Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 20 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 20 మార్చి 2024

20 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

రతన్ టాటాకు పీవీ నరసింహారావు స్మారక పురస్కారం

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు ప్రతిష్టాత్మకమైన పివి నరసింహారావు స్మారక పురస్కారం లభించింది. తన దాతృత్వం, టాటా ట్రస్ట్‌లు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణం కోసం ఆయన చేసిన విశేష సేవల కోసం ఈ అవార్డు అందించబడింది.

టాటా సన్స్ ఛైర్మన్‌గా అనేక సంవత్సరాలు పనిచేసిన రతన్ టాటా, కార్పొరేట్ ప్రపంచంలో అతని గొప్ప నాయకత్వానికి విస్తృతంగా ప్రశంసించబడ్డారు. అయినప్పటికీ, సాంఘిక సంక్షేమం మరియు మానవతా ప్రయత్నాల పట్ల అతని అంకితభావం ఇటీవలి సంవత్సరాలలో అతనికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

  • రతన్ టాటా 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా సేవలు అందించారు.
  • రతన్ టాటా 2000లో పద్మ భూషణ్, 2008లో భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నారు.
  • టాటా 2006లో  మహారాష్ట్ర భూషణ్, 2021లో  అస్సాం బైభవ్  రాష్ట్రస్థాయి గౌరవాలను కూడా అందుకున్నారు.
  • గత ఏడాది కింగ్ చార్లెస్ III నుండి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా కూడా అందుకున్నారు.

పివి నరసింహారావు స్మారక పురస్కారం అనేది సాంఘిక సంక్షేమం మరియు మానవతా కారణాల పట్ల అసాధారణమైన అంకితభావాన్ని ప్రదర్శించే వ్యక్తులకు అందించే పురస్కారం. ఇది పివి నరసింహారావు స్మారకార్థం ఇటీవలే ఏర్పాటు చేయబడింది.

ఢిల్లీలో భారత నౌకాదళ ప్రధాన కార్యాలయం ' నౌసేనా భవన్' ప్రారంభం

ఢిల్లీ కంటోన్మెంట్‌లో కొత్తగా భారత నౌకాదళానికి నిర్మించిన నౌసేనా భవన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మార్చి 15న లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త అత్యాధునిక భవన్ ఇండియన్ నేవీ యొక్క ప్రధాన కార్యాలయంగా ఉండనుంది. ఇంతకు ముందు నేవీ 13 వేర్వేరు కార్యాలయ ప్రదేశాల నుండి పనిచేసేది. వీటి స్థానంలో నౌసేనా భవన్ ఏకీకృత మరియు ఉద్దేశ్య-నిర్మిత సదుపాయంగా ఉపయోగపడనుంది.

నౌసేనా భవన్ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో నిర్మించబడింది. ఇది భద్రతా మరియు యుటిలిటీ సిస్టమ్‌ల సమర్థవంతమైన సమన్వయం మరియు పర్యవేక్షణ మెకానిజం కలిగిఉంది. ఈ కార్యాలయం వాహనాలకు ఆటోమేటిక్ అండర్ బెల్లీ స్కానింగ్ చేసే సదుపాయంతో పాటుగా పవర్ ఫెన్స్, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు, బొల్లార్డ్స్, వెహికల్ స్టాపర్స్, యాక్సెస్ కంట్రోల్ మరియు సెక్యూరిటీ కెమెరాల వంటి అత్యాధునిక సాంకేతికతలతో సహా సమగ్రమైన మూడు-స్థాయి భద్రతా వ్యవస్థను కలిగి ఉంది.

నౌసేనా భవన్‌లో యూపీఎస్ సిస్టమ్‌ల మద్దతుతో విస్తృతమైన ఐటీ మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి, కాగితం రహిత పని వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. నేవీ యొక్క కఠినమైన నెట్‌వర్క్ అవసరాలను తీరుస్తుంది. ఈ భవన్ శక్తి మరియు నీటి సంరక్షణ ప్రయత్నాలలో భాగంగా సౌర ఉత్పత్తి వ్యవస్థలు మరియు అధునాతన నీటి నిర్మాణ వ్యవస్థలతో ఏకీకృతం చేయబడింది.

