TSSPDCL సబ్-ఇంజనీర్ & జూనియర్ లైన్‌మెన్ నోటిఫికేషన్ 2022
Latest Jobs TSPSC

TSSPDCL సబ్-ఇంజనీర్ & జూనియర్ లైన్‌మెన్ నోటిఫికేషన్ 2022

సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్

నియామక నోటిఫికేషన్ 2022

తెలంగాణకు చెందిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వివిధ విద్యుత్ సిబ్బంది భర్తీ కోసం నియామక ప్రకటన విడుదల చేసింది. విడివిడిగా వెలువరించిన ఈ నియామక ప్రకటనల ప్రకారం సబ్-ఇంజనీర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ మరియు జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ-గద్వాల్, నారాయణపేట, నల్గొండ, భోంగిర్-యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు హైదరాబాద్ జిల్లాల పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు

పోస్టు పేరు  లిమిటెడ్ రిక్రూట్మెంట్  జనరల్ రిక్రూట్మెంట్ జీతభత్యాలు
సబ్-ఇంజనీర్ (201) 19 పోస్టులు 182 పోస్టులు ప్రారంభ జీతం 45,205/-
అసిస్టెంట్ ఇంజనీర్ (70) - 70 పోస్టులు ప్రారంభ జీతం  64,295/-
 లైన్‌మెన్ పోస్టులు (1000) 553 పోస్టులు 447 పోస్టులు ప్రారంభ జీతం  24,340/-

ముఖమైన తేదీలు

అసిస్టెంట్ ఇంజనీర్ సబ్-ఇంజనీర్ లైన్‌మెన్
దరఖాస్తు ప్రారంభం  12 మే 2022 15 జూన్ 2022 19 మే 2022
దరఖాస్తు తుదిగడువు 03 జూన్ 2022 05 జులై 2022 08 జూన్ 2022
హాల్ టికెట్  11 జులై 2022 23 జులై 2022 11 జులై 2022
పరీక్ష తేదీ 17 జులై 2022 31 జులై 2022 17 జులై 2022

పోస్టు వారీగా ఎలిజిబిలిటీ

ఎలిజిబిలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ సబ్-ఇంజనీర్ లైన్‌మెన్
ఎడ్యుకేషన్  ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ డిప్లొమా ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ డిప్లొమా లేదా బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఐటీఐ (ఎలక్ట్రికల్ /వైర్ మ్యాన్) లేదా ఒకేషనల్ (ఎలక్ట్రికల్)
వయోపరిమితి 18 నుండి 44 ఏళ్ళు 18 నుండి 44 ఏళ్ళు 18 నుండి 35 ఏళ్ళు

గమనిక : రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు, ఆయా కేటగిర్ల వారీగా 3 నుండి గరిష్టంగా 5 ఏళ్ళ వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం & ఎగ్జామ్ ఫీజు

అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ వారి తుడుగడువు లోపు www.ssouthernpower.cgg.gov.in వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో అప్లికేషన్ మరియు ఎగ్జామ్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. రెండవ దశలో సంబంధిత చెల్లింపు ఐడీ ఉపయోగించి దరఖాస్తు తదుపరి ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అభ్యర్థి యొక్క వ్యక్తిగత, చిరునామా మరియు విద్యా అర్హుత వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అలానే ఆధార్ నెంబర్, ఇమెయిల్ వివరాలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
దరఖాస్తు ఫీజు అసిస్టెంట్ ఇంజనీర్ సబ్-ఇంజనీర్ లైన్‌మెన్
అప్లికేషన్ ఫీజు Rs 200/- Rs 200/- Rs 200/-
ఎగ్జామ్ ఫీజు
(జనరల్ అభ్యర్థులకు మాత్రమే)
Rs 120/- Rs 120/- Rs 120/-

రాతపరీక్ష విధానం

జూనియర్ లైన్‌మెన్

జూనియర్ లైన్‌మెన్ పోస్టుల నియామక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో 2 గంటల నిడివితో 80 మార్కులకు ఓఎంఆర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 65 ప్రశ్నలు ఐటీఐ సబ్జెక్టుల నుండి మిగతా 15 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ అంశాల నుండి ఇవ్వబడతాయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఈ పరీక్షలో కనీసం 20 మార్కులు సాధించిన అభ్యర్థులను రెండవ దశ కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు.

రెండవ దశలో వృత్తిపరమైన అర్హుత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మీటర్ రీడింగ్ నమోదు చేయడం, ఎలక్ట్రికల్ పోల్ ఎక్కడం వంటివి వివిధ టెస్టులు నిర్వహిస్తారు. తుది ఎంపిక రాతపరీక్ష పరీక్ష మరియు వివిధ రిజర్వేషన్ కోటా ఆధారంగా పూర్తి చేస్తారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి, సొసైటీల ద్వారా నిమగ్నమై ఉన్న సిబ్బందికి 20 మార్కుల వెయిటేజీ కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులలు రెండేళ్లు ట్రైనింగ్ మరియు ప్రొబిషన్ ఆధారిత సిబ్బందిగా పనిచేయాల్సి ఉంటుంది.

సిలబస్ ప్రశ్నలు  మార్కులు  సమయం 
ఐటీఐ & జనరల్ నాలెడ్జ్ 80 ప్రశ్నలు 80 మార్కులు 2 గంటలు

ఇంజనీరింగ్ అసిస్టెంట్ & సబ్ ఇంజనీర్

ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు సబ్ ఇంజనీర్ పోస్టుల నియామక ప్రక్రియ 100 శాతం రాతపరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 2 గంటల నిడివితో 100 మార్కులకు ఓఎంఆర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 80 ప్రశ్నలు టెక్నికల్ సబ్జెక్టుల నుండి మిగతా 20 ప్రశ్నలు జనరల్ అవెర్నెస్ అంశాల నుండి ఇవ్వబడతాయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.

సిలబస్ ప్రశ్నలు  మార్కులు  సమయం 
టెక్నికల్ సబ్జెక్టు & జనరల్ అవెర్నెస్ 100 ప్రశ్నలు 100 మార్కులు 2 గంటలు

Post Comment