Admissions Teaching Entrance Exams Telangana TS CETs

TS DEECET 2022 | షెడ్యూల్ | దరఖాస్తు పద్దతి మరియు పరీక్ష విధానం

Exam Name TS DEECET 2022
Exam Type Admission
Admission For D.EI.ED
Exam Date జులై 2022
Exam Duration 2.30 Hours
Exam Level State Level (TS)

తెలంగాణ డైట్ కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.EI.ED) మరియు డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (D.P.S.E) కోర్సులలో ప్రవేశాలు జరిపేందుకు డీసెట్ నిర్వహిస్తారు. తెలంగాణ డిపార్టుమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు 08/04/2020 లోపు దరఖాస్తు చేసుకోండి.

Advertisement

ఎలిజిబిలిటీ

  • అభ్యర్థి భారతీయ పౌరులయి ఉండాలి
  • అభ్యర్థి 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణతాయి ఉండాలి
  • అభ్యర్థి కనీస వయస్సు 17 నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి అవధి లేదు
  • అభ్యర్థి అడ్మిషన్ పొందేందుకు డీసెట్ కనీస అర్హుత మార్కులు సాదించాలి
  • యూనివర్సిటీ అడ్మిషన్ చట్టంకు అనుగుణంగా లోకల్ లేదా నాన్ లోకల్ నియమాలు సంతృప్తపర్చాలి

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ 09 మే 2022
దరఖాస్తు చివరి తేదీ 30 జూన్ 2022
హాల్ టికెట్ డౌన్‌లోడ్ జులై 2022
పరీక్ష తేదీ జులై 2022
ఫలితాలు -
కౌన్సిలింగ్ -

దరఖాస్తు ఫీజు & పరీక్షా కేంద్రాలు

  • దరఖాస్తు ఫీజు 500/- రూపాయలు
  • పరీక్షా కేంద్రాలు తెలంగాణ సంబంధించి 10 జిల్లాల్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు సమయంలో మీకు అందుబాటులో ఉండే జిల్లాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది
  • ఎంపిక చేసుకున్న జిల్లాలో పరీక్షా కేంద్రం గరిష్ట పరిమితి మించితే అభ్యర్థికి దగ్గరలో ఉండే జిల్లాలో కేటాయిస్తారు

దరఖాస్తు ప్రక్రియ

డీసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. డీసెట్ అధికారిక వెబ్‌సైట్ (www.deecet.cdse.telangana.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. డీసెట్ వెబ్సైటు నుండి పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డౌన్లోడ్ చేసి పరీక్షా సంబంధిత నియమ నిబంధనలు తెలుసుకోండి. దరఖాస్తులో నింపే విద్య, వ్యక్తిగత వివరాలలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించండి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక రెండు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

పరీక్షా సరళి

డీసెట్ పరీక్ష ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహించబడుతుంది. పరీక్షా 2 గంటల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్న పత్రం మూడు భాగాలుగా ఉంటుంది. పార్ట్ I లో 10 ప్రశ్నలు, పార్ట్ II లో 30 ప్రశ్నలు మరియు పార్ట్ III లో 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి. పార్ట్ I & II 6 నుండి 10 తరగతుల సిలబస్ నుండి ఇవ్వబడతాయి. పార్ట్ III లో ప్రశ్నలు సంబంధిత ఇంటర్మీడియట్ సిలబస్ నుండి ఇవ్వబడతయి. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటాయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది. ఋణాత్మక మార్కులు లేవు.
పార్ట్ I లో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ సంబంధిత అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.
పార్ట్ II లో ఆప్షనల్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.
పార్ట్ III లో ఆప్షనల్ సబ్జక్ట్స్నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.

తెలుగు మీడియం

సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ I జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 10
పార్ట్ II జనరల్ ఇంగ్లీష్
జనరల్ తెలుగు
10
20
10
20
పార్ట్ III మ్యాథమెటిక్స్
ఫీజికల్ సైన్సెస్
బయాలజీ
సోషల్ స్టడీస్
20
10
10
20
20
10
10
20

ఉర్దూ మీడియం

సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ I జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 10
పార్ట్ II జనరల్ ఇంగ్లీష్
జనరల్ ఉర్దూ
10
20
10
20
పార్ట్ III మ్యాథమెటిక్స్
ఫీజికల్ సైన్సెస్
బయాలజీ
సోషల్ స్టడీస్
20
10
10
20
20
10
10
20

ఇంగ్లీష్ మీడియం

సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ I జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 10
పార్ట్ II జనరల్ ఇంగ్లీష్
జనరల్ తెలుగు/ఉర్దూ
20
10
20
10
పార్ట్ III మ్యాథమెటిక్స్
ఫీజికల్ సైన్సెస్
బయాలజీ
సోషల్ స్టడీస్
20
10
10
20
20
10
10
20

అడ్మిషన్ సరళి

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ డీసెట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా కల్పిస్తారు. డీసెట్ పార్ట్ I, పార్ట్ II  మరియు పార్ట్ III  లలో 50 శాతం కనీస మార్కులు సాధించిన అభ్యర్థులను ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. టెన్త్, ఇంటర్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియా సీట్లు మాత్రమే కేటాయిస్తారు. తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళంలో చదువుకునే వారిని అవకాసం ఆయా భాషల్లో అడ్మిషన్ కల్పిస్తారు.

అందుబాటులో ఉండే సీట్లలో 80% సీట్లు గవర్నమెంట్ డైట్ కాలేజీలలో మరియు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీలలో A కేటగిరి క్రింద లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా సీట్లు కన్వినర్ కోటా క్రింద ఓపెన్ కేటగిరిలో డీసెట్ మెరిట్ వారీగా భర్తీచేస్తారు.

రిజర్వేషన్ నియమాలు

ప్రతి కోర్సులో అందుబాటులో ఉండే సీట్లలో వివిధ కేటగిర్ల వారీగా సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు తెలంగాణ పరిధికి చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. రేజర్వేషన్ల పరంగా ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 29%, NCC అభ్యర్థులకు 1%, క్రీడాకులకు 0.5% మరియు మహిళకు 33% సీట్లు కేటాయిస్తారు.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఎస్సీ అభ్యర్థులు 15% శాతం
ఎస్టీ అభ్యర్థులు 8 శాతం
బీసీ కులాలు 29 శాతం
మహిళలు 33% శాతం
NCC, Sports 1 శాతం, 0.5 శాతం

Advertisement

Post Comment