Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ యూజీ కోర్సుల అడ్మిషన్లు

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆయుష్, ఫీజియోథెరఫీ మరియు పారామెడికల్ విభాగాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సుల ప్రవేశాల కోసం డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించదు.  నీట్ యూజీ, ఎంసెట్, మరియు అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మెడికల్ & డెంటల్ కోర్సుల అడ్మిషన్ విధానం

ఎంబీబీఎస్ మరియు బిడిఎస్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ నీట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. నీట్ రిజల్ట్స్ విడుదల అయ్యాక దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రకటనను యూనివర్సిటీ విడుదల చేస్తుంది. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తుంది.

ఎలిజిబిలిటీ 50 శాతం మార్కులతో బయాలజీ గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతయి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు కనీసం 40% మార్కులు కలిగివుండాలి.
వయోపరిమితి దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
క్వాలిఫై ఎగ్జామ్ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ లలో అడ్మిషన్ పొందాలంటే నీట్ (యూజీ) పరీక్షలో  తప్పక అర్హుత సాధించాలి. కేటగిరి వారీగా నీట్ పరీక్షలో సాధించాల్సిన కట్ ఆఫ్ మార్కులు ఈ కింది విధంగా నిర్ణయించారు.
యూనివర్సిటీ ఫీజు 10,500/-

రిజర్వేషన్ వారీగా కట్ఆఫ్ మార్కులు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 50% మార్కులు
బీసీ అభ్యర్థులు 40% మార్కులు
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 40% మార్కులు
PH అభ్యర్థులు 40% మార్కులు

ఆయుష్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ

ISM & H (BAMS, BHMS, BNYS & BUMS) కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ నీట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రకటన నీట్ ఫలితాలు విడుదల అయ్యాక వెలువడుతుంది.

ఎలిజిబిలిటీ 50 శాతం మార్కులతో బయాలజీ గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతయి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు కనీసం 40% మార్కులు కలిగివుండాలి.
వయోపరిమితి దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
క్వాలిఫై ఎగ్జామ్ ISM & H (BAMS, BHMS, BNYS & BUMS) లలో అడ్మిషన్ పొందాలంటే నీట్ (యూజీ) పరీక్షలో  తప్పక అర్హుత సాధించాలి. కేటగిరి వారీగా నీట్ పరీక్షలో సాధించాల్సిన కట్ ఆఫ్ మార్కులు ఈ కింది విధంగా నిర్ణయించారు.
యూనివర్సిటీ ఫీజు 8,500/-

రిజర్వేషన్ల వారీగా కట్ఆఫ్ మార్కులు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 50% మార్కులు
బీసీ అభ్యర్థులు 40% మార్కులు
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 40% మార్కులు
PH అభ్యర్థులు 40% మార్కులు

బీఎస్సీ నర్సింగ్ (4 ఏళ్ళు) కోర్సుల అడ్మిషన్ విధానం

బీఎస్సీ నర్సింగ్ (4 ఏళ్ళు) కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఇంటర్మీడియట్ అకాడమిక్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దేనికి సంబంధించిన అడ్మిషన్ ప్రకటన ఏటా మే లేదా జూన్ నెలలలో వెలువడుతుంది. అడ్మిషన్ ప్రకటన యూనివర్సిటీ పోర్టల్ మరియు లోకల్ వార్తా పత్రికల యందు పబ్లిష్ చేస్తారు.

ఎలిజిబిలిటీ 50 శాతం మార్కులతో బయాలజీ గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతయి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు కనీసం 40% మార్కులు కలిగివుండాలి
వయోపరిమితి దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
క్వాలిఫై ఎగ్జామ్ ఇంటర్మీడియట్ (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
యూనివర్సిటీ ఫీజు 5,500/-

రిజర్వేషన్ వారీగా కట్ఆఫ్ మార్కులు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 50% మార్కులు
బీసీ అభ్యర్థులు 40% మార్కులు
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 40% మార్కులు
PH అభ్యర్థులు 40% మార్కులు

బీఎస్సీ నర్సింగ్ (2ఏళ్ళు) కోర్సుల అడ్మిషన్ విధానం

పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ (2 ఏళ్ళు) కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ జనరల్ నర్సింగ్ కోర్సుల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిషన్ జూన్ లేదా జులై నెలలలో వెలువడుతుంది. అడ్మిషన్ ప్రకటన యూనివర్సిటీ పోర్టల్ లేదా లోకల్ న్యూస్ పేపర్ యందు పబ్లిష్ చేయబడుతుంది.

ఎలిజిబిలిటీ ఏపి లేదా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కలిగిన కాలేజీల్లో 10+2 ఫార్మాట్ లో జనరల్ నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీ కోర్సుల యందు ఉత్తీర్ణతయి ఉండాలి.
వయోపరిమితి దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
క్వాలిఫై ఎగ్జామ్ జనరల్ నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీ కోర్సుల యందు ఉత్తీర్ణత
యూనివర్సిటీ ఫీజు 5,500/-

బ్యాచిలర్ ఆఫ్ ఫీజియోథెరఫీ అడ్మిషన్స్

బ్యాచిలర్ ఆఫ్ ఫీజియోథెరఫీ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఇంటర్మీడియట్, ఒకేషనల్ ఫీజియోథెరఫీ లేదా వాటికీ సరితూగే పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ జూన్ నెలలో వెలువడుతుంది.

ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ లేదా ఒకేషనల్ ఫీజియోథెరఫీ
వయోపరిమితి దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
క్వాలిఫై ఎగ్జామ్ ఇంటర్మీడియట్ లేదా ఒకేషనల్ ఫీజియోథెరఫీ
యూనివర్సిటీ ఫీజు 5,000/-

పారామెడికల్ & ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల అడ్మిషన్స్

పారామెడికల్ & ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఇంటర్మీడియట్, ఒకేషనల్ పారామెడికల్ & ల్యాబ్ టెక్నీషియన్ లేదా వాటికీ సరితూగే పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ జూన్ నెలలో వెలువడుతుంది.

ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ లేదా ఒకేషనల్ పారామెడికల్ & ల్యాబ్ టెక్నీషియన్
వయోపరిమితి దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
క్వాలిఫై ఎగ్జామ్ ఇంటర్మీడియట్ లేదా పారామెడికల్ & ల్యాబ్ టెక్నీషియన్
యూనివర్సిటీ ఫీజు 5,000/-

Post Comment