స్కిల్ షేర్ క్రియేటివ్ మరియు డిజైనింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ఆన్‌లైన్ కోర్సులు అందిస్తుంది. యానిమేషన్, క్రియేటివ్ రైటింగ్, ఫోటోగ్రఫీ, ఫిలిం & వీడియో, ఫైన్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైన్, మ్యూజిక్, యూఐ & యూఎక్స్ డిజైన్, ఇలస్ట్రేషన్, వెబ్ డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్, వంటి అనేక కోర్సులు స్కిల్ షేర్ మీకు అందుబాటులో ఉన్నాయి.
స్కిల్ షేర్ అమెరికా ప్రధాన కేంద్రంగా 2010లో మైఖేల్ కర్ంజనాప్రకోర్న్ మాల్కం ఓంగ్'లు స్థాపించారు. సృజనాత్మకత నైపుణ్యాల యందు ఆసక్తి, అభిరుచి ఉండే వారికీ, దానికి సంబంధించి స్కిల్ షేర్ అతిపెద్ద ఆన్‌లైన్ లెర్నింగ్ కమ్యూనిటీని అందిస్తుంది.
ఒకే ఆలోచన ఉన్న లక్షల మంది క్రియేటివ్ లెర్నర్లను చూసి ప్రేరణ పొందాలంటే స్కిల్ షేర్ కమ్యూనిటీలో చేరాల్సిందే. స్కిల్ షేర్ కొన్ని పరిమితులతో రెండు వేలకు పైగా ఉచిత కోర్సులతో పాటుగా, 7 రోజుల అపరిమిత ట్రయిల్ పిరియడుతో 27 వేలకు పైగా ప్రీమియం కోర్సులు అందిస్తుంది.
స్కిల్ షేర్ కోర్సులు
యానిమేషన్ క్రియేటివ్ రైటింగ్ ఫోటోగ్రఫీ ఫిలిం & వీడియో ఫైన్ ఆర్ట్స్ గ్రాఫిక్ డిజైన్ మ్యూజిక్ UI & UX డిజైన్ |
వెబ్ డెవలప్మెంట్ ఇలస్ట్రేషన్ బిజినెస్ అనలిటిక్స్ ఫ్రీలాన్స్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మార్కెటింగ్ లీడర్షిప్ & మానేజ్మెంట్ లైఫ్ స్టైల్ ప్రొడక్టివిటీ |
స్కిల్ షేర్ ఎందుకు బెస్ట్
- ప్రీమియం క్రియేటివ్ నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఉత్తమ ఎంపిక
- ప్రామాణిక క్వాలిటీతో ఎవరైనా తమ కోర్సులను అప్‌లోడ్ చెయ్యొచ్చు
- ఉచిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరియు 7 రోజుల ఫ్రీ ట్రయిల్ అందుబాటులో ఉంది
- ప్రతి కోర్సుకు పూర్తిస్థాయి డెడికేటెడ్ ఫార్మ్ సపోర్ట్ లభిస్తుంది
- స్కిల్ షేర్ కోర్సుల రుసుములు మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ
- మొబైల్ యాప్ అందుబాటులో ఉంది
స్కిల్ షేర్ ఎందుకు వద్దు
- స్కిల్ షేర్ లో నాన్ క్రియేటివ్ కోర్సులు అంత ప్రామాణికంగా ఉండవు
- స్కిల్ షేర్ కోర్సులు అన్ని నిపుణులు పెట్టినవి కావు
- స్కిల్ షేర్ కోర్సుల నావిగేషన్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది
- కోర్సుల సమయ వ్యవధి సంబంధించి పరిమితి లేదు