ఐఇఎల్‌టిఎస్ ఎగ్జామ్ 2023 | రిజిస్ట్రేషన్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా
Admissions Exams to study abroad

ఐఇఎల్‌టిఎస్ ఎగ్జామ్ 2023 | రిజిస్ట్రేషన్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఇఎల్‌టిఎస్) ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసెన్సీ పరీక్షలలో టోఫెల్ తర్వాత అత్యధిక యూనివర్సిటిలచే  ఆమోదించబడుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే దేశాలకు విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే ఇంగ్లీష్ యేతర అభ్యర్థులు ఐఇఎల్‌టిఎస్‌ అర్హుత సాధించటం ద్వారా తమ అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.

Advertisement

ఏడాదికి దాదాపు 48 సార్లు నిర్వహించబడే ఈ అర్హుత పరీక్షకు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1600 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్ మరియు పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే భారతీయ విద్యార్థులు ఆంగ్లభాష నైపుణ్యాలు కలిగివుండటం తప్పనిసరి కావడంతో ఇంగ్లీష్ ప్రోఫిసెన్సీ పరీక్షలకు యేటా డిమాండ్ పెరుగుతూనే ఉంది.

Exam Name IELTS
Exam Type Proficiency Test
 proficiency In English Language
Exam Date Throughout the year
Exam Duration 3 Hours
Exam Level International Level

ఐఇఎల్‌టిఎస్‌ పరీక్షను బ్రిటిష్ కౌన్సిల్‌తో పాటుగా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐడీపీ) ఆస్ట్రేలియా మరియు కేంబ్రిడ్జ్ అస్సేస్మెంట్ ఇంగ్లీష్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్ష స్కోరు ప్రపంచ వ్యాప్తంగా 11 వేలకు పైగా యూనివర్సిటీలు మరియు ఆర్గనైజషన్లలో చెల్లుబాటు అవుతుంది.

ఐఇఎల్‌టిఎస్ ఎగ్జామ్ ప్రయోజనాలు

  • ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే విద్యార్థులకు
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రోగ్రాంలలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసేవారికి
  • స్కాలర్‌షిప్ మరియు బాషా క్వాలిఫై సర్టిఫికెట్లు పొందాలనుకునే వారికి
  • ఇంగ్లీష్ బాషా నైపుణ్యలను పరీక్షించుకునేవారికి
  • విద్య మరియు ఉద్యోగ వీసాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఐఇఎల్‌టిఎస్ స్కోరు ఉపయోగపడుతుంది.

ఐఇఎల్‌టిఎస్ అకాడమిక్ మరియు జనరల్ ట్రైనింగ్

  1. ఐఇఎల్‌టిఎస్‌ పరీక్ష రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది.
  2. ఇంగ్లీష్ దేశాలలో ఉన్నత విద్యకోసం మరియు ఇంగ్లీష్ నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు వచ్చే అభ్యర్థుల కోసం ఐఇఎల్‌టిఎస్‌ అకాడమిక్ పరీక్ష నిర్వహించబడుతుది.
  3. ఉద్యోగ అవకాశాల కోసం మరియు సెకండరీ ఎడ్యుకేషన్ కోసం, వివిధ టైనింగ్ ప్రోగ్రాంల కోసం మరియు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, కెనడా దేశాలకు వలస వచ్చే వారి కోసం ఐఇఎల్‌టిఎస్‌ జనరల్ ట్రైనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.

ఐఇఎల్‌టిఎస్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్

ఐఇఎల్‌టిఎస్‌ దరఖాస్తు ప్రక్రియలో మూడు అంచెలు ఉంటాయి. మొదటి అంచెలో మీకు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. రెండవ అంచెలో పరీక్షకు దరఖాస్తుచేసుకోవాలి. మూడవ అంచెలో పరీక్ష తేదీని రిజిస్టర్ చేసుకోవటంతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.

ఐఇఎల్‌టిఎస్‌ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలలో 1600 పైగా పైగా పరీక్ష కేంద్రాలలో యేటా 48 సార్లు నిర్వహించబడుతుంది. ఇండియా లో దాదాపు 84 పరీక్ష కేంద్రాలు ఉండగా, తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ మరియు వైజాగ్ లలో చెరో రెండు లెక్కన 6 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

ఐఇఎల్‌టిఎస్‌ దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌ మరియు ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంటుంది. ఐఇఎల్‌టిఎస్‌ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అదే వెబ్‌సైట్ నుండి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని దగ్గరలో ఉన్న లోకల్ ఐఇఎల్‌టిఎస్‌ టెస్ట్ సెంటర్ యందు అందజేయటం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయొచ్చు. దరఖాస్తు సమయంలో జత చేసిన ప్రాథమిక ఐడెంటి కార్డును పరీక్ష సమయంలో కూడా అందజేయాల్సి ఉంటుంది.

