ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్షను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో మానేజ్మెంట్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష జాతీయ స్టేయిలో ఏటా రెండు సార్లు జరుగుతుంది. 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆసక్తి, అర్హుత ఉన్న అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ 2023
Exam Name | IGNOU EXAM 2023 |
Exam Type | Admission |
Admission For | MBA |
Exam Date | NA |
Exam Duration | 120 Minutes |
Exam Level | National Level |
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ సమాచారం
-
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ మానేజ్మెంట్ ప్రోగ్రామ్స్
-
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ ఎలిజిబిలిటీ
-
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ షెడ్యూల్ 2023
-
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ దరఖాస్తు ఫీజు
-
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ దరఖాస్తు ప్రక్రియ
-
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్ష కేంద్రాలు
-
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్ష నమూనా
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ మానేజ్మెంట్ ప్రోగ్రామ్స్
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మానేజ్మెంట్ పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ |
పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మానేజ్మెంట్ పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మానేజ్మెంట్ పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్సియల్ మార్కెట్స్ ప్రాక్టీస్ |
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ ఎలిజిబిలిటీ
- గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుండి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
- చివరి ఏడాది పరీక్షా రాస్తున్న వారు అడ్మిషన్ సమయానికి అండర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
- దరఖాస్తు చేసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ 2023 షెడ్యూల్
దరఖాస్తు తేదీ | NA |
అడ్మిట్ కార్డు | NA |
ఎగ్జామ్ | NA |
రిజల్ట్స్ | NA |
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ దరఖాస్తు ఫీజు
రిజర్వేషన్ కేటగిరి | దరఖాస్తు ఫీజు |
జనరల్ కేటగిరి | 600/- |
ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు | 450/- |
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ |
అనంతపురం, తిరుపతి, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం | హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కామారెడ్డి |
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ దరఖాస్తు ప్రక్రియ
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ ఎగ్జామ్ సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతయి. (www.nta.ac.in/Ignouexam) నుండి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి పోర్టల్ని సందర్శించిన వారు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ వివరాలతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్షా ద్వారా కాకుండా అకాడమిక్ మెరిట్ ఆధారంగా యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆ సంబంధిత దరఖాస్తూ ఫీజు చెల్లించి మెరిట్ ఆధారిత అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరిన విద్య, వ్యక్తిగత సమాచారం తప్పులు దొర్లకుండా దరఖాస్తులో పొందుపర్చాలి. రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, పరీక్షా కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు పొందుపర్చినప్పుడు మరోమారు సరిచూసుకోండి. ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు.
అందువలన అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి.
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్ష నమూనా
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్ష ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా 3 గంటల నిడివితో 200 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవెర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 200 ప్రశ్నలు ఇవ్వబడతయి.
ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సిలబస్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
జనరల్ అవెర్నెస్ | 30 | 30 | 180 నిముషాలు |
ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 50 | 50 | |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | |
రీజనింగ్ | 70 | 70 | |
మొత్తం | 200 | 200 |