అత్యున్నత చౌకైన విదేశీ విద్యను అందించే దేశాలలో జర్మనీ మొదటి వరుసలో ఉంటుంది. ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగులో సగానికి పైగా యూనివర్శిటీలు జర్మనీలో కొలువుదీరి ఉన్నాయి. ప్రతిభను చాటే విద్యార్థులకు జర్మన్ ప్రభుత్వం ఉచిత విద్యను కూడా ఆఫర్ చేస్తుంది. ఏటా 20 నుండి 30 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్తున్నారు. విదేశాలలో ఉన్నత విద్య చేయాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు జర్మనీ ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు. తక్కువలో తక్కువగా 8 నుండి పది లక్షలలో జర్మినీలో విదేశీ విద్యను పూర్తి చేయొచ్చు.
380 పైగా జర్మన్ యూనివర్శిటీలు, 17 వేలకు పైగా స్టడీ ప్రోగ్రాంలను విదేశీ విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో బ్యాచిలర్ డిగ్రీల నుండి మాస్టర్స్, పీహెచ్డీ, డాక్టరేట్, లాంగ్వేజ్ కోర్సులతో పాటుగా షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జర్మనీ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు వారంలో 20 గంటల వరకు పార్ట్ టర్మ్ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. చాలా యూనివర్సిటీలు కోర్సు పూర్తియ్యాక ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి. అలానే కోర్సు పూర్తి అయ్యాక 180 రోజుల వరకు జర్మనీలో ఉండే అనుమతి ఇస్తుంది. ఈ సమయంలో వారానికి గరిష్టంగా 40 గంటల వరకు ఉద్యోగం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.
జర్మనీలో ఉన్నత విద్య
జర్మనీలో ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసే విద్యార్థులు ఆరు నుండి ఎనిమిది నెలల ముందుగా సన్నద్ధం అవ్వాలి. కోర్సు ఎంపిక నుండి స్టూడెంట్ వీసా దరఖాస్తు వరకు అన్ని దశలను ప్రణాళికా బద్దంగా పూర్తి చేయాలి. జర్మనీ యూనివర్శిటీలు రెండు దశలలో ప్రవేశాలు చేపడతాయి. మొదటి దశ ప్రవేశాలు జూన్ మరియు జులైలో నిర్వహిస్తారు. వీటిని వింటర్ అడ్మిషన్స్ అంటారు. వీటికి సంబంధించి అకాడమిక్ ఇయర్ అక్టోబర్ - మార్చి మధ్యలో ఉంటుంది. రెండవ దశ ప్రవేశాలు డిసెంబర్ నుండి జనవరి మధ్యలో నిర్వహిస్తారు. వీటిని సమ్మర్ అడ్మిషన్స్ అంటారు. దీనికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ మార్చి నుండి సెప్టెంబరు మధ్యలో ఉంటుంది.
కోర్సు ఎంపిక
విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తున్నాము అంటే, దానికి సంబంధించి బలమైన కారణం ఉండాలి. అందులో ప్రధానమైనది మీరు ఎంపిక చేసుకునే స్టడీ ప్రోగ్రాం. మెజారిటీ విదేశీ యూనివర్సిటీలు స్పెషలైజ్డ్ కోర్సులను ఎంపిక చేసుకునే విద్యార్థులకు మాత్రమే త్వరితగతిన అడ్మిషన్లు కల్పిస్తాయి. ఈ కోర్సు కోసం ఇంత దూరం వస్తున్నాడా అనే కోర్సులకు అడ్మిషన్లు కల్పించావు. వీసా జారీచేసే అధికారులు కూడా దీని కోసమే ఎక్కువ వాకాబు చేస్తారు. ఇదంతా ఉన్నత విద్య పేరుతో, విహారానికి వచ్చే విద్యార్థులను జల్లెడపట్టే ప్రక్రియలో భాగం. కావున మీరు ఎంపిక చేసుకునే కోర్సు. దానికి చెందిన భవిష్యత్ ప్రణాళిక పై మీకు స్ఫష్టమైన అవగాహనా ఉండాలి.
యూనివర్శిటీ దరఖాస్తు ప్రక్రియ
కోర్సు ఎంపిక జరిగాక విదేశీ విద్యార్థులకు కోర్సులు అందించే యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు www.uni-assist.de వెబ్సైటు ద్వారా లేదా సంబంధిత యూనివర్సిటీ పోర్టల్ యందు ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాలి. జర్మనీ యూనివెర్సిటీలలో అడ్మిషన్ పొందాలంటే కనీసం ఇంగ్లీష్ లేదా జర్మనీ బాష తెలిసి ఉండాలి. వీటికి సంబంధి లాంగ్వేజ్ అర్హుత పరీక్షా ఉత్తీర్ణత అయ్యుండాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు యూనివర్శిటీలు కోర్సు అంగీకార లేఖ మరియు అడ్మిషన్ లెటర్ అందిస్తాయి. స్టూడెంట్ వీసా లేదా స్టడీ పర్మిట్ పొందేందుకు ఈ యూనివర్సిటీ అంగీకార లేఖ (Letter of acceptance) ఉండాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి
యూనివర్సిటీల నుండి Letter of acceptance పొందాలంటే విద్యార్థి IELTS (International English Language Testing System), TOEFL (Test of English as a Foreign Language), PTE (Pearson Test of English) వంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్హుత పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెజారిటీ జర్మనీ యూనివర్సిటీలు IELTS స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. 6 to 7.5 మధ్య IELTS స్కోరు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఆర్ట్స్ మరియు లాంగ్వేజ్ కోర్సులలో చేరే విద్యార్థులు జర్మనీ లాంగ్వేజ్ తెలిసిఉండాలి.