నౌసేనా భవన్‌ ఇంటిగ్రేటెడ్ హాబిటబిలిటీ అసెస్‌మెంట్ (GRIHA IV) కింద గ్రీన్ రేటింగ్ IVని సాధించింది. ఈ భవనం యొక్క రూపకల్పన ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలు మరియు అంతర్గత ప్రాంగణాల ద్వారా సహజ అంశాలతో ఏకీకరణను నొక్కి చెబుతుంది.

తెలంగాణలోని పాండవుల గుట్టకు ప్రత్యేక జియో-హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్ట, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ప్రత్యేక జియో-హెరిటేజ్ సైట్‌ గుర్తింపు అందుకుంది. తద్వారా ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర మొదటి అధికారిక జియో-హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడింది. ఈ గుర్తింపు తెలంగాణ విశిష్ట భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ చొరవను ప్రకటించింది.

  • పాండవుల గుట్ట, హిమాలయ కొండల కంటే పురాతనమైన భౌగోళిక అద్భుతంగా పరిగణించబడుతుంది.
  • ఈ సైట్ మొదటిసారి 1990 సంవత్సరంలో కనుగొనబడింది.
  • ఈ ప్రదేశం, మెసోలిథిక్ కాలం (సుమారు 10,000 బీసీఈ) నుండి మధ్యయుగ కాలంకు చెందినదిగా భావించబడుతుంది.
  • ఈ ప్రదేశం మెసోలిథిక్ కాలంకు సంబందించిన అనేక రాతి ఆశ్రయాలకు మరియు మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలకు ప్రసిద్ధి చెందింది.
  • ఈ గృహాల గోడలపై రాక్ ఆర్ట్ పెయింటింగ్‌లు బైసన్, జింక, పులి, చిరుతపులి మొదలైన వన్యప్రాణుల చిత్రాలు చెక్కబడి ఉంటాయి.
  • ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి యొక్క భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ప్రదేశం.

పాండవుల గుట్టలోని గుహలు మరియు రాక్ షెల్టర్లు మానవ నివాసానికి సంబంధించిన గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి. ఈ ప్రత్యేక వారసత్వ ప్రదేశాన్ని భవిష్యత్ తరాలకు సంరక్షించవలసిన అవసరాన్ని ఈ హోదా హైలైట్ చేస్తుంది.

రామ్‌గఢ్ క్రేటర్‌ను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన రాజస్థాన్ ప్రభుత్వం

రాజస్థాన్ ప్రభుత్వం బరన్ జిల్లాలోని రామ్‌గఢ్ క్రేటర్‌ను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని నమ్ముతున్న ఈ బిలం, దేశంలోనే మూడవది మరియు రాష్ట్రంలో మొదటిదిగా గుర్తింపు పొందింది. మహారాష్ట్రలోని చంద్ర బిలం మరియు మధ్యప్రదేశ్‌లోని ధలా క్రేటర్ మిగిలిన రెండు బిలాలుగా ఉన్నాయి.

3.5 కి.మీ వ్యాసం కలిగిన ఈ బిలం 600 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరిక్షం నుండి ఒక ఉల్క పడిపోయిన తర్వాత ఏర్పడిందని నమ్ముతారు. బరన్ జిల్లాలోని మాంగ్రోల్ తహసీల్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బిలం 1869లో తొలిసారి కనుగొనబడింది. రామ్‌ఘర్ బిలం ప్రపంచ జియో-హెరిటేజ్‌లో 200వ బిలంగా గుర్తించబడింది.

