నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(30 డిసెంబర్ 2024): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. భారత్ భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 ఏ అంతరిక్ష సంస్థ సహకారంతో నవంబర్ 19న ప్రయోగించారు?
- ఇస్రో
- నాసా
- జాక్సా
- స్పేస్ - EXP
సమాధానం
4. స్పేస్ - EXP
2. భారత్ తన మొదటి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి ప్లెట్ ట్రయల్‌ను ఎక్కడ నిర్వహించింది?
- శ్రీహరికోట
- కొచ్చి
- పోఖ్రాన్
- ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్
సమాధానం
4. ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్
3. మొదటి మిస్ వరల్డ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన 21 ఏళ్ల 'విక్టోరియా కెజార్ హెల్విగ్' ఏ దేశానికి చెందింది?
- నెదర్లాండ్స్
- డెన్మార్క్
- ఐస్‌లాండ్
- ఫిన్లాండ్
సమాధానం
2. డెన్మార్క్
4. ఏ మంత్రిత్వ శాఖ ఏఐ-ఏఐ ఎనేబుల్డ్ ఇ- తరంగ్ సిస్టమ్‌ను ప్రారంభించింది?
- మినిస్ట్రీ ఆఫ్ సైన్స్
- మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్
- మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
- మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
సమాధానం
3. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
5. దేశంలోని మొదటి డైరెక్టు టు డివైస్ శాటి లైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించిన టెలీకాం ఆపరేటర్ ఏది?
- జియో
- వొడాఫోన్
- బీఎస్ఎన్ఎల్
- ఎయిర్‌టెల్
సమాధానం
3. బీఎస్ఎన్ఎల్
6. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది?
- లిమా
- బీజింగ్
- టోక్యో
- టోక్యో
సమాధానం
1. లిమా
7. తమ ఇంటిగ్రేటెడ్ యాంటెన్నా సిస్టమ్ యునికార్న్‌ను భారత నౌకాదళ నౌకలకు అందించడానికి ఏ దేశం అంగీకరించింది?
- సింగపూర్
- ఫ్రాన్స్
- జపాన్
- రష్యా
సమాధానం
3. జపాన్
8. 'కమ్ అండ్ ఇన్‌స్టాల్' సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
- ఉత్తరాఖండ్
- హిమాచల్ ప్రదేశ్
- ఉత్తరప్రదేశ్
- పంజాబ్
సమాధానం
2. హిమాచల్ ప్రదేశ్
9. మూడీస్ రేటింగ్స్ ఆర్థిక సంవత్సరం 2024 కోసం దేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది?
- 7.3 శాతం
- 7.2 శాతం
- 7.1 శాతం
- 7.4 శాతం
సమాధానం
2. 7.2 శాతం
10. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఏ యాప్‌ను ప్రారంభించారు?
- Know your doctor
- Know your patient
- Know your hospital
- Know your medicine
సమాధానం
4. Know your medicine
11. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దేశీయ డెట్ క్యాపిటల్ మార్కెట్లలో 7.14 శాతం కూపన్ రేటుతో 10 బాండ్ల ద్వారా రూ.3,830 కోట్లను సమీకరించింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
- హైదరాబాద్
- ముంబయి
- చెన్నై
- న్యూఢిల్లీ
సమాధానం
4. న్యూఢిల్లీ
12. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఏ దేశంలోని మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో తన పుస్తకాన్ని 'వై భారత్ మేటర్స్' ను ఆవిష్కరించారు?
- దోహా
- దుబాయ్
- షార్జా
- అజ్మన్
సమాధానం
2. దుబాయ్
13. ఏ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం అవార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని మోదీకి ప్రదానం చేయనుంది?
- జపాన్
- ఇజ్రాయెల్
- ఒమన్
- డొమినికా
సమాధానం
4. డొమినికా
14. ఐఎస్ఏలో 105వ సభ్యదేశాన్ని గుర్తించండి?
- మొనాకో
- మొజాంబిక్
- మొరాకో
- మాల్డోవా
సమాధానం
4. మాల్డోవా
15. 2025 నుంచి భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది?
- కెనడా
- జపాన్
- జర్మనీ
- రష్యా
సమాధానం
4. రష్యా
16. ఆర్‌బీఐ జనవరి 1, 2025 నుంచి తాకట్టు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుంచి ఎంతకు పెంచింది?