స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియ
యూనివర్శిటీ నుండి Letter of acceptance అందిన వెంటనే స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలతో జర్మనీ ఇమ్మిగ్రేషన్ పోర్టల్ లేదా దగ్గరలో ఉండే వీసా అప్లికేషన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే వారు ఇమిగ్రేషన్ పోర్టల్ యందు రిజిస్టర్ అవ్వాలి. దరఖాస్తు అందిన తర్వాత బయోమెట్రిక్ మరియు ఇమిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం కబురు చేస్తారు. ఇదే సందర్భలో వీసా అధికారి దరఖాస్తు పరిశీలన చేస్తారు. దరఖాస్తులో ఉండే అంశాలు, విద్యార్థి చెప్పే సమాదానాలు ద్వారా వీసా అధికారి సంతృప్తి పొందితే 3 నుండి 4 వారాలలో స్టడీ పర్మిట్ జారీచేస్తారు.
వీసా ఆమోదం పొందాలంటే German blocked bank account ఓపెన్ చేసి అందులో €10,332 యూరోలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వీసా అధికారి ప్రధానంగా ఇంగ్లీష్, జర్మన్ బాషల యందు విద్యార్థికి ఉన్న బాష నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. దీనితో పాటుగా కోర్సు పూర్తిచేయడానికి అవసరమయ్యే ఫైనాన్సియల్ అసిస్టెన్స్ కలిగి ఉన్నాడా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
విదేశీ విద్యార్థుల కోసం జర్మనీ, మూడు రకాల వీసాలను జారీ చేస్తుంది. ఫుల్ టైమ్ కోర్సులలో చేరే విద్యార్థులకు జనరల్ జర్మన్ స్టూడెంట్ వీసా జారీచేస్తుంది. యూనివర్సిటీ దరఖాస్తు ప్రక్రియ కోసం వెళ్లే విద్యార్థుల కోసం జర్మన్ స్టూడెంట్ అప్లికెంట్ వీసా జారీచేస్తుంది. లాంగ్వేజ్ కోర్సులలో చేరే విద్యార్థుల కోసం జర్మన్ లాంగ్వేజ్ కోర్సు జారీచేస్తుంది.
స్టడీ పర్మిట్ ఆమోదం పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్
- ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుండి Acceptance Letter.
- కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు కలిగి ఉన్నట్లు ఖచ్చితమైన లెక్కలతో ఫైనాన్స్ రిపోర్టు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- ఆధార్/ పుట్టిన తేదీ ధ్రువపత్రం, పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్.
- జర్మనీ ఆరోగ్య భీమా సర్టిఫికెట్.
- 6 నెలల ముందుగా ఆమోదం పొందినా పాసుపోర్టు.
- నేర చరిత్ర లేనట్లు police certificates.
Cost of study in Germany
యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోల్చుకుంటే జర్మనీ స్టడీ బడ్జెట్ 60% నుండి 70% తక్కువ ఉంటుంది. జర్మనీలో ఉన్నత విద్యను ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉచితంగా అందిస్తుంది, ఇతర ఖర్చులను విద్యార్థి భరించాల్సి ఉంటుంది. అలానే జర్మన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులు కూడా అందుబాటులో ఉంటాయి. వీసా చార్జీలు కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే చాల తక్కువ, అలానే నెలవారీ జీవన వ్యయాల బడ్జెట్ కూడా 1000 నుండి $1,500 యూరోల మధ్యలోనే వుంటుంది. సాధారణ ఇండియన్ ప్రీమియం ఇనిస్టిట్యూట్ పెట్టె ఖర్చుతో జర్మనీలో ఉన్నత విద్య పూర్తిచేయొచ్చు.
విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ పరిధిలో వారానికి 20 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాలలో పూర్తిస్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే జర్మనీ ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర విద్యా రాయితీలు, విదేశీ విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కల్గిస్తాయి.
Study program | Average annual fee |
Undergraduate program | 15,000 to 20,000 ERU |
Postgraduate master's degree | 25,000 EUR to $ 45,000 EUR |
Doctoral degree | 7,000 to 15,000 ERU |
Management programs | 30,000 to 40,000 EUR |
Living expenses | Average Budget |
Accommodation | 200 to 500 EUR pm |
Living costs | Up to 5,000 EUR pm |
visa and permit | 80 EUR |
Health & insurance | 100 and 250 EUR per year |
విద్యార్థులకు ఉపయోగపడే వెబ్‌సైట్లు
- German academic exchange service (DAAD)
- Germany Embassy In India
- German Federal Foreign Office
- Study in Germany
- Germany University Admissions