తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 28 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 28 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 28 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ మృతి

గీతా ప్రెస్ గోరఖ్‌పూర్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. బైజ్‌నాథ్ అగర్వాల్ 1950లో గీతా ప్రెస్‌లో తన కెరీర్ ప్రారంభించారు. ఆయన 73 సంవత్సరాల పాటుగా గీతా ప్రెస్‌లోనే పనిచేస్తూ తన పూర్తి జీవితం సామాజిక అవగాహన మరియు మానవ సంక్షేమానికి అంకితం చేసారు. గత 40 సంవత్సరాలుగా ఆయన గీతా ప్రెస్‌కి ట్రస్టీగా సేవలు అందించారు. గీతా ప్రెస్‌ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇందుకుగానూ ఆయనను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌కి 2021 సంవత్సరానికి గాను గాంధి శాంతి బహుమతిని కేంద్రం ప్రదానం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని జ్యూరీ, జూన్ 18, 2023న సామాజిక, మరియు ఆర్థిక రంగాలలో అందించిన విశిష్ట సహకారానికి గుర్తింపుగా 2021 సంవత్సరానికి గాంధి శాంతి బహుమతి గ్రహీతగా గీతా ప్రెస్, గోరఖ్‌పూర్‌ను ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.

గీతా ప్రెస్ అనేది హిందూ మత గ్రంథాలను ప్రచురించే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణకర్తగా పేరుపొందిన భారతీయ పుస్తక ప్రచురణకర్త. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నగరంలో ఉంది. గీతా ప్రెస్ 16.21 కోట్ల శ్రీమద్ భగవద్గీతతో సహా 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. దీనిని ఏప్రిల్ 29, 1923న జై దయాళ్ గోయెంకా, ఘనశ్యాం దాస్ జలాన్ మరియు హనుమాన్ ప్రసాద్ పొద్దార్ స్థాపించారు. సనాతన ధర్మం లేదా హిందూమతం యొక్క శాశ్వతమైన సత్యం యొక్క సూత్రాలను ప్రచారం చేయడం దీని ప్రధాన లక్ష్యం.

వారియర్ ఆన్ వీల్స్ – వీల్ చైర్ టు పద్మశ్రీ పుస్తకం విడుదల

జమ్మూ మరియు కాశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్‌లోని రాజ్ భవన్‌లో అక్టోబర్ 27, 2023న “వారియర్ ఆన్ వీల్స్ – వీల్ చైర్ టు పద్మశ్రీ” అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం వికలాంగుల సంక్షేమ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పద్మశ్రీ డాక్టర్‌ కానుభాయ్‌ టైలర్‌ యొక్క అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది.

డాక్టర్ కనుభాయ్ టైలర్ భారతదేశంలోని వికలాంగుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త మరియు పరోపకారి. అతను వికలాంగులకు విద్య, వృత్తి శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన డిసేబుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు కూడా. డాక్టర్ టైలర్ ఇటీవలే భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు.

ఇండియన్ ఎకనామిక్స్ & అలైడ్ సైన్సెస్ అసోసియేషన్ 4వ వార్షిక సమావేశం

శ్రీనగర్‌లోని కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇండియన్ ఎకనామిక్స్ & అలైడ్ సైన్సెస్ అసోసియేషన్ 4 వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. భారతదేశం యొక్క అభివృద్ధి వ్యూహం: ఆత్మనిర్భర్ భారత్ మరియు అంతకు మించి అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఇది భారతదేశం అంతటా ఉన్న ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు మరియు విధాన రూపకర్తలను ఒక వేదికపై చేర్చి దేశ ఆర్థిక అభివృద్ధి వ్యూహం మరియు ముందున్న సవాళ్లు మరియు అవకాశాల గురించి చర్చించింది. మూడు రోజుల ఈ సదస్సు 2047 నాటికి విక్షిత్ భారత్ నినాదానికి కట్టుబడి ఉంది.

లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా తన ప్రారంభోపన్యాసంలో భారతదేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో ఆత్మనిర్భర్ భారత్ (స్వీయ-ఆధారిత భారతదేశం) యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. ఆత్మనిర్భర్ భారత్ అనేది ఒంటరివాదానికి సంబంధించినది కాదని, స్వావలంబన మరియు స్థితిస్థాపకతకు సంబంధించినదని ఆయన అన్నారు.