  • రామ్‌గఢ్ బిలం రాజస్థాన్ ప్రభుత్వంచే జియో-హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడిన మొదటి స్థలం.
  • ఉల్కాపాతం వల్ల ఏర్పడిన ఈ బిలం సుమారు 165 మిలియన్ సంవత్సరాల నాటిదని అంచనా వేయబడింది.
  • క్రేటర్‌లో సాధారణం కంటే ఎక్కువ ఇనుము, నికెల్ మరియు కోబాల్ట్ కనుగొనబడ్డాయి.
  • సాధారణంగా గ్రహశకలాలలో ఇలా అధిక పరిమాణంలో ఈ మూలకాలను కలిగి ఉంటాయి.
  • బిలం చుట్టూ ఉన్న ప్రాంతం చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, 10వ శతాబ్దపు శివాలయం ఖజురహో నిర్మాణ శైలిని ఇది గుర్తు చేస్తుంది.
  • ఈ నిర్మాణం లోపల రెండు సరస్సులు ఉన్నాయి, ఇవి అనేక వలస పక్షులకు సహజ ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి.
  • 950 ఏళ్ల నాటి దేవి ఆలయంతో పాటు చాలా పురాతన ఆలయాలు మరియు కెల్పురి సమాధి స్థల్ కూడా ఇక్కడ ఉంది.

ఈ హోదా రామ్‌గఢ్‌ను భౌగోళిక-పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని రాజస్థాన్ ప్రభుత్వం రూ.57.22 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక ప్రకటించింది. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చిన తర్వాత, ప్రతి సంవత్సరం 30,000 నుండి 40,000 మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని రాజస్థాన్ టూరిజం శాఖ అంచనా వేస్తుంది.

హిమాచల్ ప్రదేశ్‌లో 'మిషన్ 414' ప్రచారాన్ని ప్రారంభించిన ఎన్నికల సంఘం

2019 లోక్‌సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లో తక్కువ పోలింగ్ నమోదైన 414 పోలింగ్ స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల సంఘం "మిషన్ 414" ను ప్రారంభించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 60 శాతం కంటే తక్కువ ఓటింగ్‌ నమోదైన ఈ 414 గుర్తించిన పోలింగ్‌ స్టేషన్లలో ఓట్ల శాతాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగనుంది.

హిమాచల్ ప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనీష్ గార్గ్ ఈ చొరవను ప్రకటించారు. ఇందులో భాగంగా మిషన్ 414 కింద, గుర్తించబడిన అన్ని పోలింగ్ స్టేషన్‌లను మోడల్ పోలింగ్ స్టేషన్‌లుగా మార్చనున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. యువత భాగస్వామ్యాన్ని ఉత్తేజపరిచేందుకు, ఈ పోలింగ్ బూత్‌లలో మొదటిసారిగా ఓటు వేసిన వారి నుండి బూత్ యూత్ ఐకాన్‌లను నియమించనున్నారు.

అంతేకాకుండా, 'ఎస్, నేను ఓటు వేస్తాను' అనే థీమ్‌తో రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో 'పోల్ బహిష్కరణ' యొక్క చారిత్రక సమస్యలను పరిష్కరించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి తమ నిబద్ధతను ప్రతిజ్ఞ చేసేలా ఓటర్లను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది.

సికిల్ సెల్ వ్యాధికి మొదటి గది ఉష్ణోగ్రత మందు

అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సికిల్ సెల్ డిసీజ్ (ఎస్సిడి)కి వ్యతిరేక పోరాటంలో గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించింది. ఈ సంస్థ సికిల్ సెల్ వ్యాధి చికిత్స కోసం మొదటి గది ఉష్ణోగ్రత మందును అభివృద్ధి చేసింది. ఈ ఔషధం సికిల్ సెల్ వ్యాధికి భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ, గది-ఉష్ణోగ్రత స్థిరమైన పరిష్కారాన్ని సూచిస్తుంది.