- రూ.2 లక్షలు
- రూ.5 లక్షలు
- రూ.3 లక్షలు
- రూ.6 లక్షలు
సమాధానం
1. రూ.2 లక్షలు
17. మనదేశంలో మొదటిసారిగా డయాబెటిస్ బయో బ్యాంక్‌ని ఐసీఎంఆర్ ఎక్కడ ఏర్పాటు చేసింది?
- హైదరాబాద్
- చెన్నై
- న్యూఢిల్లీ
- జైపూర్
సమాధానం
2. చెన్నై
18. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం 'హిమ్ భోగ్ అట్టా' ప్రాజెక్టును ప్రారంభించింది?
- అస్సాం
- రాజస్థాన్
- హిమాచల్ ప్రదేశ్
- సిక్కిం
సమాధానం
3. హిమాచల్ ప్రదేశ్
19. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2024 (టీ-20) విజేత ఎవరు?
- విదర్భ
- ముంబయి
- బరోడా
- మధ్యప్రదేశ్
సమాధానం
2. ముంబయి
20. జంషెడ్ జీ టాటా పురస్కారం - 2024' ఎవరికి వచ్చింది?
- ఇంద్రానూయి
- నిర్మలా సీతారామన్
- కిరణ్ మజుందార్ షా
- సుధామూర్తి
సమాధానం
3. కిరణ్ మజుందార్ షా
21. మిఖైల్ కవెలాష్విలి ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు?
- ఇటలీ
- స్పెయిన్
- రుమేనియా
- జార్జియా
సమాధానం
4. జార్జియా
22. భారతదేశపు మొదటి యోగా విధానాన్ని ఏ రాష్ట్రం ప్రవేశ పెట్టనుంది?
- గుజరాత్
- రాజస్థాన్
- ఉత్తరాఖండ్
- తెలంగాణ
సమాధానం
3. ఉత్తరాఖండ్
23. ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ అవార్డ్స్ 2024' లో 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్' ఎవరికి వచ్చింది?
- అరీనా సబలెంకా (బెలారస్)
- కోకో గౌఫ్ (యూఎస్ఏ)
- లులుసున్ (న్యూజిలాండ్)
- ఎమ్మానవారో (యూఎస్ఏ)
సమాధానం
3.అరీనా సబలెంకా (బెలారస్)
24. టైమ్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్ - 2024' గా ఎవరు నిలిచారు?
- షేక్ హసీనా
- మోదీ
- డొనాల్డ్ ట్రంప్
- దలైలామా
సమాధానం
3.డొనాల్డ్ ట్రంప్
25. ‘దలైలామాస్ సీక్రెట్ టు హ్యాపీనెస్' పుస్తక రచయిత ఎవరు?
- డా. నళినీ గుప్తా
- డా. దినేష్ షహ్రా
- డా.గగన్ సింగ్
- డా. హైమావతి
సమాధానం
2. డా. దినేష్ షహ్రా
26. ఏ దేశం 2025లో జరగనున్న తొలి మహిళల అంధుల టీ-20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది?
- ఆస్ట్రేలియా
- చైనా
- బంగ్లాదేశ్
- ఇండియా
సమాధానం
4. ఇండియా
27. సెక్స్ వర్కర్‌లకు ఉద్యోగ కాంట్రాక్ట్, ఆరోగ్య బీమా, పెన్షన్, ప్రసూతి సెలవుల కోసం ఏ దేశం కొత్తగా చట్టం తీసుకొచ్చింది?
- బెల్జియం
- రష్యా
- స్పెయిన్
- కెనడా
సమాధానం
1. బెల్జియం
28. ఇటీవల భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను అశోక్ రాజ్ సిగ్గెల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆయన ఏ దేశ ఆర్మీ చీఫ్?
- భూటాన్
- మయన్మార్
- నేపాల్
- బంగ్లాదేశ్
సమాధానం
3. నేపాల్
29. ఏ దేశ కొత్త ప్రధానిగా ఇటీవల ఫాసువా బైరూ నియమితులయ్యారు?
- ఇటలీ
- ఫ్రాన్స్
- జర్మనీ
- స్పెయిన్
సమాధానం
2. ఫ్రాన్స్
30. సెనెగల్‌లోని డాకర్‌లో 2026లో జరిగే యూత్ ఒలింపిక్స్‌లో ఏ క్రీడలను తొలగించారు?
- హాకీ
- షూటింగ్
- వెయిట్ లిఫ్టింగ్
- పైవన్నీ
సమాధానం
4. పైవన్నీ