బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ | జనవరి 2022
Telugu Current Affairs

బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ | జనవరి 2022

జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ ఎండీ & సీఈఓగా బల్దేవ్ ప్రకాష్‌

జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా బలదేవ్ ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. గత ఏది అక్టోబరులో రిజర్వ్ బ్యాంకు  బలదేవ్ ప్రకాష్ ను జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా నియమించేందుకు అనుమతి ఇచ్చింది. బలదేవ్ ప్రకాష్ బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ళ అనుభవం కలిగివున్నారు.

Advertisement

విస్తారా ఎయిర్‌లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా వినోద్ కన్నన్

వినోద్ కన్నన్ ఎయిర్‌లైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( సీఈఓ ) గా బాధ్యతలు స్వీకరించినట్లు విస్తారా ప్రకటించింది. కన్నన్ జూన్ 2019లో చీఫ్ స్ట్రాటజీ ఆఫీస్‌గా విస్తారాతో తన ప్రయాణం ప్రారంభించారు, జనవరి 2020లో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022 జనవరిలో సీఈఓ నిమితులయ్యారు.

$3 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను తాకినా మొదటి యూఎస్ సంస్థగా ఆపిల్

యూఎస్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ $3 ట్రిలియన్ల స్టాక్ మార్కెట్ విలువను తాకిన మొదటి కంపెనీగా అవతరించింది. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ జాబ్స్ 2007లో మొదటి ఐఫోన్‌ను ఆవిష్కరించినప్పటి నుండి ఈ సంస్థ యొక్క షేర్ ధర దాదాపు 5,800% పెరిగింది. జనవరి 3, 2022న ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది.

ఆపిల్ ఇదివరకే ఆగస్టు 2018 మరియు ఆగస్టు 2020లో వరుసగా $1 ట్రిలియన్ మరియు $2 ట్రిలియన్‌లను అధిగమించిన మొదటి కంపెనీగా రికార్డు దక్కించుకుంది. జూలై 2020లో సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో మార్కెట్ విలువ దాటిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఆపిల్ అవతరించింది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు షెడ్యూల్ బ్యాంకు హోదా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్బీఐ యొక్క రెండవ షెడ్యూల్‌లో చేర్చినట్లు ప్రకటించింది. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ఆశాజనకమైన ఫలితాలు కనబర్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పేటీఎమ్ పేమెంట్ బ్యాంకు కూడా ఈ హోదాను దక్కించుకుంది.

భారతదేశంలోని షెడ్యూల్డ్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 యొక్క రెండవ షెడ్యూల్‌లో చేర్చబడిన బ్యాంకులను సూచిస్తాయి . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ షెడ్యూల్‌లో పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 42(6)(a) ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది.

షెడ్యూల్డ్ బ్యాంకులు మరియు నాన్-షెడ్యూల్డ్ బ్యాంకుల మధ్య వ్యత్యాసం ఏమిటంటే, షెడ్యూల్డ్ బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి డబ్బు తీసుకోవచ్చు, అయితే నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు RBI నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేవు. షెడ్యూల్డ్ బ్యాంక్‌లోని నగదు నిల్వ RBI వద్ద ఉంచబడుతుంది, నాన్-షెడ్యూల్డ్ బ్యాంక్ నగదు నిల్వను స్వయంగా నిర్వహించుకుంటాయి.

