ఆఫ్రికా జనాభా పరంగా, విస్తరణ పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. దాదాపు 30.3 మిలియన్ కిమీ విస్తీర్ణంలో భూమి యొక్క మొత్తం ఉపరితల వైశాల్యంలో 6% మరియు భూభాగంలో 20% ఆక్రమించింది ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18% మంది ఆఫ్రికాలో ఉన్నారు.
ఈ ఖండం ఉత్తరాన మధ్యధరా సముద్రం , ఈశాన్యంలో సూయెజ్ మరియు ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం మరియు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. మడగాస్కర్ వంటి వివిధ ద్వీపసమూహాలు ఆఫ్రికాలో భాగంగా ఉన్నాయి.
ఆఫ్రికా మీదగా భూమధ్యరేఖ మరియు ప్రైమ్ మెరిడియన్ ప్రయాణిస్తాయి. ఉత్తర సమశీతోష్ణ ప్రాంతం నుండి దక్షిణ సమశీతోష్ణ మండలాల వరకు విస్తరించి ఉన్న ఏకైక ఖండం ఇది మాత్రమే. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ భాగం ఉత్తర అర్ధగోళంలో ఉన్నాయి
54 ఆఫ్రికా దేశాలు మరియు వాటి రాజధానులు
ఆఫ్రికాలో మొత్తం 56 పైగా దేశాలు ఉన్నాయి. ఇందులో 48 దేశాలు ఆఫ్రికా ప్రధాన భూభాగాన్ని పంచుకుంటాయి. ఆరు ద్వీప దేశాలు ఖండంలో భాగంగా పరిగణించబడతాయి. మరో రెండు వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి.
- ఆఫ్రికాలో మొత్తంలో అతి చిన్న దేశంగా సీషెల్స్ ఉంది. అయితే గాంబియా ఖండాంతర ఆఫ్రికాలో అతి చిన్న దేశంగా పరిగణించబడుతుంది.
- ఆఫ్రికాలో అతి పెద్ద దేశంగా అల్జీరియా ఉంది.
- ఆఫ్రికాలో అతిపెద్ద నగరం కైరో
- ఆఫ్రికాలోని 3 అతిపెద్ద దేశాలు అల్జీరియా, కాంగో, సూడాన్
- ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా
- తలసరి ఆదాయం పరంగా ఆఫ్రికాలో అత్యంత సంపన్న దేశం సీషెల్స్
- జీడీపీ పరంగా ఆఫ్రికాలో అత్యంత సంపన్న దేశం నైజీరియా
నెం | దేశం | రాజధాని | కరెన్సీ | భాషలు |
---|---|---|---|---|
1 | అల్జీరియా | అల్జీర్స్ | అల్జీరియన్ దినార్ (DZD) | అరబిక్ • బెర్బెర్ |
2 | అంగోలా | లువాండా | క్వంజా (AOA) | పోర్చుగీస్ |
3 | బెనిన్ | పోర్టో-నోవో | ఫ్రాంక్ (XOF) | ఫ్రెంచ్ |
4 | బోట్స్వానా | గాబోరోన్ | పులా (BWP) | ఇంగ్లీష్ & సెట్స్వానా |
5 | బుర్కినా | ఫాసో వాగడూగు | ఫ్రాంక్ (XOF) | ఫ్రెంచ్ & మావోరే |
6 | బురుండి | గితేగా & బుజుంబురా | బురుండి ఫ్రాంక్ (BIF) | కిరుండి & ఫ్రెంచ్ |
7 | కామెరూన్ | యౌండే | ఫ్రాంక్ (XAF) | ఇంగ్లీష్, కామెరూనియన్ |
8 | కేప్ వర్దె | ప్రియా | ఎస్కుడో (CVE) | పోర్చుగీస్ |
9 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | బాంగూయి | ఫ్రాంక్ (XAF) | ఫ్రెంచ్ & సాంగో |
10 | చాడ్ | ఎన్'జమేనా | ఫ్రాంక్ (XAF) | అరబిక్ & ఫ్రెంచ్ |
11 | కొమొరోస్ | మోరోని | ఫ్రాంక్ (KMF) | కొమోరియన్ అరబిక్ |
12 | కాంగో రిపబ్లిక్ | బ్రజ్జావిల్లే | ఫ్రాంక్ (XAF) | ఫ్రెంచ్, కితుబా, లింగాల |
13 | కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | కిన్షాసా | కాంగో ఫ్రాంక్ (CDF) | ఫ్రెంచ్, కితుబా, లింగాల |
14 | జిబౌటి | జిబౌటి | జిబౌటియన్ ఫ్రాంక్ (DJF) | ఫ్రెంచ్ అరబిక్ |
15 | ఈజిప్ట్ | కైరో | ఈజిప్టు పౌండ్ (EGP) | అరబిక్ |