ఈ మొదటి స్వదేశీ హైడ్రాక్సీయూరియా ఓరల్ సస్పెన్షన్‌ను గ్లోబల్ ధరలో 1 శాతం ఖర్చుతో ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఔషధం కోల్డ్ స్టోరేజ్ అవసరాన్ని తొలగిస్తుంది. ఇది భారతదేశం అంతటా సికిల్ సెల్ రోగులకు మరింత సరసమైన ధరకు అందుబాటులోకి రానుంది.

  • హైడ్రాక్సీయూరియా ఓరల్ సస్పెన్షన్ (Hydroxyurea Oral Suspension) పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు మరియు 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సికిల్ సెల్ సిండ్రోమ్ యొక్క రోగలక్షణ నిర్వహణ కోసం ఉపయోగించబడుతుంది.
  • అకుమ్స్ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్ గది ఉష్ణోగ్రత (25 ° C) వద్ద స్థిరంగా నిల్వ వుంచుకోవచ్చు.
  • ఇంతకుముందు హైడ్రాక్సీయూరియా ఓరల్ సస్పెన్షన్ మందులు 2-8 ° C ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉండేది.
  • ఈ మందు కేవలం రూ.600-800లకే అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. అంటే ఇది గ్లోబల్ ధరలో 1 శాతం ఖర్చుతో అందుబాటులోకి రానుంది.
  • ఈ సంస్థ నెలకు 2 కోట్ల బాటిళ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగివున్నట్లు పేర్కొంది.

సికిల్ సెల్ వ్యాధి అనేది హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేసే వారసత్వంగా వచ్చే రక్త రుగ్మత. ఇది ఎర్ర రక్త కణాల ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఒకరకమైన జన్యుపరమైన రుగ్మత, దీనిలో ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారుతాయి.

ఈ వ్యాధి హీమోగ్లోబిన్ ఎస్ అని పిలువబడే లోపభూయిష్ట హిమోగ్లోబిన్ ప్రోటీన్‌కు దారితీస్తుంది. హిమోగ్లోబిన్ ఎస్ అనువైన ఎర్ర రక్త కణాలను దృఢమైన, కొడవలి ఆకారపు కణాలుగా మారుస్తుంది. ఈ కొడవలి కణాలు రక్త ప్రవాహాన్ని నిరోధించి, నొప్పి, అలసట ఇన్ఫెక్షన్లకు కారణమై అవయవాలకు హాని కలిగిస్తుంది.

సికిల్ సెల్ వ్యాధి కొన్ని జాతుల సమూహాలలో సర్వసాధారణం. ఇది ఎక్కువగా ఆఫ్రికన్-అమెరికన్లతో సహా ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తుల (వీరిలో ప్రతి 12 మందిలో 1 సికిల్ సెల్ జన్యువును కలిగి ఉంటారు)లో కనిపిస్తుంది. అలానే మధ్య మరియు దక్షిణ అమెరికా నుండి వచ్చిన హిస్పానిక్-అమెరికన్లు, మధ్యప్రాచ్య, ఆసియా, భారతీయ మరియు మధ్యధరా సంతతికి చెందిన వ్యక్తులలో ఇది కనిపిస్తుంది.

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘనవిజయం

15 మార్చి 2024న జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికలలో వ్లాదిమిర్ పుతిన్ ఘనవిజయం సాధించి వరుసగా ఐదవసారి అధికారంలో నిలిచారు. విశ్వసనీయమైన ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేని ఈ ఎన్నికలలో పుతిన్‌ 87% ఓట్లను దక్కించుకున్నారు. కమ్యూనిస్ట్ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ కేవలం 4% కంటే తక్కువ ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు, కొత్తగా వచ్చిన వ్లాడిస్లావ్ దావన్కోవ్ మూడవ స్థానంలో నిలిచారు. పుతిన్ వచ్చే ఆరేళ్ళ కాలానికి రష్యా అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 71 ఏళ్ళు.

