ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ వివరాలు తెలుసుకోండి
APPSC

ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ వివరాలు తెలుసుకోండి

ఏపీపీఎస్సీ ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలయ్యే ప్రతీసారి, అభ్యర్థి తమ పూర్తి వివరాలు నమోదుచేయాల్సిన బెడద లేకుండా, వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రవేశపెట్టింది.

వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రకియ ద్వారా, అభ్యర్థి ఒకసారి ఏపీపీఎస్సీ పోర్టల్ యందు తమ వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు పొందుపరిస్తే, భవిష్యత్తులో ఏపీపీఎస్సీ భర్తీచేసే ఉద్యోగాలకు ఒక క్లిక్ లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం అభ్యర్థి పొందుతారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.

వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యూమెంట్స్/వివరాలు

  • ఆధార్ కార్డు
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • అడ్రెస్స్ ఐడీ
  • ఆల్ ఎడ్యుకేషన్ పాస్ సర్టిఫికెట్స్
  • క్లాస్ 1st నుండి చివరి క్వాలిఫికేషన్ వరకు స్టడీ సర్టిఫికెట్స్
  • NCC వంటి ఇతర ధ్రువపత్రాలు
  • మొబైల్ నెంబర్
  • ఇమెయిల్ ఐడీ
  • Jpg/Jpeg ఫార్మెట్లో మీ డిజిటల్ సిగ్నేచర్
  • Jpg / Jpeg ఫార్మెట్లో మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటో

ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

OTPR నమోదు ప్రక్రియ APPSC పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకోవాలి. మొత్తం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నాలుగు దశలలో ఉంటుంది. మొదటి దశలో అభ్యర్థి ఆధార్ నెంబరును ఎంటర్ చేయాలి. అలానే ఆధార్ మరియు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ యందు వున్నా ఫార్మెట్లో పూర్తి పేరును పొందుపర్చాలి. ఇదే క్రమంలో అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్, జండర్ వివరాలను పొందుపర్చాలి.

రెండవ దశలో అభ్యర్థి తల్లిదండ్రుల వివరాలు, జన్మించిన జిల్లా, మండలం, ప్రాంతం వంటి పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి. అలానే అభ్యర్థి మాతృబాష, మతం, టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ యందు ఉన్న ఐడెంటిఫికేషన్ మర్క్స్ వివరాలు కూడా నమోదు చేయాలి. ఇదే క్రమంలో అభ్యర్థి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్రెస్స్ వివరాలు లేదా శాశ్వత చిరునామా వివరాలు పొందుపర్చాలి. వీటితో పాటుగా మొబైల్ నంబరు, ఇమెయిల్ ఐడీ వివరాలు కూడా నమోదు చేయాలి.

మూడవ దశలో 1వ తరగతి నుండి విద్యార్థి చివరి విద్యా ఉత్తీర్ణత వరకు, జాయిన్ అయినా కోర్సు, స్కూల్/కాలేజీ/యూనివర్సిటీ, ఆయా కోర్సులలో జాయిన్ అయినా మరియు ఉత్తీర్ణత పొందినా ఏడాది, చదివిన జిల్లా, హాల్ టికెట్ వంటి వివరాలను పొందుపర్చాలి. ఇక చివరిగా నాల్గువ దశలో Jpg/Jpeg ఫోర్మెట్లో మీ డిజిటల్ సంతకం మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అప్‌లోడ్  చేయడం ద్వారా OTPR నమోదు ప్రక్రియ పూర్తి అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశాక మీకు OTPR రిజిస్టర్ ఐడీ వస్తుంది. తర్వాత దశలో APPSC పోర్టల్ ద్వారా ఈ OTPR ఐడీ మరియు మొబైల్ నెంబర్ ఉపయోగించి మీ APPSC ప్రొఫైల్ అకౌంటుకు పాస్‌వర్డ్‌ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో మీ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసినట్లు భావించాలి.

ఈ ప్రక్రియ పూర్తియిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీకి OTPR ఐడీ నంబరుతో పాటుగా లాగిన్ వివరాలు పంపబడతాయి. ఈ OTPR నెంబర్ జాగ్రత్తగా భద్రపర్చుకోండి. ఈ వివరాలతో భవిష్యత్తులో APPSC నుండి వచ్చే ఉద్యోగ ప్రకటనలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పొందుపర్చిన వివరాలు పదేపదే నమోదు చేయాల్సిన బెడద ఉండదు.

మీ APPSC ID మర్చిపోతే ?

OTPR యూజర్ నేమ్ లేదా పాస్‌వర్డ్‌ వివరాలు మర్చిపోయిన అభ్యర్థులు గాబరా పడాల్సిన అవసరం లేదు. మీరు ఇదివరకు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ మరియు డేట్ ఆఫ్ బర్త్'డే లేదా ఇదివరకు దరఖాస్తు చెసుకున్న ఉద్యోగ ప్రకటన వివరాలు ఆధారంగా ఆ వివరాలను తిరిగి పొందొచ్చు. వీటికి సంబందించిన లింక్ వివరాలు మీకు APPSC లాగిన్ పేజీ దిగువున అందుబాటులో ఉంటాయి. సరైన వివరాలు పొందుపర్చి మీ OTPR సమాచారం పొందండి. వాటిని పొందాక, మరోసారి ఈ పరిస్థితి తెలెత్తకుండా భద్రపర్చుకోండి.

Direct Recruitment

Departmental Test

Andhra Pradesh State Government Employees

First Time Login Link

Post Comment