రిత్వ శాఖ
- విద్యుత్ మంత్రిత్వ శాఖ
- సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సమాధానం
4. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