ఈ అధ్యక్ష ఎన్నికలలో చరిత్రలో అత్యధికంగా 74% ఓటర్లు పోలింగ్‌ నమోదైనట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది. పుతిన్ మునుపటి 2018 ఎన్నికలలో 67.5% ఓటింగ్ పోల్ అవ్వగా ఆయన 76.7% ఓట్లను దక్కించుకున్నారు. గత నెలలో ఆర్కిటిక్ జైలులో ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ మరణం తర్వాత ఈ ఎన్నికలలో సరైన ప్రత్యర్థి పోటీలో నివ్వలేదు. దాదాపు 80 పైగా ప్రతిపక్ష నాయకులు రష్యాయన్ జైళ్లులలో ఉన్నట్లు సమాచారం.

  • పుతిన్ 1999 నుండి రష్యన్ ప్రెసిడెంట్ లేదా ప్రధాన మంత్రిగా నిరంతర పదవులలో కొనసాగుతున్నారు.
  • ఆయన 1999 నుండి 2000 వరకు మరియు 2008 నుండి 2012 వరకు ఆ దేశ ప్రధాన మంత్రిగా సేవలు అందించారు.
  • 2000 నుండి 2008 వరకు మరియు 2012 నుండి ప్రస్తుతం వరకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
  • పుతిన్, మజోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యన్ లేదా సోవియట్ నాయకుడిగా పని చేసిన ఘనత దక్కించుకున్నాడు.
  • ఈ ఎన్నికలు ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగంలో కూడా నిర్వహించింది.

అయితే తాజా ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా లేదా నిష్పక్షపాతంగా జరగలేదని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. 2022లో ఉక్రెయిన్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత పుతిన్ రాజకీయ అణచివేతలను పెంచడంతో అంతర్జాతీయ పరిశీలకులు ఈ ఎన్నికలు స్వేచ్ఛగా లేదా న్యాయంగా జరిగాయని భావించడంలేదు.

జర్మనీ ఈ ఎన్నికలను "సూడో-ఎలక్షన్" అని పేర్కొంది. సెన్సార్‌షిప్, అణచివేత మరియు హింసపై ఆధారపడిన నిరంకుశ పాలకుడి క్రింద ఈ ఎన్నికలు జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. యూకే విదేశాంగ కార్యదర్శి లార్డ్ కామెరాన్ ఉక్రెయిన్ భూభాగంలో ఎన్నికలను చట్టవిరుద్ధంగా నిర్వహించడాన్న ఖండించారు.

యుఎస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఈ ఎన్నికలు స్పష్టంగా స్వేచ్ఛగా లేదా న్యాయంగా లేవుని పేర్కొన్నారు. పుతిన్ తన రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టి, అతనికి వ్యతిరేకంగా పోటీ చేయకుండా నిరోధించి ఈ ఎన్నికలలో విజయం సాధించినట్లు తెలిపారు. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పుతిన్ అధికారానికి బానిస అయ్యారని అన్నారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ మార్చి 20న ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. గత గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఈ పదవికి రాజీనామా చేయడంతో, ఆ స్థానంలో ఈయన నియమితులయ్యారు.

గతంలో తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ అదనపు బాధ్యతలు కూడా రాధాకృష్ణన్‌కు అప్పగించారు. కోయంబత్తూరు నుండి బిజెపి ఎంపీగా ఎన్నికయిన ఈయన, 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యారు. రాధాకృష్ణన్ క్రియాశీల రాజకీయాల్లో చేరడానికి ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సేవలు అందించారు.

సీపీ రాధాకృష్ణన్‌ తెలంగాణ రాష్ట్ర మూడో గవర్నర్‌గా వచ్చే ఐదేళ్ల కాలానికి సేవలు అందించనున్నారు. మరోవైపు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో తమిళిసై సౌందరరాజన్ బీజేపీలో చేరారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో ఆమె మరోమారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.

Post Comment