16 | ఈక్వటోరియల్ గినియా | మాలాబో | ఫ్రాంక్ (XAF) | స్పానిష్ & పోర్చుగీస్ |
17 | ఎరిట్రియా | అస్మారా | నక్ఫా (ERN) | టిగ్రిన్యా & ఇంగ్లీష్ |
18 | స్వాజిలాండ్ | లోబాంబ & బాబనే | SZL & ZAR | స్వాజి & ఇంగ్లీష్ |
19 | ఇథియోపియా | అడిస్ అబాబా | బిర్ర్ (ETB) | అఫర్ & అమ్హారిక్ |
20 | గాబన్ | లిబ్రేవిల్లే | ఫ్రాంక్ (XAF) | ఫ్రెంచ్ |
21 | గాంబియా | బంజుల్ | దలాసి (GMD) | ఇంగ్లీష్ |
22 | ఘనా | అక్ర | సెడి (GHS) | ఇంగ్లీష్ & అహంత |
23 | గినియా | కోనక్రీ | గినియా ఫ్రాంక్ (GNF) | ఫ్రెంచ్ |
24 | గినియా-బిసావు | బిసావు | ఫ్రాంక్ (XOF) | పోర్చుగీస్ |
25 | ఐవరీ కోస్ట్ | యమౌసౌక్రో | ఫ్రాంక్ (XOF) | ఫ్రెంచ్ |
26 | కెన్యా | నైరోబి | కెన్యా షిల్లింగ్ (KES) | ఇంగ్లీష్ & స్వాహిలి |
27 | లెసోతో | మసేరు | LSL & ZAR | లెసోతో & ఇంగ్లీష్ |
28 | లైబీరియా | మన్రోవియా | డాలర్ (LRD) | ఇంగ్లీష్ |
29 | మడగాస్కర్ | అంటాననారివో | అరియరీ (MGA) | మాలాగసీ & ఫ్రెంచ్ |
30 | మాలావి | లిలోంగ్వే | క్వాచా (MWK) | ఇంగ్లీష్, చేవా, యావో |
31 | మాలి | బమాకో | ఫ్రాంక్ (XOF) | ఫ్రెంచ్ |
32 | మౌరిటానియా | నయూవాక్కాట్ | ఓగుయా (MRU) | అరబిక్ & ఫ్రెంచ్ |
33 | మారిషస్ | పోర్ట్ లూయిస్ | రూపాయి (MUR) | ఇంగ్లీష్ & ఫ్రెంచ్ |
34 | మొరాకో | ర్యాబేట్ | దిర్హామ్ (MAD) | మొరాకో అరబిక్ |
35 | మొజాంబిక్ | మాపుటో | మెటికల్ (MZN) | పోర్చుగీస్ |
36 | నమీబియా | విండ్‌హోక్ | NAD & ZAR | ఇంగ్లీష్ & ఆఫ్రికన్ |
37 | నైజర్ | నియామీ | ఫ్రాంక్ (XOF) | ఫ్రెంచ్ & అరబిక్ |
38 | నైజీరియా | అబుజా | నైరా (NGN) | ఫ్రెంచ్ & హౌసా |
39 | రువాండా | కిగాలి | ర్వాండన్ ఫ్రాంక్ (RWF) | ఫ్రెంచ్ & ఇంగ్లీష్ |
40 | సెయింట్ హెలెనా | జేమ్స్టౌన్ | పౌండ్ (SHP) | ఇంగ్లీష్ |
41 | సావో టోమ్ & ప్రిన్సిపీ | సావో టోమ్ | దోబ్ర (STN) | లైనింగ్ & పోర్చుగీస్ |
42 | సెనెగల్ | డాకర్ | ఫ్రాంక్ (XOF) | ఫ్రెంచ్ |
43 | సీషెల్స్ | విక్టోరియా | రూపాయి (SCR) | ఇంగ్లీష్ & ఫ్రెంచ్ |
44 | సియర్రా లియోన్ | ఫ్రీటౌన్ | లియోన్ (SLL) | ఇంగ్లీష్ & క్రియో |
45 | సోమాలియా | మొగాడిషు | సోమాలి షిల్లింగ్ (SOS) | సోమాలి & అరబిక్ |
46 | సోమాలిలాండ్ | హర్గీసా | సోమాలి షిల్లింగ్ (SOS) | సోమాలి & అరబిక్ |
47 | సౌత్ ఆఫ్రికా | ప్రిటోరియా, కేప్ టౌన్ & బ్లూమ్‌ఫోంటైన్ | దక్షిణాఫ్రికా రాండ్ (ZAR) | ఇంగ్లీష్ |
48 | సౌత్ సూడాన్ | జుబా | సూడాన్ పౌండ్ (SSP) | ఇంగ్లీష్ & అరబిక్ |
49 | సుడాన్ | ఖార్టూమ్ | సుడానీస్ పౌండ్ (SDG) | ఇంగ్లీష్ & అరబిక్ |
50 | టాంజానియా | డోడోమా | షిల్లింగ్ (TZS) | ఇంగ్లీష్ & స్వాహిలి |
51 | టోగో | లోమే | ఫ్రాంక్ (XOF) | ఫ్రెంచ్ |
52 | ట్యునీషియా | ట్యూనిస్ | దినార్ (TND) | అరబిక్ |
53 | ఉగాండా | కంపాలా | షిల్లింగ్ (UGX) | ఇంగ్లీష్ & స్వాహిలి |
54 | సహ్రావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ | లాయౌన్ | మొరాకో దిర్హామ్ అకిక్ | స్పానిష్ |
55 | జాంబియా | లుసాకా | క్వాచా (ZMW) | ఇంగ్లీష్ |
56 | జింబాబ్వే | హరారే | జింబాబ్వే డాలర్ | చేవా, చిబార్వే, ఇంగ్లీష్ |