వృద్ధి-ఆధారిత రంగాల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి సమిష్టి కృషి చేయాలని మరియు ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు, మహిళా సాధికారత, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యాభివృద్ధి మరియు ఆరోగ్యం మరియు పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో కోవిడ్ అనంతర భారత ఆర్థిక వ్యవస్థ, ఆత్మనిర్భర్ భారత్, ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగం పాత్ర మరియు వాతావరణ మార్పు మరియు పేదరికం సవాళ్లు వంటి అంశాలపై వివిధ సెషన్‌లు జరిగాయి.

ఇండియన్ ఎకనామిక్స్ & అలైడ్ సైన్సెస్ అసోసియేషన్ యొక్క 4వ వార్షిక సమావేశం సమయానుకూలమైన మరియు ముఖ్యమైన సంఘటన. ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధి వ్యూహాన్ని చర్చించడానికి మరియు ముందున్న సవాళ్లు మరియు అవకాశాలను పరిష్కరించడానికి మార్గాలను గుర్తించడానికి నిపుణుల కోసం ఒక వేదికను అందించింది. భారతదేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందిస్తున్నందున, ఈ సదస్సు యొక్క తీర్మానాలు మరియు సిఫార్సులు ప్రభుత్వానికి విలువైన ఇన్‌పుట్‌లుగా ఉంటాయి.

సీడీఆర్ ఎం అరుణ్ చక్రవర్తికి తొలి నిబ్ గౌరవం

భారత నౌకాదళం యొక్క సర్దార్ కేఎం పనిక్కర్ 'నేవీ ఇంటెలెక్చువల్ బీకాన్ (నిబ్)' వ్యాస పోటీలో విజేతగా నిలిచిన సీడీఆర్ ఎం అరుణ్ చక్రవర్తికి తన ఛాంబర్‌లో జరిగిన క్లుప్త ప్రజెంటేషన్ వేడుకలో నావల్ స్టాఫ్ చీఫ్ అడ్ఎమ్ ఆర్ హరి కుమార్ తొలి 'NIB' (నేవీ యొక్క మేధో మార్గదర్శిని) అవార్డును బహూకరించారు. ఈ అవార్డును ఈ ఏడాదినే ప్రారంభించారు.

ఈ అవార్డు నౌకాదళ సమాజంలో చదవడం, రాయడం మరియు ఆలోచనా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టబడింది. మహాసముద్రాల ప్రాముఖ్యత మరియు సముద్ర సంబంధ విషయాల గురించి భారతదేశంలో సముద్ర మేల్కొలుపు/ చైతన్యాన్ని తిరిగి తీసుకువచ్చిన సముద్ర వ్యూహాత్మక ఆలోచనాపరుడు సర్దార్ కేఎం పనిక్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రవేశపెట్టారు.

కెప్టెన్ (కల్నల్ సమానమైన) స్థాయి కంటే తక్కువ స్థాయి అధికారులందరూ ఇందులో పాల్గొనేందుకు అర్హులు. విజేత కోసం ఒక ప్రత్యేకమైన బ్యాడ్జ్ ప్రవేశపెట్టబడింది. విజేత దానిని ఒక సంవత్సరం పాటు అతని లేదా ఆమె యూనిఫాంపై ధరించడానికి అనుమతించబడతారు. ఈ బ్యాడ్జ్‌ను నావల్ స్టాఫ్ చీఫ్ ద్వారా ఏటా పోటీ విజేతకు అధికారికంగా అందజేస్తారు.

అక్టోబర్ 28 మరియు 29 తేదీలలో పాక్షిక చంద్రగ్రహణం

అక్టోబర్ 28-29 తేదీలలో భారతదేశం అంతటా పాక్షిక చంద్రగహణం ఏర్పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకారం అర్ధరాత్రి సమయంలో సంభవించే ఈ పాక్షిక చంద్రగ్రహణం భారతదేశం అంతటా గమనించవచ్చు. గంట 19 నిమిషాల నిడివితో సాగే ఈ ప్రక్రియ అక్టోబర్ 29 తెల్లవారుజామున 02:24 గంటలకు ముగుస్తుంది. అక్టోబర్ 14న సంభవించిన సూర్యగ్రహణం తర్వాత కేవలం 14 రోజుల వ్యవధిలో ఈ చంద్రగ్రహణం చోటు చేసుకుంది

భారతదేశంతో పాటు, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, తూర్పు దక్షిణ అమెరికా, ఈశాన్య ఉత్తర అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది.