మీ దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత మీ పరీక్షకు సంబంధించిన తేదీ మరియు సమయ వివరాలను ఐఇఎల్‌టిఎస్‌ మీకు అందజేస్తుంది. ఐఇఎల్‌టిఎస్‌ స్పీకింగ్ మరియు రైటింగ్ పరీక్షలు దాదాపు ఒకేరోజులో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. రెండు ఒకేరోజులో పూర్తికాకుంటే తర్వాత వచ్చే వారం రోజుల్లో పూర్తిచేసేందుకు ప్రణాళిక చేస్తారు.

ఐఇఎల్‌టిఎస్‌ ఎగ్జామ్ నమూనా

ఐఇఎల్‌టిఎస్‌ అర్హుత పరీక్ష ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. దాదాపు 3 గంటల నిడివితో సాగే ఈ అర్హుత పరీక్షలో నాలుగు సెక్షన్లలో, ఇంగ్లీష్ భాష చదవటం, వినటం, మాట్లాడటం మరియు రాయటం వంటి 4 అంశాలలో అభ్యర్థుల యొక్క ప్రావీణ్యతను పరిశీలిస్తారు. ఈ నాలుగు అంశాలలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది స్కోరును  ప్రకటిస్తారు.

ఐఇఎల్‌టిఎస్‌ అకాడమిక్  మరియు ఐఇఎల్‌టిఎస్‌ జనరల్ ట్రైనింగ్ టెస్టులు సంబంధించి వినటం మరియు మాట్లాడే విభాగాల్లో ఒకేరకమైన టెస్ట్ ఫార్మేట్ కలిగిఉంటాయి. రీడింగ్ మరియు రైటింగ్ విభాగాల్లో రెండిటికి వేరువేరు టెస్ట్ ఫార్మేట్ ఉంటుంది. వినటం, చదవటం మరియు రాయటం విభాగాలు ఒకే రోజులో పూర్తిచేయబడతాయి. స్పీకింగ్ సెక్షన్ వారం రోజులులోపు ప్రణాళిక చేయబడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు టెస్ట్ సెంటర్ వారు అందిస్తారు.

Listening 30 నిమిషాలు 40 ప్రశ్నలు ఉపన్యాసాలు లేదా తరగతి చర్చ విని..ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చేయాలి
Reading 60 నిమిషాలు 40 ప్రశ్నలు ఇచ్చిన ప్రకరణలు చదివి ఆపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయాలి.
Writing 60 నిమిషాలు 2 టాస్కులు మీరు చదివిన లేదా విన్న అంశాలను వ్యాసరూపంలో రాయాల్సి ఉంటుంది
Speaking 14 నిమిషాలు 3 టాస్కులు వ్యక్తిగత, తెలిసిన, చదివిన, విన్నవిషయాల గురించి అనర్గళంగా  మాట్లాడాలి.

ఐఇఎల్‌టిఎస్ స్కోరింగ్ విధానం

ఐఇఎల్‌టిఎస్‌ స్కోరింగ్ విధానం సులభతరంగా అందరికి అర్ధమయ్యే రీతిలో ఉంటుంది. ఐఇఎల్‌టిఎస్‌ స్కోరును బ్యాండ్ స్కోరు గా పరిగణిస్తారు. ఈ బ్యాండ్ స్కోరు స్కేల్ 1 (కనిష్టం) నుండి 9 (గరిష్టం) వరకు ఉంటుంది. ఇంగ్లీష్ భాషకు సంబంధించిన నాలుగు అంశాల యందు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు 9 బ్యాండ్ స్కోరు ఇవ్వబడుతుంది. ప్రతి సెక్షన్ లో వచ్చిన విడివిడి బ్యాండ్ స్కోరులను సగటు చేసి తుది స్కోరును అందజేస్తారు.

ఆఫ్‌లైన్‌ లో పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఫలితాలు పరీక్ష పూర్తయిన 13 రోజుల్లో అందజేస్తారు. ఆన్‌లైన్‌ లో పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఫలితాలు పరీక్ష పూర్తయిన 7 రోజుల్లో అందజేస్తారు. మీరు స్కోరును దరఖాస్తు సమయంలో మీరు ఎంపిక చేసుకున్న ఐదు యూనివర్సిటీలకు అడ్మిషన్ సమయంలో అందజేస్తారు. ఐఇఎల్‌టిఎస్‌ స్కోరు పరీక్ష ఉత్తీర్ణతైన రోజు నుండి రెండేళ్లు చెల్లుబాటు అవుతుంది.

Advertisement