Advertisement
టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షలకు దరఖాస్తు చేయండి
Telangana

టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షలకు దరఖాస్తు చేయండి

టీఎస్‌పీఎస్సీ తాజా ఉద్యోగ భర్తీ పరీక్షల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు, మొదట దరఖాస్తు చేయాల్సిన నోటిఫికేషన్ ఎంపిక చేసుకొని, ఇదివరకు నమోదు చేసుకున్న వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ యొక్క యూజర్ ఐడీ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో టిఎస్‌పిఎస్‌సి పోర్టల్ యందు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

అభ్యర్థి లాగిన్ అవ్వగానే ఇదివరకు పొందుపర్చిన వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు స్క్రీన్ యందు కనిపిస్తాయి. అందులో మార్పు చేయాల్సిన వివరాలు ఏమైనా ఉంటె మార్పు చేసి, మీరు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఎంపికలు, వివరాలను పొందుపర్చి, దరఖాస్తు రుసుము చెల్లించి టీఎస్‌పీఎస్సీకి దరఖాస్తు సమర్పించండి.

ఓటీపీఆర్ యూజర్ నేమ్ లేదా పాస్‌వర్డ్‌ వివరాలు మర్చిపోయిన అభ్యర్థులు గాబరా పడాల్సిన అవసరం లేదు. టీఎస్‌పీఎస్సీ పోర్టల్ యందు ఉన్న Know Your TSPSC ID లింక్ ద్వారా మీ ఆధార్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా ఆ వివరాలను తిరిగి పొందొచ్చు.

దీనికి సంబందించిన లింక్ వివరాలు ఈ ఆర్టికల్ దిగువున అందుబాటులో ఉంది. సరైన వివరాలు పొందుపర్చి మీ ఓటీపీఆర్ సమాచారం పొందండి. వాటిని పొందాక, మరోసారి ఈ పరిస్థితి తెలెత్తకుండా భద్రపర్చుకోండి.

టీఎస్‌పీఎస్సీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

ఇదివరకు టిఎస్‌పిఎస్‌సి పోర్టల్ యందు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నమోదు చేయని అభ్యర్థులు, కొత్తగా సంబంధిత వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలతో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ మొబైల్ మరియు మెయిల్ ఐడీకి ఓటీపీఆర్ సంబంధించి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు అందుతాయి. అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం ఈ వివరాలను భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ వివరాలను ఉపయోగించి, టిఎస్‌పిఎస్‌సి నుండి వచ్చే ఉద్యోగ ప్రకటనలకు అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Post Comment