చంద్రుడు భూమి యొక్క పెనుంబ్రా లేదా పాక్షిక నీడ గుండా వెళుతున్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక చంద్రగ్రహణం సమయంలో, చంద్రుని యొక్క కొంత భాగం మాత్రమే భూమి యొక్క నీడతో కప్పబడి ఉంటుంది. మిగతా భాగం భూమి యొక్క వాతావరణం ద్వారా ఫిల్టర్ చేయబడ్డ సూర్యకాంతి వలన ఎరుపు రంగులో కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగహణ సమయంలో పూర్తి చంద్రుడు భూమి యొక్క పెనుంబ్రా పరిధిలోకి వచ్చి నల్లగా కనిపిస్తాడు. చంద్ర గహణం సాధారణంగా ఒకే సమాంతర రేఖలో చంద్రుడు, సూర్యుడు మధ్యలో భూమి ప్రవేశించే సమయంలో ఏర్పడుతుంది.

30 ప్రముఖ నగరాలతో స్వదేశ్ దర్శన్ 2.0

భారత పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క దేశంలోని 30 ప్రముఖ నగరాలతో స్వదేశ్ దర్శన్ 2. 0 పథకంను ప్రారంభించింది. ఈ జాబితాలో దేశంలోని 15 రాష్ట్రాలలో చారిత్రక మరియు మతపరమైన పర్యాటక ప్రాముఖ్యత కలిగిన 30 కొత్త నగరాలు చేర్చబడ్డాయి. 2018-19 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పధకంలో ఆనంద్‌పూర్ సాహిబ్, ఫతేగర్ సాహిబ్, చమ్‌కౌర్ సాహిబ్, ఫిరోజ్‌పూర్, ఖట్కర్ కలాన్, పాటియాలా మరియు కలనౌర్ నగరాలు ఈ పథకంలో ఎంపికచేయబడ్డాయి.

కొత్తగా గోవా, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర 15 రాష్ట్రాలలో 30 నగరాలను పరిశీలించారు. వీటిలో మొదటిగా గుజరాత్‌లోని ద్వారక-ద్వారకాధీష్ ఆలయం, రుక్మణి దేవి ఆలయం, సుదామ సేతు, శివరాజ్‌పూర్ బీచ్, నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం, గోపీ తలాబ్ మరియు ద్వారకలోని భద్కేశ్వర్ మహాదేవ్ మందిరం మరియు ధోలవీర (యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం) ఈ పథకం  కింద అభివృద్ధి చేస్తారు.

అలానే గోవాలో కొల్వా మరియు పోర్వోరిమ్, బీహార్‌లోని నలంద మరియు గయ, చండీగఢ్‌లోని సుఖ్నా లేక్, రాక్ గార్డెన్, బర్డ్ పార్క్ మరియు క్యాపిటల్ కాంప్లెక్స్, అస్సాంలోని కోక్రాజార్ మరియు జోర్హాట్ నగరాలు కూడా ఇందులో ఎంపిక చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క స్వదేశ్ దర్శన్ పథకం అనేది దేశంలోని చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన నగరాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పర్యాటకుల సందర్శనను ఆహ్లాదకరంగా మరియు చిరస్మరణీయంగా మార్చే లక్ష్యంతో రూపుదిద్దుకుంది.

పర్యాటకులు ఈ నగరాల్లో ఎక్కువ కాలం ఉండేలా మరియు చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వం గురించి సవివరమైన సమాచారాన్ని పొందేలా చేయడం ప్రభుత్వ ప్రయత్నం. ఇది భారత పర్యాటక పరిశ్రమకు ఊతం ఇస్తుంది. స్వదేశ్ దర్శన్ పథకం యందు 15 థీమ్-ఆధారిత సర్క్యూట్‌లు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో

