Advertisement
వార్తల్లో వ్యక్తులు | కరెంటు అఫైర్స్ మే 2022
Telugu Current Affairs

వార్తల్లో వ్యక్తులు | కరెంటు అఫైర్స్ మే 2022

ఇండియా కొత్త విదేశాంగ కార్యదర్శిగా వినయ్ మోహన్

భారతదేశం యొక్క 34వ విదేశాంగ కార్యదర్శిగా అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు స్వీకరించారు. 1998 ఐఎఫ్ఎస్ బ్యాచుకు చెందిన వినయ్ మోహన్ గతంలో గతంలో ఫ్రాన్స్ మరియు నేపాల్‌కు భారత రాయబారిగా పనిచేశారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పదవీకాలం ముగియడంతో వచ్చే రెండే కాలానికి ఆయన నియమించబడ్డారు.

యూఎస్ సీఐఏ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా నంద్ ముల్చందానీ

భారతీయ సంతతికి చెందిన నంద్ ముల్చందానీ యునైటెడ్ స్టేట్స్'కు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా నియమితులయ్యారు. ఈయన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)లో చేరడానికి ముందు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌కు సీటీఓ మరియు యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ప్రధాని మోదీ సలహాదారుగా తరుణ్ కపూర్

రిటైర్డ్ బ్యూరోక్రాట్ మరియు పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా నియమిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ మే 2న ఉత్తర్వులు జారీ చేసింది, తరుణ్ కపూర్‌ 1987 బ్యాచుకు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. అలానే పీఎంవోలో అదనపు కార్యదర్శులుగా సీనియర్‌ అధికారులు హరి రంజన్‌రావు, అతిష్‌ చంద్ర నియమితులయ్యారు.

గూగుల్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌గా అర్చన గులాటీ

ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీ గూగుల్, నీతి ఆయోగ్ మాజీ జాయింట్ సెక్రటరీ అర్చన గులాటీని గూగుల్ ఇండియా యొక్క కొత్త పబ్లిక్ పాలసీ హెడ్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది.

ఇండిగో ఛైర్మన్‌గా వెంకటరమణి సుమంత్రన్‌

దేశంలో అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో తన తదుపరి ఛైర్మన్‌గా వెంకటరమణి సుమంత్రన్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. వెంకటరమణి సుమంత్రన్ 2020 నుండి ఇదే సంస్థలో ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా రాజీవ్ కుమార్

భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా (ఈసీఐ) రాజీవ్ కుమార్ 15 మే 2022 న బాధ్యతలు స్వీకరించారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 2020లో ఉద్యోగ జీవితం నుండి పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఆయన సెప్టెంబర్ 2020 నుండి భారత ఎన్నికల సంఘంలో (ECI) సాధారణ ఎన్నికల కమీషనర్‌గా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల సుశీల్ చంద్ర పదవీ విరమణ పొందటంతో రాజీవ్ కుమారుకు ప్రధాన ఎన్నికల అధికారిగా పదోన్నతి కల్పించారు. ఈయన ఫిబ్రవరి 2025 వరకు ఈ పదవిలో ఉండనున్నారు.

లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ యొక్క మొట్టమొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి దీపికా పదుకొణె రికార్డుకెక్కింది. ఫ్రెంచ్'కు చెందిన లూయిస్ విట్టన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లగ్జరీ బ్రాండుగా ఉంది. ఇది తోలు వస్తువులు, హ్యాండ్‌బ్యాగులు, ట్రంక్‌లు, బూట్లు, గడియారాలు, నగలు వంటి ఉపకరణాలను మార్కెట్ చేస్తుంది.

ఎవరెస్ట్‌ను రికార్డు స్థాయిలో పదోసారి అధిరోహించిన షెర్పా

నేపాల్ దేశానికి చెందిన లక్పా షెర్పా, ఎవరెస్ట్ శిఖరాన్ని రికార్డు స్థాయిలో పదోసారి అధిరోహించి తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన మహిళగా ఆమె తన రికార్డును బద్దలు కొట్టింది. లక్పా షెర్పా 2018లో చివరిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. 2000లో, ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించి, అవరోహణ చేసిన మొదటి నేపాల్ మహిళగా ఆమె గుర్తింపు పొందింది. ఇదే దేశానికి చెందిన కమీ రీటా షెర్పా పురుషులలో అత్యధికంగా 26 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డును కలిగివున్నారు.

సీబీఎస్సీ చైర్మన్‌గా నిధి చిబ్బర్

సీనియర్ ఐఏఎస్ అధికారిణి నిధి చిబ్బర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) యొక్క ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అదే విధంగా మణిపూర్ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వివేక్ కుమార్ దేవాంగెన్, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆర్ఈసి లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. 46 ఏళ్ళ సైమండ్స్ రెండు ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత జట్లలో సభ్యుడుగా ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ విషాద మరణం యావత్ క్రికెట్ వర్గాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

బీఎస్‌ఈ నూతన ఛైర్మన్‌గా ఎస్ఎస్ ముంద్రా

ప్రముఖ బారతీయ స్టాక్ ఎక్స్చేంజి బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ) తమ సంస్థ నూతన ఛైర్మన్‌గా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌ఎస్ ముంద్రా ప్రస్తుతం బీఎస్ఈలో బోర్డు పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టరుగా ఉన్నారు. ప్రస్తుత బీఎస్ఈ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ విక్రమజిత్ సేన్ స్థానంలో ముంద్రా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

పర్యావరణవేత్త తిమ్మక్కను సత్కరించిన తెలంగాణ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మే 18న ప్రగతి భవన్‌లో 110 ఏళ్ల భారతీయ పర్యావరణవేత్త సాలుమరాడ తిమ్మక్కను ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌లో 'వృక్షమాతే'గా పేరుగాంచిన ఈ ఆమె 45 కిలోమీటర్ల జాతీయ రహదారి పొడుగునా దాదాపు 385 మర్రి చెట్లను నాటి, పోషించారు. ఈమెను ఇదివరకే కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ మే 18, 2022 న రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బైజల్ తన రాజీనామాను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనిల్ బైజల్ సుదీర్ఘకాలంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుగా ఉన్నారు. 31 డిసెంబర్ 2016 లో బాధ్యతలు స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల నాలుగు నెలలు ఆ పదవిలో కొనసాగారు.

ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా వినయ్ సక్సేనా

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా చేయడంతో, ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా వినయ్ సక్సేనా బాధ్యతలు స్వీకరించారు. వినయ్ సక్సేనా ఇదివరకు ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ చైర్మరుగా ఉండేవారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించడంతో 24 మే 2022న ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా 64 ఏళ్ల వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాస్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

Post Comment