యూనిఫైడ్ ప్రెజెంమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ ప్రారంభం

దేశంలో బిల్లు చెల్లింపులను సుసంపన్నం చేయడం మరియు సరళీకృతం చేయడమే లక్ష్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క అనుబంధ సంస్థ భారత్ బిల్‌పే లిమిటెడ్ (NBBL) కొత్తగా యూనిఫైడ్ ప్రెజెంమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (UPMS) అనే ఫంక్షనాలిటీని ప్రవేశపెట్టింది. ఈ మెకానిజం బిల్ పేమెంట్ లావాదేవీల్లో వినియోగదారులను స్టాండింగ్‌ని సెటప్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాండ్ ఎండోర్సర్‌గా క్రికెట్ షఫాలీ వర్మ

బ్యాంక్ ఆఫ్ బరోడా తన బ్రాండ్ ఎండార్సర్‌గా భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మను ప్రకటించింది. భారతదేశం తరపున మహిళల క్రికెట్‌లో ఆమె నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు స్వాగతించే మార్గంగా షఫాలీతో ఒప్పందం కుదుర్చుకుంది.

అదానీ పవర్ సీఈఓగా షేర్సింగ్ బి ఖలియా

అదానీ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయిన అదానీ పవర్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా షేర్సింగ్ బి ఖలియా నియమితులయ్యారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయినా షేర్సింగ్ బి ఖలియా ఇదివరకు గుజరాత్ పవర్ కార్పొరేషన్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఆర్‌బిఐలో కొత్తగా ఫిన్‌టెక్ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు

భారతీయ ఫిన్‌టెక్ రంగంలో మరింత దృష్టి కేంద్రీకరించడానికి మరియు సులభతరం చేయడానికి కొత్తగా ఫిన్‌టెక్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. దీని ప్రకారం, DPSS, CO యొక్క ఫిన్‌టెక్ విభాగాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా జనవరి 4, 2022 నుండి కొత్త ఈ విభాగం సృష్టించబడింది.

ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (FSB) ఫిన్‌టెక్‌ని " ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఇన్నోవేషన్‌గా నిర్వచించింది, దీని ఫలితంగా కొత్త వ్యాపార నమూనాలు , అప్లికేషన్‌లు, ప్రక్రియలు లేదా ఆర్థిక సేవలను అందించడంలో ఈ కొత్త విభాగం మరింత భాగస్వామ్యం కానుంది.

పెట్టుబడిదారుల అవగాహన కోసం 'సా ₹థి' మొబైల్ యాప్‌ ప్రారంభం

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) పెట్టుబడిదారుల అవగాహనా కోసం మొబైల్ యాప్ Saa₹thi (సా ₹థి')ని ప్రారంభించింది. ఈ కొత్త యాప్ సెక్యూరిటీల మార్కెట్ గురించి కచ్చితమైన పరిజ్ఞానంతో పెట్టుబడిదారులను మరింతా విజ్ఞావంతులను చేయనుంది.

ఇఫ్కో కొత్త ఛైర్మన్‌గా దిలీప్ సంఘాని

ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (IFFCO) యొక్క డైరెక్టర్ల బోర్డు, దిలీప్ సంఘానిని ఇఫ్కో 17వ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గత ఏడాది బల్వీందర్ సింగ్ మరణం తర్వాత ఈ స్థానం ఖాళీగా ఉంది. దిలీప్ సంఘాని 2019 నుండి IFFCO వైస్-ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.

ఎయిర్‌ఏషియా పేరు మార్పు

మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్‌ఏషియా గ్రూప్ తన లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ పేరును 'క్యాపిటల్ A' గా మార్చుకుంది. వ్యాపార విస్తరణ మరియు న్యూ బ్రాండ్ గుర్తింపు పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇది మలేషియా బహుళజాతి బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ. విమానాల పరిమాణం మరియు గమ్యస్థానాల ప్రకారం ఇది మలేషియాలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది.

భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నాగేశ్వరన్

వి అనంత నాగేశ్వరన్ భారతదేశ కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ప్రధాన ఆర్థిక సలహాదారుడు (CEA) ఆర్థిక విషయాలపై ప్రభుత్వానికి సలహా ఇస్తారు, అలానే కేంద్ర బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు పార్లమెంట్‌లో సమర్పించే ఆర్థిక సర్వేను సాంప్రదాయకంగా స్క్రిప్ట్ చేస్తారు.

Advertisement

Post Comment