ఏపీ అగ్రిపాలీసెట్ 2022 | దరఖాస్తు ప్రక్రియ, షెడ్యూల్ & పరీక్ష విధానం
Admissions Agriculture Exams Andhra Pradesh Ap CETs

ఏపీ అగ్రిపాలీసెట్ 2022 | దరఖాస్తు ప్రక్రియ, షెడ్యూల్ & పరీక్ష విధానం

ఏపీ అగ్రిపాలీసెట్ 2022

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పరిధిలోని నాన్ టెక్నికల్ పాలిటెక్నిక్ కాలేజీల్లో అగ్రికల్చర్, హార్టీకల్చర్, ఫిషరీ, వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ అగ్రిపాలీసెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీతో పాటుగా, డా వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఏపీ ఫిషరీ యూనివర్సిటీ మరియు వాటి అనుబంధ కాలేజీల్లో అడ్మిషన్ పొందొచ్చు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Advertisement

అగ్రిపాలీసెట్ ద్వారా ప్రవేశం పొందే కోర్సులు

యూనివర్సిటీ  అందిస్తున్న కోర్సులు
ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ (రెండేళ్లు)
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (మూడేళ్లు)
డా వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్  హార్టీకల్చర్ (రెండేళ్లు)
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డిప్లొమా ఇన్  యానిమల్ హస్బెండరీ (రెండేళ్లు)
ఏపీ ఫిషరీ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ ఫిషరీ సైన్సెస్ (రెండేళ్లు)

ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాల నుండి పది పూర్తి చేసి ఉండాలి.
  • ప్రస్తుతం టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  •  వయోపరిమితి : అభ్యర్థుల వయసు 15 ఏళ్ళ నుండి 22 ఏళ్ళ మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేది 18 మే 2022
దరఖాస్తు తుది గడువు 01 జూన్ 2022
హాల్ టికెట్ 25 జూన్ 2022
పరీక్ష తేదీ 01 జులై 2022
ఫలితాలు 08 జులై 2022
కౌన్సిలింగ్ జులై 2022

దరఖాస్తు ప్రక్రియ

అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ తుడుగడువు లోపు https://angrau.ac.in/ వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో పరీక్ష రుసుము చెల్లించాలి. వాటి వివరాలతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. దరఖాస్తులో అభ్యర్థి యొక్క వ్యక్తిగత, చిరునామా మరియు విద్యా అర్హుత వివరాలు పొందుపరచడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
దరఖాస్తు ఫీజు 600/- (జనరల్) 500/- (ఎస్సీ & ఎస్టీ)

పరీక్ష సరళి

అగ్రిపాలీసెట్ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష 2 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం మొత్తం నాలుగు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నలు పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో టెన్త్ క్లాస్ ఆధారిత మాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ అంశాల నుండి ఇవ్వబడతాయి. ఇందులో మ్యాథ్స్ నుండి 40 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 20 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుండి 20 ప్రశ్నలు మరియు బయాలజీ నుండి 40 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లీష్ లేదా ఉర్దూ/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

సెక్షన్ సిలబస్ ప్రశ్నలు మార్కులు
సెక్షన్ I మ్యాథమెటిక్స్ 40 ప్రశ్నలు 40 మార్కులు
సెక్షన్ II ఫిజిక్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు
సెక్షన్ III కెమిస్ట్రీ 20 ప్రశ్నలు 20 మార్కులు
సెక్షన్ IV బయాలజీ 40 ప్రశ్నలు 40 మార్కులు
120 ప్రశ్నలు 120 మార్కులు

రిజర్వేషన్ కోటా & సీట్ల కేటాయింపు

ఈ పరీక్షను తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాసేందుకు అనుమతి ఉంది. కానీ మెజారిటీ అడ్మిషన్లు లోకల్ అభ్యర్థులకు కల్పిస్తారు. అనగా అందుబాటులో సీట్లలో 85% సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో కేటగిరి వారీగా ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం సీట్లు మరియు బీసీలకు 29% శాతం సీట్లు కల్పిస్తారు. రాతపరీక్షలో కనీసం 30 మార్కులు (25 శాతం) మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం అర్హుత మార్కులు నిర్ణయించలేదు.

ఆంధ్రప్రదేశ్ (85 శాతం సీట్లు) తెలంగాణ  (15 శాతం సీట్లు)
బీసీలకు 29 శాతం సీట్లు 29 శాతం సీట్లు
ఎస్సీలకు 15 శాతం సీట్లు 15 శాతం సీట్లు
ఎస్టీలకు 6 శాతం సీట్లు 6 శాతం సీట్లు

Advertisement

Post Comment