రాష్ట్రాల వారీగా లోక్‌సభ మరియు రాజ్యసభ స్థానాలు
Telugu Gk

రాష్ట్రాల వారీగా లోక్‌సభ మరియు రాజ్యసభ స్థానాలు

  • భారత పార్లమెంటు లోక్‌సభ (దిగువ సభ మరియు రాజ్యసభ (ఎగువ సభ) తో రూపొందించబడి ఉంటుంది.
  • లోక్‌సభలో ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో కిలిపి మొత్తం 545 పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) ఉంటారు.
  • అయితే రాజ్యాంగంలోని 104వ సవరణ ద్వారా ఆంగ్లో - ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వు చేయబడిన రెండు నామినేటెడ్ స్థానాలను రద్దు చేశారు.
  • ప్రతి పార్లమెంటు సభ్యుడు దేశంలోని ఒక భౌగోళిక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు.
  • వీరిలో 28 రాష్ట్రాల నుండి 524 మంది, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 19 ఎంపీలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
  • లోక్‌సభ కాలపరిమితి గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహిస్తారు.
  • భారత రాజ్యసభలో మొత్తం 245 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • వీటిలో 12 నామినేటెడ్ సీట్లు ఉంటాయి. ఈ సీట్లు కళ, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రానికి చేసిన కృషికి రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.
  • రాజ్యసభను పెద్దల సభ లేదా శాశ్వత సభ అని అంటారు.
  • మొత్తం 238 మందిలో మూడింట ఒక వంతు మంది ప్రతి రెండు సంవత్సరాలకు ఎన్నుకోబబడతారు.
  • అయితే దీని సభ్యుల పదవి కాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. తద్వారా సభ శాశ్వతంగా ఉంటుంది.
  • దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 4123 శాసన సభ్యులు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నుకోబడుతారు.
  • శాసనసభ కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
భారత రాష్ట్రాల వారీగా మొత్తం లోక్‌సభ, రాజ్యసభ మరియు అసెంబ్లీ సీట్లు
క్ర.స రాష్ట్రం/యూటీ లోక్‌సభ సీట్లు అసెంబ్లీ సీట్లు రాజ్యసభ సీట్లు
1 ఆంధ్రప్రదేశ్ 25 175 11
2 అరుణాచల్ ప్రదేశ్ 2 60 1
3 అస్సాం 14 126 7
4 బీహార్ 40 243 16
5 ఛత్తీస్‌గఢ్ 11 90 5
6 గోవా 2 40 1
7 గుజరాత్ 26 182 11
8 హర్యానా 10 90 5
9 హిమాచల్ ప్రదేశ్ 4 68 3
10 జార్ఖండ్ 14 81 6
11 కర్నాటక 28 224 12
12 కేరళ 20 140 9
13 మధ్యప్రదేశ్ 29 230 11
14 మహారాష్ట్ర 48 288 19
15 మణిపూర్ 2 60 1
16 మేఘాలయ 2 60 1
17 మిజోరం 1 40 1
18 నాగాలాండ్ 1 60 1
19 ఎన్సిటీ ఢిల్లీ 7 70 3
20 ఒడిషా 21 147 10
21 పుదుచ్చేరి 1 30 1
22 పంజాబ్ 13 117 7
23 రాజస్థాన్ 25 200 10
24 సిక్కిం 1 32 1
25 తమిళనాడు 39 234 18
26 తెలంగాణ 17 119 7
27 త్రిపుర 2 60 1
28 ఉత్తర ప్రదేశ్ 80 403 31
29 ఉత్తరాఖండ్ 5 70 3
30 జమ్మూ & కాశ్మీర్ 5 90 4
31 పశ్చిమ బెంగాల్ 42 294 16
32 6 కేంద్రపాలిత ప్రాంతాలకు 6
33 రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు 12
34 లోక్‌సభలో నామినేటెడ్ సభ్యులు 2
మొత్తం సీట్లు 545 4123 245

Advertisement

Advertisement

Post Comment