ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2023 | ఏఐబీఈ ఎలిజిబిలిటీ
Admissions Law Entrance Exams

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2023 | ఏఐబీఈ ఎలిజిబిలిటీ

యువ లా గ్రాడ్యుయేట్లకు, లా ప్రాక్టీసుకు సంబంధించి చట్ట పరమైన అర్హుతను కల్పించేందుకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ జాతీయ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హుత సాధించడం ద్వారా దేశంలో ఉండే ఎగువ, దిగువ కోర్టులలో న్యాయవాదులుగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు అనుమతి లభిస్తుంది.

2015-16 విద్యా సంవత్సరం నుండి నూతన లా గ్రాడ్యుయేట్లు అందరికి బార్ ఎగ్జామినేషన్ తప్పనిసరి చేసారు. ఈ పరీక్ష ప్రధానంగా న్యాయ పరమైన సబ్జెక్టులపై మరియు చట్టపరమైన అంశాలపై యువ న్యాయవాదుల అవగాహనతో పాటుగా ఆయా అంశాలపై వారికున్న ప్రాధమిక విశ్లేషణ సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు నిర్వహిస్తారు.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ జాతీయ స్థాయిలో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. పరీక్షా 3 గంటల 30 నిముషాల నిడివితో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. అర్హుత సాధించిన అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా "సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్" అవార్డుని అందజేస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు స్టేట్ బార్ కౌన్సిల్'లో అడ్వాకేట్'గా రిజిస్టర్ చేసుకుని ఉండాలి.

Exam Name AIBE 2023
Exam Type Eligibility
Eligibility For Law Practice
Exam Date 05/02/2023
Exam Duration 3.30 Hours
Exam Level National Level

ఏఐబీఈ 2023 ముఖ్యమైన తేదీలు

ఏఐబీఈ దరఖాస్తు ప్రారంభం 13 డిసెంబర్ 2022
ఏఐబీఈ దరఖాస్తు గడువు 16 జనవరి 2023
ఏఐబీఈ ఎగ్జామ్ తేదీ 05 ఫిబ్రవరి 2023
ఏఐబీఈ ఫలితాలు మార్చి 2023

ఏఐబీఈ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి
  • దరఖాస్తు చేసే అభ్యర్థులు మూడేళ్ళ LLB లేదా ఐదేళ్ల LLB ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • రాష్ట్ర పరిధిలో ఉండే స్టేట్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా రిజిస్టర్ అయ్యి ఉండాలి
  • AIBE పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి గరిష్ట పరిమితి లేదు
పరీక్ష ఫీజు ఎగ్జామ్ కేంద్రాలు
ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు - 2560/-
జనరల్ & ఓబీసీ కేటగిరి అభ్యర్థులు - 3560/-
విజయవాడ
హైదరాబాద్

ఏఐబీఈ దరఖాస్తు విధానం

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (www.allindiabarexamination.com) అధికారిక వెబ్సైటు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. స్టేట్ బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా రిజిస్టర్ అయినా అభ్యర్థుల నుండి మాత్రమే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు స్వీకరిస్తుంది.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం దరఖాస్తులో విద్య, వ్యక్తిగత మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అలానే వీటికి సంబంధించిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి ఉండాలి. సగం నింపిన దరఖాస్తులు రిజెక్ట్ చేయబడతయి.

ఫొటోగ్రాఫ్, సంతకం, ఫోటో ఐడి, ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ దరఖాస్తుతో పాటుగా పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులో పోస్టులో అనుమతించారు. దరఖాస్తులో సంబంధిత వివరాల్ని పూర్తిగా పొందిపర్చకా, దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఒక సారి దరఖాస్తు సబ్మిట్ చేసాక దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉండదు.

ఏఐబీఈ ఎగ్జామ్ నమూనా

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. పరీక్ష నిడివి 3 గంటల 30 నిముషాలు. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 100 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో మొత్తం 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి క్వశ్చన్ నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడుతుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు.

పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
ఏఐబీఈ ఎగ్జామ్ నమూనా 100 ప్రశ్నలు 100 మార్కులు 3.30 గంటలు
ఏఐబీఈ సిలబస్
రాజ్యాంగ చట్టం (10 మార్కులు)
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 10 (10 మార్కులు)
సివిల్ ప్రొసీజర్ కోడ్ 10 (10 మార్కులు)
భారతీయ శిక్షాస్మృతి (8 మార్కులు)
ఎవిడెన్స్ యాక్ట్ (8 మార్కులు)
ఫ్యామిలీ లా (8 మార్కులు)
కాంట్రాక్ట్ చట్టం, నిర్దిష్ట ఉపశమనం, ఆస్తి చట్టాలు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ (8 మార్కులు)
మోటారు వాహన చట్టం మరియు వినియోగదారుల రక్షణ చట్టంతో సహా లా ఆఫ్ టోర్ట్ (5 మార్కులు)
పన్ను చెల్లింపుకు సంబంధించిన చట్టం (4 మార్కులు)
కార్మిక మరియు పారిశ్రామిక చట్టాలు (4 మార్కులు)
మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారము (4 మార్కులు)
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (4 మార్కులు)
ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ బిసిఐ నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ దుష్ప్రవర్తన కేసులు (4 మార్కులు)
పరిపాలనా చట్టం (3 మార్కులు)
పర్యావరణ చట్టం (2 మార్కులు)
భూసేకరణ చట్టం (2 మార్కులు)
సైబర్ లా (2 మార్కులు)
మేధో సంపత్తి చట్టాలు (2 మార్కులు)
కంపెనీ లా (2 మార్కులు)

ఏఐబీఈ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో 40 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటిస్తారు. ఎగ్జామ్ జరిగిన రెండు నుండి 3 వారాలలో ఫలితాలు విడుదల చేస్తారు. అర్హుత సాధించిన వారి జాబితా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైటులో అందుబటులో ఉంటుంది.

అర్హుత పొందిన వారి రిజల్ట్ మొబైల్ మరియు మెయిల్ ద్వారా అందజేస్తారు. ఏఐబీఈ పరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులకు "సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్" అవార్డు అందజేస్తారు. ఈ సర్టిఫికెట్ పొందినవారు సుప్రీం కోర్టు మినహా మిగతా అన్ని రకాల కోర్టులలో లా ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభిస్తుంది.