  • బుద్ధ సర్క్యూట్ : బౌద్ధ పర్యాటకులకు సంబంధించి ముఖ్యమైన తీర్థయాత్రలు ఈ సర్క్యూట్‌లో చేర్చబడ్డాయి. ఇది మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కవర్ చేస్తుంది.
  • కోస్టల్ సర్క్యూట్ : ఇది దేశంలోని త్రీరప్రాంత రాష్ట్రాలలోని ప్రముఖ ప్రదేశాలను కవర్ చేస్తుంది. ఇది గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిధిలో అమలు చేయబడుతుంది.
  • ఎడారి సర్క్యూట్ : ఇది ఏడాది ప్రాంతాలలోని పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇది రాజస్థాన్ థార్ ఎడారి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.
  • ఎకో సర్క్యూట్ : ఎకో టూరిజం ప్రాంతాలను కవర్ చేస్తుంది. దీని పరిధిలో కేరళ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం మరియు జార్ఖండ్ రాష్ట్రాలు కవర్ చేయబడుతున్నాయి.
  • హెరిటేజ్ సర్క్యూట్ : భారతదేశం 36 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో మరియు దాదాపు 36 తాత్కాలిక జాబితాలో ఉన్నప్రాంతాలను కవర్ చేస్తుంది. రాజస్థాన్, అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పుదుచ్చేరి, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఈ సర్క్యూట్ కింద ఉన్నాయి.
  • ఈశాన్య సర్క్యూట్ : ఈశాన్య సర్క్యూట్‌లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర మరియు సిక్కిం రాష్ట్రాల్లో పర్యాటక-కేంద్రీకృత అభివృద్ధి ఉంది.
  • హిమాలయన్ సర్క్యూట్ : ఇది హిమాలయ రాష్ట్రాల పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది. దీని పరిధిలోకి జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య రాష్ట్రాలు వస్తాయి.
  • సూఫీ సర్క్యూట్ : ఇది భారతదేశంలోని పురాతన సూఫీ సాంప్రదాయ పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది.
  • కృష్ణా సర్క్యూట్ : ఇది శ్రీకృష్ణుడి ఇతిహాసాలకు సంబంధించిన స్థలాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని పరిధిలో హర్యానా మరియు రాజస్థాన్‌లు చేర్చబడ్డాయి.
  • రామాయణ సర్క్యూట్ : ఇది దేశవ్యాప్తంగా శ్రీరాముని ఇతిహాసాలకు సంబంధించిన స్థలాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సర్క్యూట్ కింద ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
  • రూరల్ సర్క్యూట్ : గ్రామీణ టూరిజం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు మరియు దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులకు "నిజమైన" భారతదేశం గురించి ఒక సంగ్రహావలోకనం అందించడానికి రూపొందిచబడింది.
  • స్పిరిచ్యువల్ సర్క్యూట్ : ఇది దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మికత గమ్యస్థానాలను అభివృద్ధి చేస్తుంది. కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, బీహార్, రాజస్థాన్, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు ఆధ్యాత్మిక సర్క్యూట్ దృష్టిలో ఉన్నాయి.
  • తీర్థంకర్ సర్క్యూట్ : ఇది దేశంలోని జైన పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తుంది.
  • వైల్డ్‌లైఫ్ సర్క్యూట్ : ఇది భారతదేశంలోని జాతీయ మరియు రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మరియు అభయారణ్యాల పర్యాటకాన్ని కవర్ చేస్తుంది. అస్సాం మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దీని దృష్టిలో ఉన్నాయి.
  • ట్రైబల్ సర్క్యూట్ : భారతదేశం యొక్క శక్తివంతమైన గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి, పండుగలు, హస్తకళ, కళ, ఆచారాలను కవర్ చేస్తుంది. గిరిజన సర్క్యూట్ అభివృద్ధి కోసం ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఎంపిక చేయబడ్డాయి.

ఇంఫాల్‌లో ఘనంగా మేరా హౌచొంగ్బా ఫెస్టివల్

ఆదివాసీ కొండల ప్రజలు మరియు లోయ ప్రజల మధ్య సోదర బంధాన్ని సజీవంగా ఉంచే మరియు బలపరిచే పురాతన పండుగ మేరా హౌచొంగ్బా ఇంఫాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఇది మణిపూర్‌లోని కొండ తెగలు మరియు లోయ ప్రజల మధ్య ఐక్యత మరియు సోదరభావాన్ని జరుపుకునే వార్షిక పండుగ. మణిపూర్‌లోని పూర్వపు రాజభవనం అయిన కాంగ్లాలో ఈ ఉత్సవం జరుగుతుంది.

మణిపూర్ మాజీ రాజభవనం కాంగ్లాలో మతపరమైన వేడుకతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. వేడుక అనంతరం సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఆహారపదార్థాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. మణిపూర్‌లోని కొండ తెగలు మరియు లోయ ప్రజల మధ్య బహుమతి మార్పిడి కార్యక్రమం కూడా ఉంటుంది. మేరా హౌచొంగ్బా మణిపూర్‌లో ఒక ప్రసిద్ధ పండుగ. ఆ రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. మణిపూర్ యొక్క ప్రత్యేక సంస్కృతి మరియు సంప్రదాయాలను అనుభవించడానికి ఇది ఒక గొప్ప అవకాశం.

Post Comment